Breaking News

భారతీయ వంటకాలపై రిపబ్లికన్‌ పార్టీ వైస్‌ ప్రెసిడెంట్‌ అభ్యర్థి పొగడ్తల జల్లు..!

Published on Tue, 11/05/2024 - 16:05

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రిపబ్లికన్‌ పార్టీ తరుపున వైస్‌ ప్రెసిడెంట్‌ అభ్యర్థిగా జేడీ వాన్స్‌ బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఆయన మన భారతీయ మూలాలున్న మహిళనే పరిణయమాడారు. ఆ నేపథ్యంలోనే ఆయనకు భారతీయ వంటకాలతో బాగా సుపరిచయం ఉంది. అందువల్ల ఇటీవల వ్యాన్స్‌ వెల్‌నెస్ నిపుణుడు జో రోగన్‌తో జరిగిన పాడ్‌కాస్ట్‌లో కూడా భారతీయ వంటకాలపై ఉన్న ఇష్టాన్ని సవివరంగా తెలిపి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ముఖ్యంగా శాకాహార వంటకాల గురించి చాలా గమ్మత్తైన ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అవేంటో చూద్దామా..!.  

వాన్స్‌ భారతీయ రుచులకు ఫిదా అవ్వడమే గాక వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలియజేస్తూ ఆరోగ్య స్ప్రుహని కలుగజేస్తున్నారు. ముఖ్యంగా మన ఆయుర్వేదంలో ఉపయోగించే మూలికలు వాటి ప్రయోజనాలపై ప్రసంసల జల్లు కురిపించాడు. తాను ఇంట్లో వండిన భారతీయ భోజనమే తింటానని చెప్పారు. 

అంతేగాదు దానిలో ఉండే పోషక ప్రయోజనాలను హైలెట్‌ చేసి మరి వివరించారు. అయితే ల్యాబ్‌లో కృత్రిమంగా చేసే మాంసాన్ని చెత్తగా అభివర్ణించాడు. అందుకు బదులు భారతీయ శాకాహారమే చాలా మంచిదని అన్నారు. తన భార్య ఉషా చాలా రుచికరమైన భారతీయ వంటకాలను తయారు చేస్తుందని, ముఖ్యంగా పనీర్‌ అంటే తనకు చాలా ఇష్టమని అన్నారు. 

శాకాహారం వల్ల కలిగే ప్రయోజనాలు..

  • మొక్కల ఆధారిత ఆహారాలు తీసుకోడం వల్ల ఆరోగ్యం మెరుగ్గా ఉండటమే గాక శరీరానికి కావాల్సిన పోషకాల అందుతాయి. అంతేగాదు అమెరికన్లు 2020-2025 సంవత్సరానికి సంబంధించి ఆరోగ్యం పెంపొందించుకునేలా కొత్త ఆహార మార్గదర్శకాలను ఏర్పరుచుకున్నారు. వాటిలో శాకాహారానికే తొలి ప్రాధాన్యత ఇచ్చారు. 

  • ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్‌ రోగుల  రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతుంది.

  • బాడీ మాస్ ఇండెక్స్‌ను 0.96 తగ్గిస్తాయి. ఈ ఆహారాలు మధుమేహం మందులను తగ్గించడానికి కూడా అనుమతిస్తాయి. మాంసాహార ఆహారాలతో పోలిస్తే ఇన్సులిన్ సెన్సిటివిటీని సుమారు 10 శాతం మెరుగుపడుతుందని పరిశోధనలో తేలింది.  

  • భారతీయ ప్రధాన ఆహారాల్లో.. పెరుగు, సలాడ్, రోటీ, పప్పులు, బియ్యం, గోధుమపిండి తదితరాలు ఉంటాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, ఐరన్, విటమిన్లు ఏ, సీ, కే, ఫోలిక్ ఆమ్లాలు, కాల్షియం వంటి ఇతర సూక్ష్మపోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి, దీర్ఘాకాలిక వ్యాధులను నివారించడానికి తోడ్పడతాయి. 

(చదవండి: ఒంటికి మంచిదే..మరి పంటికి?)
 

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)