Breaking News

భరణం జీవనానికి మాత్రమే... విలాసాలకు కాదు!

Published on Sat, 09/07/2024 - 15:59

జైపూర్‌ ఫ్యామిలీ కోర్ట్‌  మెయింటెనెన్స్‌ విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. విలాసవంతమైన జీవితం గడపడానికి భార్యకు భరణం ఇవ్వలేమంటూ మహిళ దాఖలు చేసుకున్న దరఖాస్తును తిరస్కరించింది.  భార్య (దరఖాస్తు దారు)ఆదాయం, భర్త ఆదాయం కంటే ఎక్కువ అని  ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ కేసులో ఫిర్యాది ఎస్‌బీఐలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు.  తన భర్త నెలవారీ ఆదాయం సుమారు రూ.2.50 లక్షలనీ,  తన పోషణ, కేసు ఖర్చులు, నెలకు మెయింటెనెన్స్‌ అలవెన్స్‌ కింద రూ.75వేలు, అడ్వకేట్‌ ఫీజు, లిటిగేషన్‌ ఖర్చులు రూ.50వేలు, ఒక్కో విచారణకు హాజరయ్యేందుకు రూ.3వేలు ఇవ్వాలని భార్య డిమాండ్‌ చేసింది.  దీనికి సమాధానంగా తన భార్యనెలకు  రూ. 1,09,258 జీతంతోపాటు అదనపు అలవెన్స్‌లు పొందుతోందని కౌంటర్‌ పిటిషన్‌ వేశాడు భర్త. వాస్తవాలను పరిశీలించిన తర్వాత, విలాసవంతమైన జీవనంకాదు భరణం అంటే అంటూ ప్రిసైడిరగ్‌ అధికారి గార్గ్‌ మహిళ పిటిషన్‌ను కొట్టి వేశారు.

భార్యకు ఎలాంటి ఆదాయ వనరులు లేని పక్షంలో విడాకులు,  విడాకుల కేసు విచారణలో ఉండగా, హిందూ వివాహ చట్టంలోని సెక్షన్‌ 24 ప్రకారం, భార్య తన భర్త నుండి నెలవారీ భరణాన్ని అభ్యర్థించవచ్చు. 

మెయింటెనెన్స్‌ అంటే
భార్య భర్తలు విడిపోయినప్పుడు, లేదా విడాకుల ప్రక్రియ కోర్టులో కొనసాగుతున్నప్పుడు ఆదాయం లేని భార్య జీవితాన్ని గడిపేందుకు ఇవ్వవలసిన సొమ్మునే మెయింటెనెన్స్‌ అంటారు. భాగస్వామి ఆహారం, దుస్తులు, వసతితో పాటు పిల్లల విద్య ఇతర బాగోగులు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మెయింటెనెన్స్‌ అనేది భాగస్వామికి మాత్రమే కాకుండా పిల్లలకు, తల్లితండ్రులకు కూడా వర్తిస్తుంది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)