Breaking News

ఆయనా ఓ పులే!

Published on Mon, 06/16/2025 - 11:16

ఆ రోజు నేను ఆశ్యర్య పోయాను. ఆయనో సెలబ్రిటీ అనీ, పులుల గురించి తనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదనీ నాకు తెలుసు. 40 పుస్తకాలు రాశాడు. ‘ల్యాండ్‌ ఆఫ్‌ ద టైగర్‌’ పేరిట బీబీసీ సిరీస్‌ చేశాడు. పులుల మీద ప్రపంచస్థాయి ‘అథారిటీ’ అనడానికి ఇంతకంటే రుజువేం కావాలి? ఆయన చనిపోయినప్పుడు వార్తాపత్రికల్లో విశేషమైన కవరేజి వచ్చింది. ఆయన పట్ల ఉన్న అపారమైన గౌరవాభిమానాలకు అది నిదర్శనం. ఆ స్థాయిలో తనకు గుర్తింపు ఉందని నేనెప్పుడూ అనుకోలేదు. ఆయనో ఐకాన్‌.  

వాల్మీక్‌ థాపర్‌ మృతితో ఆయన లెగసీ ఏమిటో వెల్లడైంది. ఆయన మిగిల్చిపోయే వారసత్వం, పేరు ప్రఖ్యాతులు అంతగా ఉంటాయని సొంత కుటుంబం కూడా ఊహించలేదు. ప్రకృతి సంరక్షకుడిగా, పులుల అధ్యయనకర్తగా ఆయన కనబరచిన ప్రభావం అపార మని ఆలస్యంగానైనా గుర్తించగలిగాం. ఈ తరానికి
చెందిన మా కుటుంబంలో ఆయనో స్టార్‌. 

వాలూ (మేం అలా పిలుస్తాం)కి పులుల మీద వల్ల మాలిన ప్రేమ. తను కూడా ఎన్నో రకాలుగా ఒక పులి లాంటివాడు. శక్తిమంతుడు. కఠినమైనవాడు. మాటలు తక్కువ, హావభావాలు ఎక్కువ. ఆయన వేషభాషలు కొట్టొచ్చినట్లు ఉండేవి. భారీ మనిషి. విలక్షణమైన నవ్వు. పెద్దపెద్ద మెరిసే కళ్లు. వాలూ నవ్వాడంటే క్షణకాలం అంతా కొయ్యబారుతుంది. మరు క్షణం ఆ గదంతా నవ్వులతో పెళ్లుమంటుంది.  తెలియడానికి చిన్నప్పటి నుంచీ తెలిసినా తనను నిజంగా తెలుసుకున్నది మాత్రం నా ఇరవైలలోనే. మనకు అన్నీ తెలుసు అనుకునే వయసది. ప్రియ నేస్త మైన క్లెయిర్‌ వింటర్‌ ష్లాడెన్‌తో కలిసి ఇండియాలో సెలవులకు వచ్చాను. ఆ సెలవులను రణతంబూరులో గడపమని వాలూ మాకు సలహా ఇచ్చాడు. ‘జీవితంలో ఒక్కసారన్నా పులిని చూడకపోతే, నువ్వసలు జీవించి నట్లే కాదు’ అంటూ రెచ్చగొట్టాడు. ‘నేను మిమ్మల్ని రణతంబూర్‌ తీసుకెళ్తా... అక్కడ నిజమైన పులులను చూపిస్తా, మీరు బాగా ఎంజాయ్‌ చేస్తారు, సరేనా’ అని చెప్పి ఒప్పించాడు.

