పుట్టుకతో ముంజేయి లేని ఐఐటీ గ్రాడ్యుయేట్‌ సివిల్స్‌ విజయగాథ..!

Published on Sun, 06/14/2026 - 14:54

ఎన్నో సివిల్స్‌ విజయగాథలు చూసుంటాం. కానీ పుట్టుకతో ముజేయి లేని ఈ దివ్యాంగురాలి కథ అత్యంత విభిన్నం. సివిల్స్‌లో తొలి ప్రయత్నంలోనే విజయం సాధించినా..అనుకున్న ఐఏఎస్‌ పదవీ మాత్రం దక్కించుకోలేకపోయింది. దాంతో మరోసారి సివిల్స్‌కి సన్నద్ధమైంది. కానీ ఈ సారి వరుస వైఫల్యాలు ఎదురవ్వుతున్నా.. వెనక్కి తగ్గకుండా ప్రయత్నించి ఐఏఎస్‌ అధికారి అయ్యింది. అపజయం అంటే విజయానికి ముగింపు కాదని..ప్రయత్నం ఆపకపోవడం అని చాటిచెప్పి యువతకు స్ఫూర్తిగా నిలిచింది. 

ఆ అమ్మాయే కేరళకు చెందిన కాజల్‌ రాజు. ఆమె పుట్టుకతో ఫోకోమెలియా సిండ్రోమ్‌ అనే అరుదైన వ్యాధి కారణంగా కుడి ముంజేయి లేకుండా జన్మించింది. ఆమె చిన్ననాటి నుంచి చదువులో ముందంజలో ఉండేది. అలా భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక సంస్థలలో ఒకటైన ఐఐటి మద్రాస్‌లో డెవలప్‌మెంట్ స్టడీస్‌లో ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసిందామె. అయితే క్యాంపస్‌లో ఉన్నప్పుడే ప్రజా సేవపై మక్కువ ఏర్పడింది. 

అలా సివిల్స్‌ వైపు అడుగులు వేసింది. అయితే తొలి ప్రయత్నంలోనే విజయం అందుకుని ఆల్‌ ఇండియా 910వ ర్యాంకు దక్కించుకుని ఐఆర్‌ఎస్‌కు ఎంపికైంది. అయితే కాజల్‌ అక్కడితో ఆగిపోవాలనుకోలేదు. అందుకే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్)లో చేరడమే లక్ష్యంగా మరోసారి సివిల్స్‌కి సన్నద్ధమైంది. ఈసారి మరింతగా ర్యాంకును మెరుగుపరుచుకోవాలనుకుంటే..మరింతగా ర్యాంకు దిగజారగా, మూడోసారి ఏకంగా ప్రిలిమ్స్‌లోనే ఓటమిని చవి చూసింది. 

నిజానికి ఈ వరుస వైఫల్యం ఎవ్వరికైనా ఆత్మవిశ్వాసం సన్నగిల్లిపోయేలా చేస్తుంది. కానీ కాజల్‌కి మరింతగా బలంగా ప్రిప్రేరవ్వాలన్న కసి అంతకంతకు పెరిగింది. అలా ఆమె సివిల్స్‌లో చివరికి ఆల్ ఇండియా ర్యాంక్ 167కి  మెరుగుపరుచుకుని ఐఏఎస్‌ అధికారి అయ్యింది. ఇక్కడ కాజల్‌కి రైల్వే సర్వీస్‌ శిక్షణ, యూపీఎస్సీ ప్రిపరేసన్‌ అత్యంత సవాలుగా మారింది. 

ఈ రెండిటిని బ్యాలెన్స్‌ చేస్తూ చదవడం అత్యంత కష్టంగా ఉన్నా..ఏదోరకంగా ప్రిపరేషన్‌ కొనసాగించేది. తనకు ఏ కాస్త చిన్న సమయం దొరికినా..పుస్తకాలతో కుస్తీ పట్టేది. అంతేగాదు ఉద్యోగ బిజీ షెడ్యూల్‌ని, ప్రిపరేషన్‌ను బ్యాలెన్స్‌ చేసుకోవడానికి క్రమశిక్షణతో కూడిన నిలకడ అవసరం. ఈ కథ ఎదురుదెబ్బలు విజయాన్ని ఆలస్యం చేయొచ్చేమో గానీ అందుకోసం ప్రయత్నం మాత్రం ఆపకూడదనే స్ఫూర్తిని  సివిల్స్‌ ఔత్సాహికుల్లో నింపుతోంది కదూ..!.

(చదవండి:  92 ఏళ్ల టీచరమ్మ ఫిట్‌నెస్‌కి ఫిదా అవ్వాల్సిందే..! శాస్త్రవేత్తలు సైతం..)

 

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)