Breaking News

ఎడారి ఓడల వేడుక

Published on Sun, 01/12/2025 - 08:36

ఒంటెలు ఎడారి ఓడలు. ప్రపంచంలో ఎడారులు ఉన్న ప్రతిచోటా ఒంటెలు కనిపిస్తాయి గాని, వాటి రాజసం చూడాలంటే మాత్రం రాజస్థాన్‌లోని బికనీర్‌లో జరిగే కేమెల్‌ ఫెస్టివల్‌కు వెళ్లాల్సిందే!

బికనీర్‌ నగరంలో ప్రతి ఏటా జనవరి రెండో శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు ఈ ఎడారి ఓడల వేడుక జరుగుతుంది. ఈసారి జనవరి 11, 12 తేదీల్లో జరుగుతున్న కేమెల్‌ ఫెస్టివల్‌ కోసం బికనీర్‌ నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. రాజస్థాన్‌ పర్యాటక శాఖ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఈ వేడుక కోసం రాష్ట్రంలోని ఒంటెల యజమానులు పెద్దసంఖ్యలో తమ తమ ఒంటెలతో ఇక్కడకు చేరుకున్నారు. 

బికనీర్‌ నగర వ్యవస్థాపకుడు రావు బికా హయాంలో పదిహేనో శతాబ్దంలో ఇక్కడ ఒంటెల వేడుకలు నిర్వహించడం మొదలైంది. ఇక్కడి ఒంటెలు సైనిక దళాలకు సేవలందించాయి. మొదటి రెండు ప్రపంచ యుద్ధాల్లో ఇక్కడి ఒంటెలతో ఏర్పడిన సైనికదళం ‘గంగా రిసాలా’ కీలక పాత్ర పోషించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక, 1965లో జరిగిన ఇండో–పాక్‌ యుద్ధంలో ఇక్కడి ‘గంగా జైసల్మేర్‌ రిసాలా’ సైనిక దళంలో పనిచేసిన ఒంటెలు సైన్యానికి కీలకమైన సేవలందించాయి. ఇక్కడి ఒంటెల చారిత్రక ఘనతను చాటేందుకు, ఈ వేడుకను పర్యాటక ఆకర్షణగా మార్చేందుకు కొన్నేళ్లుగా రాజస్థాన్‌ పర్యాటక శాఖ చేస్తున్న కృషి సత్ఫలితాలనిస్తోంది. 

ఒంటెల వేడుకలో పాల్గొనే ఒంటెలకు, వాటి యజమానులకు రకరకాల పోటీలు జరుగుతాయి. విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు ఉంటాయి. ఒంటెల పరుగు పందేలు, ఒంటెల నాట్యం, ఒంటెల పాలు పితకడం, ఒంటెల విన్యాసాలు, ఒంటెల అందాల పోటీలు వంటివి జరుగుతాయి. పురుషులకు కుస్తీ పోటీలు, మీసాల పోటీలు, స్త్రీ పురుషులకు వేర్వేరుగా టగ్‌ ఆఫ్‌ వార్‌ పోటీలు, మహిళలకు తలపై కుండలు మోస్తూ త్వరగా నడవడంలో పోటీలు జరుగుతాయి. సాయంత్రం వేళల్లో బహిరంగ వేదికలపై రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ వేడుకలను తిలకించడానికి దేశ విదేశాల నుంచి పెద్దసంఖ్యలో పర్యాటకులు ఇక్కడకు చేరుకుంటారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)