పెద్దపల్లి జిల్లాలో హైటెన్షన్.. కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు
Breaking News
సింపుల్ దుస్తులనే కొంటా!
Published on Sun, 01/11/2026 - 05:34
పేరుకే స్టార్ కాని, సింప్లిసిటీ, సౌకర్యానికి ప్రాధాన్యం ఇస్తూ, తను చేసే ఫ్యాషన్ ఎంపికలే ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ట్రెండ్స్‌కు దూరంగా, తనకిష్టమైన స్టయిల్‌ను నమ్ముతూ ముందుకెళ్లే కాజల్ అగర్వాల్ ఫాలో అయ్యే ఫ్యాషన్ టిప్స్ ఏంటో ఇక్కడ చూద్దాం!
డ్రెస్.. బ్రాండ్: కోరస్ ధర రూ. 36,800
జ్యూలరీ బ్రాండ్: హైబా జ్యూవెల్స్
ధర: రూ. 40,000
బెల్ట్ బ్రాండ్: గూచి
ధర: డిజైన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.
వన్ టైమ్ వేర్ నాకు నచ్చదు. సింపుల్ దుస్తులనే కొనుగోలు చేస్తాను. అందులోనూ జ్యూయెల్ టోన్స్ అంటే చాలా ఇష్టం. వాటిల్లోనే గ్లామర్, సౌకర్యం రెండూ దొరుకుతాయి. చర్మ సౌందర్యం కోసం ప్రతి రోజు కోకోనట్ వాటర్‌ను ఐస్ క్యూబ్‌లా ఫ్రీజ్ చేసి ముఖంపై రుద్దుతాను. అప్పుడు చర్మం హైడ్రేటెడ్‌గా, ఫ్రెష్‌గా ఉంటుంది.
కట్టిపడేసే అందం!
కదిలే నడుమును కట్టిపడేసే అందాల మంత్రం ఈ బెల్ట్! ముఖ్యంగా మిడీ డ్రెస్సుకు ప్రాణం పోసే యాక్సెసరీగా ఇది పనిచేస్తుంది. పూర్వం బెల్ట్‌ను బరువులు, ఆయుధాలు తగిలించుకునేందుకు మాత్రమే ఉపయోగించేవారు కాని, ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలో ఫార్మల్, ఫంక్షన్ రెండింటినీ మిక్స్ చేస్తూ ఒక స్టేట్‌మెంట్ పీస్‌గా మారింది. ప్రధానంగా పురుషుల దుస్తుల భాగంగా ప్రాచుర్యం పొందిన బెల్ట్, ఇప్పుడు మహిళల డ్రెస్సులపై నడుము ఆకృతిని హైలైట్ చేసే స్టయిల్ ఎలిమెంట్‌గా నిలుస్తోంది. ఇది నడుమును స్పష్టంగా చూపిస్తూ, మొత్తం అవుట్‌ఫిట్‌ను షేప్‌లోకి తీసుకొచ్చే మ్యాజిక్‌లా పనిచేస్తుంది. బెల్ట్ బకిల్ దగ్గర ఉండే డీటైల్స్, డిజైన్స్ మెరుస్తున్న టచ్‌తో కలిసి అందరి చూపును నేరుగా నడుము వైపు లాక్కుంటాయి. ఫ్లోయీ లేదా ఏలైన్ మిడీ డ్రెస్సులపై ఇలాంటి వైడ్ బెల్ట్‌లు ఎంతో బాగా సూట్ అవుతాయి. అంతేకాదు, లూజ్ డ్రెస్సులకు కూడా ఇవి ఇన్ స్టంట్‌గా హగ్గింగ్ టచ్‌ను ఇస్తాయి. డిజైన్స్, స్టయిల్స్ పరంగా మార్కెట్‌లో ఎన్నో వెరైటీల్లో ఇవి సులభంగా అందుబాటులో ఉన్నాయి. – కాజల్ అగర్వాల్ .
Tags : 1