ఏసీ లేకుండానే ఇల్లు కూల్‌గా..! ఎలాగో తెలుసా..?

Published on Wed, 04/15/2026 - 10:13

ఇప్పుడంటే ఆధునిక టెక్నాలజీతో అత్యంత విలాసవంతమైన ఫ్లోరింగ్‌ పద్ధతులు, ఇరానీ మార్బుల్స్‌ వంటి వాటితో ఏసితో పనిలేకుండానే కూల్‌గా ఉంచుకుంటున్నారు. అయితే ఇవన్నీ అత్యంత ఖర్చుతో కూడుకున్నవి, ధనవంతులకే పరిమితమైనది. కానీ నాటి రోజుల్లోనే తక్కువ ఖర్చుతోనే ఏసీలతో పనిలేకుండానే చక్కగా ఇంటిని కూల్‌గా ఉంచే ఫ్లోరింగ్‌ పద్ధతిని వినియోగించేవారిని తెలుసా. ఏకంగా 300 ఏళ్ల నాటి క్రితం ఈ పద్ధతిని వినియోగించారు మన పూర్వీకులు. పైగా చాలా సహజ పద్ధతితలో తక్కువ ఖర్చుతో చేయడం విశేషం. ప్రస్తుతం ఈ టెక్నిక్‌ అంతరించిపోయే దశలో ఉంది. మరి అద్భుతమైన కళాత్మక టెక్నిక్‌ గురించి తెలుసుకుందామా.

ఇది పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయంగా పేర్కొనవచ్చు. ఎలాంటి రసాయనాలు వినియోగించకుండా సహజ పద్ధతిలో ఇంటిని కూల్‌గా ఉంచుకునే గొప్ప టెక్నిక్‌ ఇది. భారత్‌లో ముఖ్యంగా కొన్ని ప్రముఖ నగరాల్లో ఎండలు ఏ రేంజ్‌లో దంచికొడుతుంటాయో చెప్పాల్సిన పనిలేదు. 

అలా అని ఏసీలు, కూలర్‌లు వినియోగిస్తే..ఆ తర్వాత కరెంట్‌ బిల్లులు జేబు చిల్లుపెట్టే రేంజ్‌లో వచ్చి హడలెత్తిస్తాయి. పైగా ఎక్కువ గంటలు ఏసీలో ఉండటం ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. అలాంటప్పుడు దాదాపు 300 ఏళ్ల క్రితం కూలర్లు, ఏసీల మాట ఎత్తని ఆ రోజుల్లోనే మన పూర్వీకులు సహజంగా ఇంటిని చల్లగా ఉంచుకునే సాంప్రదాయ ఫ్లోరింగ్‌ పద్ధతిని కనుగొన్నారు. 

ఇదెలా ఉంటుందంటే..
మార్బుల్స్‌, టైల్స్‌పై ఆధారపడని కాలంలో దీనిని ప్రవేశ పెట్టారు. దీని కోసం సిమెంట్‌గానీ, రసాయనాలు గానీ వినియోగించరు. ఇందులో ఉపయోగించే పదార్థాలు కేవలం నీరు, ఐరన్ ఆక్సైడ్, సున్నం మాత్రమే. నాటి మేస్త్రీలు వీటిని తమ చేతులతో కలిపి ఫ్లోరింగ్‌ చేసేవారు. ఆ మిశ్రమం గట్టిపడ్డాక..అద్దంలాంటి తళతళలాడే మెరుపు కోసం.. కొబ్బరి నూనెతో గంటల తరబడి పాలిష్‌ చేసేవారు. కొబ్బరినూనె రంగులేని మెరుపును సృష్టించడంలో సహాయపడటం తోపాటు చల్లదనాన్ని కూడా పెంచుతుంది. 

