Breaking News

ఇదేం విడ్డూరం..! డైరీ రాస్తూ..86 కిలోలు బరువు తగ్గిందా!?

Published on Fri, 01/09/2026 - 12:05

బరువు తగ్గించే చిట్కాలు..సింపుల్‌ రెమిడీస్‌ వంటివి ఎన్నో చూశాం. పలానా వ్యాయామం, డైట్‌ అంటూ ఏవేవో కొంగొత్త విధానాలతో బరువు తగ్గిన ఉదంతాలు చూశాం. కొందరు ప్రోటీన్‌ కంటెంట్‌​ ఎక్కువగా తీసుకుంటూ..కార్డియాక్‌ వర్కౌట్లు, వాకింగ్‌లు, స్కిప్పింగ్‌లు అంటూ ఎంతో శ్రమ పడి తగ్గగా.. మరికొందరు సైక్లింగ్‌తో కుస్తీలు పడ్డారు. ఒక్కోక్కరూ ఒక్కోదారిలో వెళ్లి బరువు తగ్గి స్ఫూర్తిగా నిలిచారు. కానీ ఈ మహిళ ఇంతలా కష్టపడకుండా అందరు సులభంగా చేసే, చాలా తేలికైన అలవాటుతో ఇట్టే బరువు తగ్గింది. అది కూడా ఏకంగా 86 కిలోలు బరువు తగ్గడం అంటే మాటలు కాదు కదా..!. అలా అని షార్ట్‌కట్‌లు, ఏవేవో మందులు, ఇంజెక్షన్‌లు తీసుకోలేదు సుమీ..!. మరి ఆమె ఎలా అంతలా బరువు తగ్గింది..?, ఏంటా హాబీ..? అంటే..

బరువు తగ్గించే జర్నీలో అందరికీ అతిపెద్ద టాస్క్‌ వ్యాయామం, వర్కౌట్లు. కానీ  ఈ అమెరికా మహిళ కామ్‌ ఆ పాట్లు ఏం పడకుండా చాలా స్మార్ట్‌గా చిన్న చిన్న అలవాట్లతో మైండ్‌ని సెట్‌ చేసుకుంటూ సులభంగా బరువు తగ్గి అద్భుతం చేసింది. తాను ఎలాంటి ఫిట్‌నెస్‌ ట్రైనర్‌, స్నేహితులు, బంధువుల సహాయం తీసుకోకుండా కేవలం ఆ చిన్న అలవాటుతో బరువు తగ్గించుకున్నానంటోంది. 

తాను చెప్పబోయే అలవాటు వినడానికి హాస్యస్పదంగా, నమ్మశక్యంగా అనిపించకపోయినా..అద్భుతం చేసిందనేది నమ్మక తప్పని వాస్తవం అని అంటోందామె. కామ్‌ తనకు ఉన్న డైరీ రాసే అలవాటే అద్భుతంగా బరువు తగ్గేందుకు హెల్ప్‌ అయ్యిందట. అలా ఏకంగా 86 కిలోలు పైనే బరువు తగ్గానని చెబుతోంది. ఆ డైరీలో తన వెయిట్‌లాస్‌ జర్నీని ఎందుకు ప్రారంభించింది.. ఆ టైంలో తాను ఎలా ఉండేది వంటి పోటోలతో సహా పొందుపరిచింది. వాటిని చూసుకుంటూ..తన శరీర పరివర్తనలో మార్పులకు శ్రీకారం చుట్టిందట. 

ఎందుకంటే ఆ డైరీ ఓపెన్‌ చేయగానే తన దినచర్య సరిగా ఉందా, ఆహారం మితంగా తిన్నానా లేదా అని తరచి.. తరచి.. చూసుకోవడమే కాకుండా జవాబుదారీగా ఉండాలే చేస్తుందట. ఆ క్రమంలో తనకు ‍స్ఫూర్తిని కలిగించే సూక్తులు, మార్గదర్శకులు తదితరాలన్నింటి గురించి రాసేదట. అంతేగాదు ఒకరకంగా ఏం తిన్నాను, ఏం వ్యాయామాలు చేశాను అన్నది రాస్తున్నప్పుడూ..అబ్బా ఇది చేయలేకపోయాను..ఇంకా బాగా చేయాలి అనే ఫీడ్‌ బ్యాక్‌ ఇస్తుంటుందట ఆ అలవాటు. దాంతో బరువు తగ్గాలనే ఆలోచన బలంగా మదిలో నాటుకుని..అన్నింటిపై సరైన ఫోకస్‌ పెడతామట. ఫలితంగా బరువు తగ్గడం సులభం అవుతుందని అంటోందామె. 

నిజంగా హెల్ప్‌ అవుతుందా అంటే..?
బరువు తగ్గించే జర్నీలో డైరీ రాసే అలవాటు పెద్ద పాత్ర పోషిస్తుందని పరిశోధనలు సైతం చెబుతుండటం విశేషం. హార్వర్డ్ నివేదిక ప్రకారం, దాదాపు 1,700 మంది రోజువారి ఆహార రికార్డులను తమ డైరీలో ట్రాక్‌ చేయగా..వారంతా రెండు రెట్లు బరువు తగ్గారట. అలాగే మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీ ప్రచురించిన 2012 జర్నల్‌ సైతం ఇలా డైరీ రాసే వ్యక్తులు అధిక మొత్తంలో బరువు తగ్గినట్లు అధ్యయనం పేర్కొంది. 

ఇలా మనం తినేవాటిని వ్రాయడం, ప్రాముఖ్యతను హైలెట్‌ చేయడం వల్ల తమ ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయనేది తరచి చూసుకునే అవకాశం వస్తుందట..దాంతో బరువు తగ్గుతారట. ఇలా ఎంత ఎ‍క్కువగా తాము తినే ప్రతి ఆహారం గురించి నమోదు చేసే అలవాటు ఉంటే అంత అధిక మొత్తం లో బరువు తగ్గుతారని పలువురు నిపుణులు చెబుతున్నారు. మరి వెయిట్‌లాస్‌ జర్నీలో మంచి ఫలితాలు అందుకునేందుకు డైరీ రాసే అలవాటుని సత్వరమే ప్రారంభిద్దామా మరి..

(చదవండి: Beauty Tips: శీతాకాలంలో ఆరోగ్యకరమైన మెరిసే చర్మం కోసం.. ఈ ఆరు సూప్‌లు..!)
 

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు