వందేళ్ల అందాల బామ్మ..మేకప్‌ పాఠాలు! నెటిజన్లు ఫిదా

Published on Sun, 06/01/2025 - 10:38

వందేళ్లు దాటిన అందాలబామ్మ ఆమె. ‘ఆన్‌లైన్‌’లో ఈ బామ్మ పేల్చే బ్లష్‌ బ్లాస్ట్‌ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. తర్వాత ఆమె చెప్పే పాఠాలు వింటే వెంటనే మీరు కూడా మేకప్‌ బ్రష్‌ పట్టుకొని అద్దం ముందుకు వెళ్తారు. బామ్మలు అంటే కుకీస్‌ చేయటం, కథలు చెప్పడమే కాదు; సౌందర్య పోషణతో సోషల్‌ మీడియాను షేక్‌ చేయవచ్చని నిరూపించింది ఇంగ్లండ్‌కు చెందిన జోన్‌ పార్ట్‌రిడ్జ్‌. ఈమె వయసు 103.

సరదా సరదాగా బ్యూటీ పాఠాలు
రోజూ ఉదయం కాఫీ కప్పు చేతిలో పట్టుకోవడం కంటే ముందు ఈ బామ్మ మేకప్‌ బ్రష్‌ పట్టుకుంటుంది. ఆపై మొబైల్‌ కెమెరా ఆన్‌ చేసి, టిక్‌టాక్‌లో మేకప్‌ ట్యూటోరియల్‌ వీడియోలు చేస్తుంది. బామ్మ చెప్పే పాఠాలు బోరింగ్‌ అనుకోకుండా సుమారు రెండున్నర లక్షల మంది చాలా శ్రద్ధగా వింటారు. 

ఒకరోజు బ్లష్‌ బ్రష్‌ తీసుకొని చెంప మీద మెల్లగా తిప్పుతూ ‘బ్లష్‌ ఎప్పుడూ నవ్వుతూ వేయమంటారు. కాని, నేను నవ్వితే ముడతలే కనిపిస్తాయి.’ అనే పంచ్‌ వేసింది. ఈ మాట వినగానే స్క్రీన్‌ ముందు ఉన్న జనాలంతా నవ్వుల వర్షం కురిపించేశారు. ఈ ఒక్క వీడియోకి లక్షల్లో లైక్స్, కామెంట్లు, షేర్లు! ఇక అప్పటి నుంచి ఆమె మేకప్‌ టెక్నిక్స్‌ చూసి కొంతమంది ఫిదా అయితే, బామ్మ కామెడీకి చాలామంది డబుల్‌ ఫిదా అయ్యారు. 

‘ఇలా కాజల్‌ వేయాలి, ఇలా బ్రష్‌ తిప్పాలి, ఇలా బ్లష్‌ టచప్‌ చేయాలి’ అని అందరికీ అర్థమయ్యేలా చక్కగా బోధపరుస్తుందీ బామ్మ. ఏ టిప్‌ అయినా, సీరియస్‌గా చెప్పదు, చెణుకులు వేస్తూ సరదాగా చెప్తుంది. ‘టిక్‌టాక్‌’లో ఈ బామ్మ హవా తెలుసుకున్న టీవీ చానళ్లు కూడా ఇంటర్వ్యూల కోసం ఈమె ముందు క్యూ కడుతున్నాయి. బీబీసీ సహా పలు అంతర్జాతీయ చానళ్లు ఈమెను ఇప్పటికే ఇంటర్వ్యూ చేశాయి.

వరుస గిఫ్ట్‌ హ్యాంపర్లు దీనికి తోడు, ఆమె ఉపయోగించే మేకప్‌ ఐటమ్స్‌ను కొంతమంది ఫాలోవర్స్‌ ఫ్యాషన్‌ బ్రాండ్స్‌కు ట్యాగ్‌ చేశారు. బ్రాండ్స్‌ వాళ్లు కూడా బామ్మ టాలెంట్‌ చూసి ఆశ్చర్యపోయి, వెంటనే గిఫ్ట్‌ హ్యాంపర్స్‌ పంపించారు. ఇక ఆ హ్యాంపర్స్‌ వచ్చాకే అసలు మజా మొదలైంది. బామ్మ మేకప్‌ ప్రాడక్ట్స్‌ ప్రమోట్‌ చేయడం మొదలుపెట్టింది. 

వందేళ్ల వయసులోనూ బామ్మ టిక్‌టాక్‌లో వైరల్‌ స్టార్, మేకప్‌ గురు, బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారిపోయింది. ఈ బామ్మని చూసిన తర్వాత ‘మా అమ్మమ్మకు, బామ్మకు ఫేస్‌బుక్‌ ఖాతా లేదని సిగ్గేస్తోంది’ అని అనిపించకుండా ఉండదు. కొంతమంది యువత వాళ్ల అమ్మమ్మలకూ, బామ్మలకు ఈ బామ్మ వీడియోలను షేర్‌ చేస్తున్నారు. బ్లష్‌ ఎలా వేయాలో నేర్చుకోవటానికి కాదు, వాళ్ల అమ్మమ్మలు, బామ్మలు కూడా టిక్‌టాక్‌ స్టార్‌లుగా రెడీ అవ్వడానికి! 

(చదవండి: ఎవరీ ధీర..మయూర? ఆశావాదం, అసామాన్య ధైర్యానికి చిరునామ..)
 

Videos

రేవెంత్ కు కొండా పంచ్ అదిరిపోయే పంచ్

దులీప్ ట్రోపి ఫైనల్ నుండి వైభవ్ అవుట్?

నన్ను టార్గెట్ చేస్తే.. ఎమ్మెల్యేలకు కొండా హెచ్చరిక

Garam Garam : బావిపై వేలాడిన ఆర్టీసీ బస్సు

విజయవాడలో హైటెన్షన్ విద్యా భవన్ ముట్టడి

పోలీసులు కొట్టడంతోనే నా భర్త మృతి? గోపి లాకప్ డెత్ పై సంచలన నిజాలు

దేవుడా..నా దొంగతనం సక్సెస్ కావాలి

విధుల్లో ఉన్న పోలీసుపై దాడి.. గోప్యంగా విషయం?

మాజీమంత్రి విడదల రజిని మానవత్వం.. గాయపడిన బాధితులకు తక్షణ సాయం

వరదకు ఎదురీది.. ప్రాణం కాపాడిన యువకుడు

Photos

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)