Breaking News

కేబీసీ-17లో రూ. 25 లక్షల ప్రశ్న ఈ క్రికెటర్‌ గురించే.. ఇంట్రస్టింగ్‌!

Published on Fri, 08/22/2025 - 16:01

బహుళ ప్రజాదరణ పొందిన రియాల్టి షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి 17 (KBC-17)’  ప్రేక్షకులను టీవీలకు కట్టి పడేస్తోంది. ఈ షోకు సుదీర్ఘకాలంగా హోస్ట్‌గా వ్యవహరిస్తున్నబిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ వాక్చాతుర్యంతో పాటు, పార్టిసిపెంట్ల ప్రతిభాపాటవాలు కూడా వీక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజా ఎసిసోడ్‌లోని ఒక ప్రశ్న ఆసక్తికరంగా మారింది.

మహారాష్ట్రలోని జల్గావ్‌కు చెందిన పోటీదారు సాకేత్ నంద్‌కుమార్ ఒక ప్రశ్న దగ్గర ఇరకాటంలో పడిపోయాడు.  అప్పటివరకు వరుసగా సమాధానాలు చెప్పి, కొన్నింటికి లైఫ్‌లైన్లను వాడుకొని  సరిగ్గా రూ. 25 లక్షల ప్రైజ్‌మనీ దగ్గర ఆగిపోయాడు. రోల్‌ఓవర్ కంటెస్టెంట్‌గా హాట్‌ సీట్‌లో కూర్చున్న సాకేత్ నందకుమార్ ఏకంగా ఆరు భాషలు మాట్లాడకలగడంపై బిగ్‌ బీ ప్రశంసలు కురిపించారు. దీంతో  గెస్ట్‌ని జర్మన్‌లో స్వాగతించమని అడిగి కాసేపు సందడి  చేశారు. ఇక  షోలోని ప్రశ్నల విషయానికి వస్తే రూ. 25 లక్షల ప్రశ్నకు సమాధానం  చెప్పలేక సోనార్ హాట్ సీట్ తీసుకొని రూ. 12,50,000 ప్రైజ్ మనీతో నిష్క్రమించాడు.

రూ. 25 లక్షల ప్రశ్న ఏంటి అంటే
"1932లో తన టెస్ట్ అరంగేట్రంలో, ఇఫ్తికార్ అలీ ఖాన్ పటౌడీ ఇంగ్లాండ్ తరపున ఏ మైదానంలో సెంచరీ చేశాడు?" అనేది ప్రశ్న.

ఎ) ది ఓవల్ బి) మెల్బోర్న్ సి) సిడ్నీ డి) ఓల్డ్ ట్రాఫోర్డ్ అనే అప్షన్లు ఇచ్చారు.

సమాధానం తెలియక పోవడంతో సాకేత్ చివరి లైఫ్‌లైన్‌ను ఎంచుకున్నాడు కానీ సమాధానం లభించలేదు.  చివరికి  ఆప్షన్‌ ఏ ది ఓవల్ అనే తప్పు సమాధానం చెప్పాడు.  దీనికి సరైన సమాధానం ఆప్షన్‌ సి) సిడ్నీ క్రికెట్ గ్రౌండ్.

ఇఫ్తికార్ అలీ ఖాన్ పటౌడీ (1910-1952)
కాగా  పంజాబ్‌కు చెందిన  నవాబ్ మొహమ్మద్ ఇఫ్తికార్ అలీ ఖాన్ సిద్ధిఖీ పటౌడీ అలియాస్‌ ఇఫ్తికార్ అలీ ఖాన్ పటౌడీ తన టెస్ట్ అరంగేట్రం చేశాడు 1932–33లో ఆస్ట్రేలియాలోని సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (SCG)లో జరిగిన యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్ తరపున ఆడాడు. బిల్ వుడ్‌ఫుల్ నేతృత్వంలోని బలమైన ఆస్ట్రేలియన్ జట్టును ఎదుర్కొంటూ ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో అతను అద్భుతమైన 102 పరుగులు చేశాడు.  డాన్ బ్రాడ్‌మాన్‌తో టెస్ట్ అరంగేట్రంలో సెంచరీ చేసిన కొద్దిమంది క్రికెటర్లలో ఒకరిగా నిలిచాడు. బాలీవుడ్‌ నటుడు  సైఫ్ అలీ ఖాన్‌న ఇబ్రహీం అలీ ఖాన్  తన ముత్తాత నవాబ్ మొహమ్మద్ ఇఫ్తికార్ అలీ ఖాన్ సిద్ధిఖీ పటౌడీలా ఉంటాడని భావిస్తారు.

చదవండి: కేబీసీ 17లో కోటి గెల్చుకున్న తొలి వ్యక్తి..కానీ 7 కోట్ల ప్రశ్న ఏంటో తెలుసా?
 

క్విజ్ మాస్టర్ అమితాబ్ బచ్చన్‌ను ఆకట్టుకున్న సాకేత్ నందకుమార్‌ తాను గెల్చుకున్న ప్రైజ్ మనీతో ఏమి చేయాలని అనుకుంటున్నాడో తెలుసా. 

బిర్యానీ లవర్‌ : తాను బిర్యానీ ప్రేమికుడిని కాబట్టి,గెల్చుకున్న డబ్బుతో భారతదేశం అంతటా పర్యటించి దేశంలో లభించే వివిధ రకాల బిర్యానీలను రుచి చూస్తాడట. అంతేకాదు తన తల్లికి బహుమతిగా సొంత రెస్టారెంట్‌ కూడా ఓపెన్‌ చేయాలని భావిస్తున్నట్టు  చెప్పాడు.

ఇదీ చదవండి: ఎంబీఏ చదివి క్యాప్సికం సాగుతో ఏడాదికి రూ. 4 కోట్లు

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)