Breaking News

Kamana Gautam: ప్రతి ఇంటి నుంచి పచ్చటి అడుగు

Published on Thu, 01/25/2024 - 00:55

ఒక మంచి పని చేసినప్పుడు అభినందించే వారే కాదు అనుసరించే వారు కూడా ఉంటారు. సోషల్‌ మీడియాలో పాపులర్‌ అయిన కామ్నా గౌతమ్‌ విషయంలోనూ ఇలాగే జరిగింది.
‘పర్యావరణహిత మార్గం వైపు ప్రయాణం మన ఇంటి నుంచే మొదలు కావాలి’ అంటుంది కామ్నా గౌతమ్‌...

‘పర్యావరణ సంరక్షణకు మన వంతుగా ఉడతాభక్తిగా చేయడానికి ఎంతో ఉంది. అందుకు మన ఇంటి నుంచే శ్రీకారం చుట్టాలి’ అంటుంది కామ్నా గౌతమ్‌. తన ఇన్‌స్పైరింగ్‌ మాటలతో సోషల్‌ మీడియాలో ప్రాచుర్యం పొందిన కామ్నా నూట్రీషనిస్ట్‌. వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నిక్‌లు, ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించడం... మొదలైన వాటి గురించి విస్తృతంగా ప్రచారం చేస్తోంది కామ్నా గౌతమ్‌.

బేబీ–వియరింగ్, బ్రేస్ట్‌ఫీడింగ్‌లాంటి అంశాలకు సంబంధించి ఉపయోగకరమైన సమాచారం అందించడంతో కామ్న సోషల్‌ మీడియా జర్నీ మొదలైంది.
‘నేను ఒక బిడ్డకు తల్లిని. బిడ్డ భవిష్యత్‌ బాగుండాలని ప్రతి తల్లీ కోరుకుంటుంది. అందుకే బిడ్డల బంగారుభవిష్యత్‌ కోసం పర్యావరణహిత మార్గాన్ని ఎంచుకున్నాను’ అంటుంది కామ్న.
 పర్యావరణ హిత మార్గంలో తన ఇంటి నుంచే తొలి అడుగు వేసింది. ఇంట్లో ప్లాస్టిక్‌ వస్తువులు కనిపించకుండా చేసింది. కుటుంబ సభ్యులను ఒప్పించింది. ‘మన ఇంట్లో ప్లాస్టిక్‌ బాటిల్స్‌ను ఎందుకు ఉపయోగించడం లేదో తెలుసా?’ అని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పింది.

‘నేను ఇలా చేస్తున్నప్పుడు ఇతరులు కూడా చేయవచ్చు కదా. వారిలో ఎందుకు స్పందన కనిపించడం లేదు?’ అంటూ బాధ పడేది కామ్నా. అయితే ఆ తరువాత మాత్రం ఒక్కరొక్కరుగా ఆమెను అనుసరించడం ప్రారంభించారు. ఇంటిని ఎన్విరాన్‌మెంట్‌–ఫ్రెండ్లీగా తీర్చిదిద్దడం మొదలు పెట్టారు.

ప్లాస్టిక్‌ బ్యాగులు కనిపించకుండా ఉండాలంటే ప్రతి ఇంట్లో క్లాత్‌బ్యాగులు ఉండాలి, డిస్పోజబుల్‌ వాటర్‌ బాటిల్‌ కాదు మీదైన సొంత వాటర్‌ బాటిల్‌ ఉండాలి, ట్రెండ్‌లను అనుసరిస్తూ పర్యావరణానికి హాని కలిగించే వస్త్రాలు లేదా వస్తువులకు ప్రాధాన్యత ఇవ్వకూడదు, ఇంట్లోని వ్యర్థాలను తడి, పొడి విభాగాలుగా వేరు చేయండి...ఇలాంటి విషయాలెన్నో చుట్టుపక్కల వారికి చెబుతున్నప్పుడు మొదట్లో వారి స్పందన ఎలా ఉండేదో తెలియదుగానీ ఆ తరువాత మాత్రం మార్పు కనిపించింది.

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)