Breaking News

బిడ్డ కోసం తల్లడిల్లిన తల్లి..! సాక్షాత్తు ఆ దేవుడే..

Published on Sun, 06/15/2025 - 11:08

దేవుడు పిలిస్తే పలుకుతాడు. ప్రార్థిస్తే స్పందిస్తాడు అనేది చాలామంది భక్తుల నమ్మకం. ఆశ్చర్యకరంగా ఈసారి తల మీద అభయహస్తం ఉంచి ఆశీర్వదిస్తూ కెమెరాకు చిక్కాడు. నిజం, ఫొటోలో కనిపిస్తున్న చేయి, మామూలు చేయి కాదని, ఇది స్వర్గం నుంచి వచ్చిన దేవుని అభయహస్తమని నెటిజన్లు చేస్తున్న వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. సంగతి ఏంటంటే, కెంటకీ అమాండా అనే మహిళ, ఎనిమిది నెలల గర్భవతి. 

అంతా మూములుగా సాగుతున్న ఆమె జీవితంలో అనుకోకుండా ఒక చేదునిజం, రోజూ ఆమెను కలతకు గురిచేసింది. కడుపులోని బిడ్డకు గుండె సంబంధిత సమస్య ఉందని డాక్టర్లు చెప్పారు. దీంతో, ఆ తల్లి ప్రతి స్కాన్‌కి ముందు దేవుడిని ఒక్కటే అడిగేది– ‘దేవుడా! నా బిడ్డ ఆరోగ్యాన్ని రక్షించు’ అని. అలా ఒకరోజు అల్ట్రాసౌండ్‌ స్క్రీన్‌పై బిడ్డ తల మీద ఒక పెద్ద చేయి పెట్టి ఆశీర్వదిస్తున్నట్లు కనిపించి దేవుడు ఆమె ప్రార్థనలకు సమాధానం ఇచ్చాడు. దీంతో, ఆ తల్లి ఆనందానికి అవధులు లేవు.   

‘దేవుడు నా బిడ్డను ఆశీర్వదించాడు’ అంటూ సంతోషంలో మునిగిపోయింది. ‘ఇది ఫొటో కాదు, ఆకాశం నుంచి వచ్చిన దేవుని ప్రేమ. దేవుడు నా ప్రార్థనకు ఇచ్చిన సమాధానం’ అంటూ ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. కొంతమంది ‘అది బిడ్డ చేయే’ అని వాదించినా, చాలామంది ఇది నిజంగానే దేవుడి ఆశీర్వాదంగా... ‘ఈ ఫొటోలో దేవుడి చేయి మాత్రమే కనిపించలేదు. నీ బిడ్డను తాకాడు. భరోసా ఇచ్చాడు. తన ప్రేమను చూపాడు. ’ అంటూ ఆమె నమ్మకాన్ని మరింత బలపరుస్తున్నారు.   

(చదవండి: హాట్‌టాపిక్‌గా విమానంలోని 11A సీటు..ఎవ్వరూ ఎందుకిష్టపడరంటే..?)

Videos

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)