Breaking News

ఐఐటీ నేపథ్యం కాదు..కానీ యూఎస్‌ ఎన్విడియాలో రూ. 2.6 కోట్ల జీతం

Published on Sun, 07/12/2026 - 14:54

ఐఐటీ వంటి ఉన్నత చదువులు ఉంటేనే అధిక జీతాలతో కూడిన ఉద్యోగాలు వస్తాయని అనుకుంటాం. కానీ సాధారణ నేపథ్యం, సాదాసీదా డిగ్రీతో అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ కూడా ఉన్నత శిఖరాలను చేరొచ్చు అని నిరూపించాడు ఈ యువకుడు. పట్టుదల, కఠోర శ్రమ, అకుంఠిత దీక్ష ఉంటే ఇదేమంత కష్టం కాదని కర్ణాటకు చెందిన ఓ సాధారణ ఇంజనీర్‌ ప్రూవ్‌ చేశాడు. ఓ మారుమూల గ్రామం నుంచి ఏకంగా అమెరికాలో ప్రతిష్టాత్మక కంపెనీలో ఉద్యోగం సంపాదించి..యువతకు స్ఫూర్తిగా నిలిచాడు.

అతడే కర్ణాటకలోని చిత్రదుర్గ సమీపంలోని గ్రామానికి చెందిన పృథ్వీరాజ్‌. తన స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని వివరిస్తూ షేర్‌ చేసిన లింక్డ్‌ఇన్‌ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఆ పోస్ట్‌ ప్రకారం..అతను బెంగళూరులోని పీఈఎస్ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. తనకు ఎలాంటి ఐఐటీ డిగ్రీ, ఉన్నత నేపథ్యం లేవని వెల్లడించాడు. కానీ నిరంతర కృషి, ఇంటర్న్‌షిఫ్‌లు, వ్యక్తిగత ప్రాజెక్టులు, తరగతి గదికి మించిన నిరంతర అభ్యాసం ద్వారా తన నైపుణ్యాను పెంపొందించుకోవడంపై దృష్టి సారించినట్లు తెలిపాడు. 

అతని అంకితభావం చివరికి ఎన్విడియాలో ఉద్యోగం సంపాదించడానికి సహాయపడిందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తాను అమెరికాలో కాలిఫోర్నియాలోని ఎన్విడియా అనే ప్రతిష్టాత్మక టెక్నాలజీ కంపెనీలో  ఏడాదికి సుమారు రూ.2.6 కోట్ల జీతం సంపాదిస్తున్నట్లు పోస్ట్ పేర్కొన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలకు శక్తినిచ్చే అధునాతన చిప్‌లను అభివృద్ధి చేసే పనిలో తను భాగమైనట్లు తెలిపాడు. 

ఈ పోస్ట్‌ నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంది. ప్రపంచ టెక్నాలజీ పరిశ్రమలో కేవలం ప్రముఖ విద్యాసంస్థలు నుంచి పట్టభద్రులైన వారు మాత్రమే విజయవంతమైన కెరీర్‌లను నిర్మించుకోగలరనే భావనను అతడి కథ తిరగరాసింది. పైగా తమ లక్ష్యాలను చేరుకోవడానికి తపిస్తున్న యువ నిపుణులకు ఈ కథ ఓ ప్రేరణ అంటూ పోస్టులు పెట్టారు. 

(చదవండి: ధగ ధగ మెరిసే ఆభరణాలు లేకుండానే..పెళ్లికూతురు రూపం!)
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)