ఈ ప్రభావాన్ని సింథటిక్ పాలిష్‌లతో సాధించలేము. వేసవికాలంలో మధ్యాహ్నం సూర్యుడి భగభగలు ఎంత గరిష్టంగా ఉన్నా..ఈ ఫ్లోరిగ్‌ పాదాల కింద మంచు మాదిరి చల్లదనాన్ని అందించడం విశేషం. దీని అద్భుతమైన మన్నికే అత్యంత విలక్షణంగా ప్రత్యేకంగా నిలబెడుతుంది. అంతేగాదు ఈ ఫ్లోర్‌ ఉపరితలం ఎంత అందంగా మెరుస్తూ ఉంటుందటే..పాదాల అడుగులు దాన్ని అరిగిపోయేలా చేయకుండా మరింత నునుపుగా ఉంచడం విశేషం. ఈ ఫ్లోరింగ్‌ పద్ధతిని కేరళలో ఎక్కువగా వినియోగించేవారట.

అంతేకాదండోయ్‌ ఈ ఫ్లోరింగ్‌ పది దశాబ్దాల వరకు ఎలాంటి గీతలు లేకుండా మన్నికగా ఉంటుందట. సాధారణంగా ఈ ఫ్లోరింగ్‌ ఎరుపు, గోధుమ ఛాయతో సహజమైన మెరుపుతో ఉంటుందట. అయితే ప్రస్తుతం ఈ విధమైన ఫ్లోరింగ్‌  చేసే కార్మికులు కొద్దిమందే ఉన్నారట. ఈ అద్భుతమైన నైపుణ్యం రాను రాను కనుమరుగవుతుండటం బాధకరం. 

 

(చదవండి: ఫిట్‌నెస్‌పై ఇంత క్రేజా?!)
 

#

Tags : 1

Videos

బైక్ ను 100 స్పీడ్ లో నడుపుతూ రీల్ చేద్దామనుకున్నారు.. కట్ చేస్తే.. రికార్డైన వీడియోలో..!

మీకంత దైర్యం ఉంటే.. మీడియా ముందుకు వచ్చి చెప్పండి..

తేల్చుకుందాం.. ఆ నొప్పి ఎలా ఉంటదో చూపిస్తాం.. చెవిరెడ్డి మాస్ వార్నింగ్

విద్యలోకి రాజకీయాలు? స్కూల్ పేపర్ లో లడ్డు కల్తీ ప్రశ్న

జగనన్న కోసం పని చేస్తున్నందుకు నా జన్మ ధన్యం అయింది.. పొన్నవోలు ఎమోషనల్

డబుల్ ధమాకా..! ఇంటర్ ఫలితాల్లో ఒకే మార్కులు సాధించిన కవలలు

టీడీపీ సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ పై పేర్ని నాని, వల్లభనేని వంశీ ఫిర్యాదు

ఫిషింగ్ హార్బర్లపై హక్కు మత్స్యకారులదే.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ఆరుగురు మృతి

రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది.. పూడి శ్రీహరి అక్రమ అరెస్ట్ పై పొన్నవోలు సంచలన రియాక్షన్

Photos

+5

మహేశ్‌బాబు బ్యానర్‌ సినిమా ‘రావు బహదూర్‌’.. సాంగ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఆర్య కొత్త సినిమా.. ‘మిస్టర్‌ ఎక్స్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

‘శ్రీనివాస మంగాపురం’ మూవీ HD స్టిల్స్

+5

‘పాపం ప్రతాప్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అప్పుడు ఎన్టీఆర్.. ఇప్పుడు రామ్ చరణ్.. ప్రముఖ మ్యాగజైన్‌పై గ్లోబల్ స్టార్ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో సినీ, క్రీడా ప్రముఖులు (ఫొటోలు)

+5

మత్స్యకారులతో వైఎస్‌ జగన్‌ మమేకం (ఫొటోలు)

+5

తిరుమలలో పండగ సెలబ్రేట్ చేసుకున్న సంయుక్త (ఫొటోలు)

+5

మెరిసిపోతున్న నభా నటేశ్ (ఫొటోలు)

+5

బ్లాక్ శారీలో మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)