Breaking News

కార్ఘరా దుర్గాపూజ

Published on Sat, 10/17/2026 - 01:35

ఒడిశా రాష్ట్రం బాలసోర్‌ జిల్లాలోని బారాబతిలో నివసిస్తున్న కార్‌ కుటుంబం ‘ఘట పూజ’ అనే 227 ఏళ్ల పురాతన సంప్రదాయాన్ని నేటికీ పాటిస్తోంది. అత్యంత పురాతనమైన ఈ దుర్గ పూజను ‘కార్ఘరా దుర్గా పూజ’ అని పిలుస్తారు. కార్‌ కుటుంబ పూర్వీకులు పశ్చిమ బెంగాల్‌లోని మాయాపూర్, మార్ద్వాన్‌ నుంచి బారాబతికి వలస వచ్చారు.

కార్‌ వంశానికి చెందిన పంచాన్‌ కార్‌ సముద్ర వాణిజ్యంలోకి అడుగు పెట్టాడు. ఆ వ్యాపారం దినదినాభివృద్ధి చెందింది. ఇండోనేసియా, మయన్మార్‌లకు విస్తరించింది. తమకు అపారమైన సంపదను ఇచ్చిన అమ్మవారికి కృతజ్ఞతగా, దేవిబది బంగ్లాలో అమ్మవారికి ప్రతీకగా కలశాలను ఉపయోగించి ‘ఘట పూజ’ మొదలుపెట్టారు కార్‌ వంశానికి చెందిన వారు. కాలక్రమంలో చుట్టు పక్కల వాళ్లు కూడా ఈ ఆచారాన్ని పాటించడం మొదలుపెట్టారు.

‘మేము అమ్మను మా కుమార్తెగా, మహాదేవుడిని అల్లుడిగా భావించి పూజిస్తాం’ అని చెబుతుంటారు కార్‌ వంశీయులు. దశమినాడు దుర్గాదేవికి వీడ్కోలు పలికేటప్పుడు కార్‌ కుటుంబం ఆమెకు కుంకుమ పెట్టి, మిఠాయిలు సమర్పించి, వచ్చే ఏడాది తిరిగి రమ్మని ఆహ్వానిస్తారు. ‘ఘట పూజ’ను ఏడుతరాలను ఏకం చేసిన విశిష్ట సంప్రదాయంగా భావిస్తారు. 

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)