Breaking News

సునామీలో కొట్టుకుపోయిన భార్య, 13 ఏళ్లుగా వెతుకులాట!

Published on Mon, 08/19/2024 - 12:07

మనకు అత్యంత ప్రియమైన వాళ్లను ఏదైన దుర్ఘటనలో కోల్పోతే ఆ బాధ మాటలకందనిది. ఇది అలాంటి ఇలాంటి ఆవేదన కాదు. అందులోనూ తల్లి బిడ్డలు, భార్యభర్తల్లో ఎవ్వరైన కానరాని లోకలకు వెళ్తే ఆ బాధ అంత తేలిగ్గా మర్చిపోలేంది. బతుకున్నన్ని రోజులు ఆ శోకాన్ని మోస్తుంటాం.  అయితే కొన్నేళ్లుకు మాములు మనుషులుగా అవుతాం. రాను రాను వారి జ్ఞాపకాలతో కాలం వెళ్లదీసే ప్రయత్నం చేస్తాం. కానీ జపాన్‌కి చెందిన వ్యక్తిని చూస్తే ఓ దుర్ఘటనలో గల్లంతైన వ్యక్తి కోసం ఇంతలా కళ్లల్లో ఒత్తులు వేసుకుని అన్వేషిస్తారా అని ఆశ్యర్యపోతారా. ప్రేమంటే ఇది కదా అనే ఫీల్‌ వస్తుంది. ఎవరతను? అతడి గాథ ఏంటంటే..

జపనీస్‌ వ్యక్తి యసువో టకామట్సుకి 2011లో సంభవించిన ప్రకృతి విపత్తు భార్యను దూరం చేసి, తీరని ఎడబాటు మిగిల్చింది. అయితే ఆ భయానక సునామీలో భార్య కోల్పోయినప్పటికీ ఇప్పటి వరకు ఆమె అవశేషాలు కనిపించలేదు. ఆమెకు అంత్యక్రియలు మంచిగా చేయాలనే ఆశతో ఆ నాటి నుంచి నేటి వరకు ఆమె అవశేషాల కోసం తీవ్రంగా గాలిస్తున్నాడు. నిజానికి ఆ సునామీలో సుమారు 20 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక యుసువో భార్య యుకో ఓ బ్యాంకులో పనిచేస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఆమె ఎగిసిన రాకాసి అలల తాకిడికి కొట్టుకుపోయింది. దీంతో తకామాట్సు ఆమె అవశేషాల కోసం ఒక వాలంటీర్‌ సహాయంతో అన్వేషించడం మొదలుపెట్టాడు. 

అంతేగాదు తన భార్య అవశేషాలు దొరక్కపోతాయా..? అని డైవింగ్‌ నేర్చుకుని మరీ మురికినీటిలో ముమ్మరంగా గాలిస్తున్నాడు. మంచు జలాలతో అపారమైన సవాళ్లు ఉన్నప్పటికీ తన భార్య అవశేషాల కోసం ఆ ఇరువురు వెతకడం విశేషం. ఇక యుకో చివరిగా తన భర్త కోసం ఫోన్‌లో రెండు సందేశాలను పంపింది. ఒకటి పంపేలోపు దుర్ఘటన భారిన పడగా ఇంకొకటి ఈ ఘటనకు కొద్ది క్షణాల ముందు పంపించింది. ఆమె చివరి సందేశం మీరు బాగున్నారా..? ఇంటికి వెళ్లాలనుకుంటున్నా అని పంపించింది. 

పంపాలనుకున్న సందేశం.. సునామీ అత్యంత వినాశకరమైనద అని నాటి దుర్ఘటనను వివరించే యత్నం చేసింది. కాగా, తకామట్సు ఈ అన్వేషణ ఫలించడం కష్టమని తెలుసు కానీ తాను చేయగలిగింది ఏమన్నా ఉందంటే ఆమె అవశేషాల కోసం అన్వేషించడం మాత్రమే అని ఆవేదనగా చెప్పాడు. అంతేగాదు ఈ సముద్రంలో వెతుకుతూ ఉంటే తాను ఆమెకు దగ్గరగా ఉన్న అనుభూతి కలుగుతుందని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ దంపతులు ప్రేమకు అసలైన అర్థం ఇచ్చారు కదా..!. అంతేగాదు భార్యభర్తలు ఒకరికొకరుగా ఉండటం అనే పదానికి అసలైన భాష్యం ఇచ్చారు ఈ ఇరువురు.

(చదవండి: ప్రధాని మోదీకి రాఖీ కట్టేందుకు సరిహద్దులు దాటి వచ్చే పాక్‌ సోదరి ఎవరో తెలుసా..)

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)