Breaking News

అమ్మ చీర చుట్టేసి..ఫ్యాన్స్‌ను కట్టిపడేసి : జాన్వీ అమేజింగ్‌ లుక్‌

Published on Tue, 09/23/2025 - 12:49

ముంబైలో జరిగిన హోమ్‌బౌండ్ స్పెషల్ స్క్రీనింగ్‌లో  జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) చాలా ప్రత్యేకంగా కనిపించింది.  తన తల్లి, దివంగత లెజెండరీ  నటి  శ్రీదేవి చీరలో అందరి దృష్టిని ఆకర్షించింది  తన రాబోయే చిత్రం హోమ్‌బౌండ్ ప్రత్యేక  షోలో  ఒకపుడు శ్రీదేవి ధరించిన నేవీ (రాయల్ బ్లూ ) బ్లూ చీర, జాకెట్టులో తళుక్కున మెరిసింది. బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ ,విరాట్ కోహ్లీ వివాహ రిసెప్షన్‌లో  శ్రీదేవి ఈ చీరను ధరించారు. అదే చీరలో  అద్భుతమైన తన లుక్‌తో  జాన్వీ అభిమానులను ఆశ్చర్యపరిచింది.

బంగారు ఎంబ్రాయిడరీతో రూపుదిద్దుకున్న ఈ  నేవీ బ్లూ చీరకు బ్లాక్‌ వెల్వెట్ బ్లౌజ్‌తో జత  చేయగా, స్టేట్‌మెంట్ చెవిపోగులు, చోకర్-స్టైల్ నెక్లెస్ , సొగసైన బన్‌తో లుక్‌ను పూర్తి చేసింది.  

నీరజ్ ఘయ్వాన్ దర్శకత్వం వహించిన హోమ్‌బౌండ్ 2026 ఆస్కార్‌లో  ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో భారతదేశం నుంచి అధికారిక ఎంట్రీ అని ప్రకటించిన తర్వాత ఈ ప్రీమియర్ షోకు మరింత ప్రాధాన్యత ఒనగూడింది.ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI) ఈ చిత్రాన్ని 98వ అకాడమీ అవార్డులలో ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రంగా దేశ పోటీదారుగా ప్రకటించింది. ఈ చిత్రం గతంలో 2025 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF) మరియు ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ (IFFM)లలో ప్రదర్శించబడింది. ఇది సెప్టెంబర్ 26న భారతదేశంలో థియేటర్లలో విడుదల కానుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)