వాలూ చెప్పింది నిజం. మేం రణతంబూరుకు జీపులో బయలుదేరాం. పంజా గుర్తులను అనుసరిస్తూ వాలూ తనే జీపు నడిపాడు. అలా జీపును పోనిచ్చి చాలా పులులను కొద్ది అడుగుల దూరం నుంచే మాకు చూపించాడు. రాత్రి సరస్సు ఒడ్డున నెగడు వేసుకుని ఆయన కథలు చెబుతుంటే వింటూ రమ్‌ తాగాం. కథల్లోని పులులు కూడా మా కళ్ల ముందు ప్రత్యక్షమై నట్లు అనిపించింది. వాలూ అంతగా నాటకీయ ఫక్కీలో కథలు చెప్తాడు. మేం బాగా ఎంజాయ్‌ చేశాం. రణతంబూరులో గడిపిన ఆ రోజుల అర్థం ఏంటో నేను అప్పట్లో గుర్తించలేదు. అడవిలో సెలవులు గడపటం అదే మొదటిసారి. ఒక గర్ల్‌ ఫ్రెండ్‌తో కలిసి వెకేషన్‌ గడపటం అదే మొదటిసారి. మమ్మల్ని వాచ్‌ చెయ్యడానికి, నేను హద్దులు దాటకుండా మానిటర్‌ చేయ్యడానికి పేరెంట్స్‌ గానీ, గార్డియన్‌ గానీ అక్కడ లేకపోవడం అదే మొదటిసారి. కానీ వాలూకి తెలుసు. అందుకే మమ్మల్ని రణతంబూరు తీసుకెళ్లాడు. అంత శ్రద్ధ తీసుకున్నాడు. ఒక కజిన్‌ ఎదుగుదలకు తన వంతు సాయం తను చేశాడు. తర్వాతి సంవత్సరాల్లో నేను జర్నలిస్టుగా మారినప్పుడు, తరచూ నన్ను డిన్నర్‌ కంటూ ఆహ్వానించి నాకు తెలియని విషయాలు ఎన్నో చెబుతూ ఉండేవాడు. నేను ఫాలో అయ్యే స్టోరీస్‌ అంతరార్థాలు, నాకు తట్టని గూఢార్థాలు విశదపరిచేవాడు. ఇదేమైనా ఆలోచించావా... అంటూ వాక్యం మొదలెట్టేవాడు. అలా ప్రారంభించాడంటే ఆ విషయం నేను ఆలోచించలేదని ముందే తెలిసిపోయేది. ఎంతో సౌమ్యంగా, ఎంతో వివేకంతో నన్ను గైడ్‌ చేసేవాడు. అది నాకు మొదట్లో అర్థం అయ్యేది కాదు. కొన్ని కొన్నిసార్లు నా విషయ పరిజ్ఞానం పెంచేందుకు సంభాషణలకు ఇతరులను కూడా పిలుస్తూ ఉండే వాడు. మరికొన్నిసార్లు నేను ఇంటర్వ్యూ చేసిన తర్వాత కాల్‌ చేసి మాట్లాడేవాడు. ఏదైనా వార్తాకథ నాన్ని నేను గమనించానో లేదోనని నన్ను అలర్ట్‌ చేసిన సంద ర్భాలూ ఉన్నాయి. ప్రతి సందర్భంలోనూ సలహా అమూల్యంగా ఉండేది. తను రాజకీయ నాయకుడు కానప్పటికీ, ఏది జనం దృష్టిని ఆకర్షిస్తుందో తెలుసు. ఏది అందరికీ ఆసక్తికరంగా ఉంటుందో, ఏది ఢిల్లీ ఉన్నత వర్గాలను మాత్రమే ఆకర్షిస్తుందో అనాలోచితంగానే వాలూకి అర్థమైపోతుంది.   

వాలూ నా విమర్శకుడు కూడా. అయితే ఆ విమర్శ సున్నితంగా సమంజసంగా ఉంటుంది. వేరేవారు అయితే ఆ వ్యాఖ్యలకు చిరాకు పడేవారేమో. కానీ నా ప్రోగ్రాం నిశితంగా చూసి జాగ్రత్తగా ఆలోచించుకున్న తర్వాతే నాతో దాని గురించి మాట్లాడతాడని నాకు తెలుసు. వాలూ చేసిన ఒక సూచన నేను పూర్తిగా అంగీ కరించాను. కానీ అమలు చేయలేకపోయాను. మాట్లాడే ప్పుడు గొంతు పెంచవద్దన్నది ఆ సూచన. ‘నీ ఉద్వేగ ప్రదర్శన అనవసరం... ఆడియన్స్‌ను ఆకట్టుకోడానికి నీ మాటల్లో ఉండే కంటెంట్‌ సరిపోతుంది. స్వరాన్ని చివరి వరకూ ఒకే పిచ్‌లో ఉంచుకోవాలి’ అనేవాడు. నేను ఎప్పుడూ పాటించలేక పోయాను. ఇప్పుడు మాత్రం ప్రయత్నం చేస్తున్నాను. నా స్వరతంత్రుల మీద అదుపు కోల్పోతున్నప్పుడల్లా, గొంతు పెరుగు తున్న ప్రతిసారీ జ్ఞానదాయకమైన వాలూ సలహాను గుర్తు చేసుకుంటా. అంటే... ఆయన్ను ఎప్పటికీ మర్చి పోనన్న మాట!

  -కరణ్‌ థాపర్‌ 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు