బిర్యానీలలో హైదరాబాద్‌ బిర్యానీ రుచే వేరు..!

Published on Wed, 01/21/2026 - 10:46

బిర్యానీలో ఎన్నో వెరైటీలు ఉన్నాయి..ఎన్ని ఉన్నా మన భాగ్యనగరంలోని హైదరాబాద్‌ బిర్యానీ టేస్ట్‌కి మరేది సరిపోదు అనేంతగా ఆహారప్రియుల మనసుని గెలుచుకుంది. గబాలనా.. ఏం ఆర్డర్‌ చేద్దాం అనుకున్నా.. ఠక్కున హైదరాబాద్‌ బిరానీనే మదిలోకి వస్తుంది. అలాంటి టేస్టీ బిర్యానీ రుచికి జపాన్‌ రాయబారి సైతం ఫిదా అవ్వడమే కాదండోయ్‌..దాని రుచిని ఎలా ఆస్వాదిస్తే బాగుంటుందో కూడా నెట్టింట షేర్‌ చేసుకున్నారు ఆయన.

జపాన్‌ రాయబారి ఒనో కెయిచి డిల్లీ బిర్యానీ తిన్న అనుభవాన్ని సోషల్‌ మీడియా ఎక్స్‌ పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు. న్యూఢిల్లీలోని ఆంధ్రభవన్‌లో బిర్యానీ ప్లేట్‌తో ఉన్న ఫోటోలను షేర్‌ చేస్తూ ఇలా పేర్కొన్నారు పోస్ట్‌లో. ఆ బిర్యానీని తమ సంప్రదాయ వంటకమైన సుషీతో పోల్చారు. అంతేకాదండోయ్‌..ఆ బిర్యానీని సాంప్రదాయ భారతీయ విధానంలో తింటేనే రుచి అట. అదేనండి చేతితో హాయిగా ఆస్వాదిస్తే మరింత టేస్టీగా ఉందని ఆయన సైతం అంగీకరించారు. 

ఇలా చేతులతో తింటుంటే తన భారత స్నేహితులకు మరింత చేరువైనట్లుగా ఉందని పేర్కొన్నారు కూడా. అంతేగాదు జపాన్‌ రాయబారి ఒనో అంతకుమునుపు తెలంగాణ పర్యటనలో కూడా రియల్‌ హైదరాబాద్‌ బిర్యానీని ఆస్వాదించిన ఫోటోలను కూడా షేర్‌ చేసుకున్నారు. ఆ పోస్ట్‌కి ఒనో దీని టేస్ట్‌కి ఎవ్వరైనా ఫిదా అవ్వడమే కాదు.. ఒక్కసారి తింటే.. అదే వారి ఫేవరట్‌ వంటకంగా స్థిరపడిపోతుందని క్యాప్షన్‌ జోడించి మరి పోస్ట్‌ చేశారు. 

కాగా, చేతులతో తినడం భారతీయ సంస్కృతిలో భాగం. ఇలా తినడం వల్ల రుచి పెరడగమే గాక ఆయుర్వేద పరంగా కూడా మంచిదనేది భారతీయుల నమ్మకం. ఇక బిర్యానీ స్విగ్గీలో అత్యధికంగా ఆర్డర్‌ చేయబడిన వంటకంగా అగ్రస్థానంలో నిలిచిన సంగతి విధితమే. పైగా దీన్ని కూరగాయలు, మాంసం, సీఫుడ్స్‌, సుగంధ ద్రవ్యాలు జోడించి టేస్టీగా తయారు చేస్తారు. అత్యంత ప్రజాదరణ పొందిన వంటకంగా కూడా పైచేయి దీనిదే. 

వెల్కమ్‌ టు ఇండియా సార్‌! 
బిర్యానీకి, జపాన్‌ సంప్రదాయ వంటకం సుషీకి మధ్య ఒనో కెయిచి వెతికిన ఈ ‘చేతి రుచి’ బంధం నెటిజన్ల మనసు గెలుచుకుంది. రాయబారి అభిరుచులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘మీరు త్వరలోనే పూర్తిస్థాయి ‘దేశీ’గా మారిపోతారు సార్‌!’అని కొందరు.. ‘బిర్యానీని ఎలా కలపాలో, ఆ రుచిని ఎలా ఆస్వాదించాలో’.. మరికొందరు చిట్కాలు చెబుతున్నారు.

ఆంధ్ర థాలీ.. తెలంగాణ బిర్యానీ 
ఓనో కెయిచి కేవలం బిర్యానీతోనే ఆగిపోలేదు. ఇటీవల జపాన్‌ ఎంబసీ బృందంతో కలిసి ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్‌ భవన్‌కు వెళ్లారు. అక్కడ ఘాటైన ఆంధ్ర థాలీని రుచి చూశారు. గత నవంబర్‌లో తెలంగాణ పర్యటనలో హైదరాబాద్‌ బిర్యానీని రుచి చూసి ఫిదా అయ్యారు.

చదవండి: ఎనిమిది నెలల్లో 31 కిలోల బరువు..! ఆ సాకులకు స్వస్తి చెప్పాల్సిందే..!

ఎవరీ ఓనో కెయిచి? 
అక్టోబర్‌ 2024లో జపాన్‌ రాయబారి హిరోషి సుజుకి స్థానంలో ఓనో కెయిచి బాధ్యతలు చేపట్టారు. గతంలో జపాన్‌ విదేశాంగ శాఖలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయన, 2023 జీ–7 సదస్సులో ‘షెర్పా’గా వ్యవహరించారు. మొత్తానికి, దౌత్య సంబంధాలే కాదు.. రుచులు కూడా రెండు దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేస్తాయని ఓనో కీచి నిరూపించారు.  

#

Tags : 1

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)