బిస్లరీ వాటర్ తాగుతున్నారా.. అయితే అంతే సంగతి.. FSSAI షాకింగ్ ప్రకటన..
Breaking News
కేరళకు నివాళి అర్పించే దుస్తులలో కజియా లిజ్ అద్భుతమైన లుక్..!
Published on Mon, 11/23/2026 - 11:23
ప్యూర్టో రికోలో జరుగుతున్న మిస్ యూనివర్స్ పోటీలో భారత్‌కి చెందిన కజియా లిజ్ మెజో మరో అద్భుతమైన ఫ్యాషన్ లుక్‌తో ఆకట్టుకున్నారు. 75వ అంతర్జాతీయ అందాలపోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కజియా లిజ్ మెజో, తన సొంత రాష్ట్రమైన కేరళకు నివాళి అర్పించే దుస్తులలో వేదికపైకి అడుగుపెట్టారు. ఈ దుస్తులలో ప్యూర్టోరికో ధైర్యవంతమైన, ఉత్సాహభరితమైన రంగుల కలయిక కూడా ఉండటం విశేషం.
ఈ కాస్ట్యూమ్ని 'హౌస్ ఆఫ్ సిద్ధాంత్' అనే ఫ్యాషన్ లేబుల్‌కు చెందిన సిద్ధాంత్ డిజైన్ చేయగా, మిస్ యూనివర్స్ ఇండియా సంస్థ ఈ లుక్కు సంబంధించిన వివరాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది ఇలా. ‘కజియా లిజ్ జాతీయ దుస్తులు అనే క్యాప్షన్ జోడిస్తూ ఇలా రాసుకొచ్చింది.
ఆమె దుస్తులు భారతదేశపు గొప్ప వస్త్ర వారసత్వానికి ఒక అందమైన వేడుక. ఇది ఆమె సొంత రాష్ట్రమైన కేరళ సంస్కృతి నుంచి ప్రేరణ పొందిన దుస్తులలో మెరిసింది. ఈ వస్త్రధారణ భారత్‌లోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన అద్భుతమైన వస్త్రాల సమాహారాన్ని ఒక చోట చేర్చింది.
ఇది దేశపు వైవిధ్యం, హస్తకళ, శతాబ్దాలనాటి వస్త్ర సంప్రదాయాలను ప్రదర్శిస్తోంది. ప్రతి వస్త్రం దాని స్వంత గుర్తింపు, ఆకృతి, కథను జోడిస్తోంది. ఇవన్నీ కలిసి భారతదేశపు సాంస్కృతిక వైభవానికి, సామరస్యపూర్వక ప్రాతినిధ్యాన్ని సృష్టించాయి. పైగా ప్యూర్టోరికో రంగుల శ్రేణిని మేళవించి..స్నేహపూర్వక సంబంధానికి ప్రతీగా మార్చింది తన డిజైనర్‌వేర్‌ని.
అంతర్జాతీయ వేదికపై తన సొంత గడ్డకు ప్రతికగా నిలుస్తూ..దాని సంప్రదాయాలను దృశ్య వైభవాన్ని తన డిజనర్వేర్తో చూపిస్తూ ఆకట్టుకుంది. సంస్కృతిని కళాత్మక వైభవంతో చూపేలా ఫ్యాషన్‌ని చూపించడంలో సౌందర్యాన్ని చాటిచెప్పింది కజియా. కాగా మిస్ యూనివర్స్ 2026 పోటీల గ్రాండ్ ఫినాలే నవంబర్ 24న జరగనుంది.
ఇదీ చదవండి: అవధులు లేని ప్రేమ ఈ అమ్మానాన్నలది! తండ్రి మాత్రం..
Tags : 1