Breaking News

ఉషా వాన్స్ నటి దీపికా పదుకొణె స్టైల్‌ని రీక్రియేట్‌ చేశారా..?

Published on Wed, 03/26/2025 - 14:09

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ సతీమణి ఉషా వాన్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నోసార్లు జేడీ వాన్స్‌  బహిరంగంగా తన భార్య ఉషను ప్రశంసిస్తూ పొగడ్తలతో మంచెత్తుతుంటారు. అంతేగాదు తన కెరీర్‌లోని ప్రతి విషయంలోనూ ఆమె అండగా ఉంటుందని చెబుతుంటారు కూడా. అమెరికా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేప్పటిన​‍ప్పటి నుంచి ఉషా కూడా ప్రతి వేడుకలో వాన్స్‌తో జతగా కనిపిస్తూ..వార్తల్లో హైలెట్‌ అవుతున్నారు. ఈ సారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూతురు ఇవాంక కారణంగా మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఇక్కడ ఇవాంక ఉషా వాన్స్‌ గురించి చేసిన పోస్ట్‌ పెద్ద దుమారం రేపి గందరగోళానికి గురిచేసింది. అయినా ఇలా ఉషా వాన్స్‌ని ప్రశంసిస్తూనే అవమాన పరిచేలా ఫోటోలు షేర్‌ చేశారేంటని మండిపడుతున్నారు నెటిజన్లు. ఇంతకీ ఇవాంక పోస్ట్‌లో జరిగిన తప్పిదం ఏంటంటే..

డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్‌ ఉషా వాన్స్‌ని ప్రశంసిస్తూనే పోస్ట్‌ పెట్టినా.. అది వివాదాస్పదమైంది. ఇవాంక ఆ పోస్ట్‌లో అమెరికా వైస్‌ ప్రెసిడెంట్‌ జేడీ వాన్స్‌ భార్యని ప్రశంసిస్తూ.. ఆమెలోని అపారమైన దయ, గొప్ప తెలివితేటలు ఎవ్వరినైనా కట్టిపడేస్తాయి. ఆమె నిష్ణాతురాలైన న్యాయవాది కూడా అంటూ ఆమెపై పొగడ్తల జల్లు కురిపిస్తూ..మార్ఫింగ్‌ చేసి ఉన్న జేడీ వాన్స్‌​ ఫోటోని షేర్‌ చేశారు. 

దీంతో ఒక్కసారిగా నెట్టింట ఇదేం పని ఇవాంకా అంటూ.. తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రముఖ బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణేకి సంబంధించిన ఫోటోని ఉషా వ్యాన్స్‌గా మార్ఫింగ్‌ చేసిన ఫోటోని ఎలా పోస్ట్‌ చేశారంటూ మండిపడుతున్నారు నెటిజన్లు. అంతలా ఇవాంక పోస్ట్‌ వివాదాస్పదమై నెటిజన్ల ఆగ్రహానికి గురి కావడానికి ప్రధాన కారణం మార్ఫింగ్‌ ఫోటో అనే కాదు. 

ఆ మార్ఫింగ్‌ చేసిన ఫోటో 2022 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అందర్నీ ఆకర్షించిన దీపకా పదుకొణే ఎవర్‌గ్రీన్‌ స్టైల్‌ అది. ప్రముఖ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ అబూ జని సందీప్ ఖోస్లా చేతి నుంచి జాలువారిని అద్భుత కళా రూపమే ఈ స్టైలిష్‌ చీర. ఇది అక్కడున్న వారందర్నీ ఆహా భారతీయుల చీరకట్టుకి మించిన ఫ్యాషన్‌ మరొకటి లేదనిపించేలా చేసింది. అంతలా ఆకర్షించినా ఆ ఫ్యాషన్‌ వేర్‌ని మార్ఫింగ్‌ చేసినట్లు ఉన్న ఉషా వాన్స్‌ ఫోటో అని క్లియర్‌గా స్పష్టమవుతండగా ఇవాంకాకు ఎలా తెలియకుండా పోయిందన్నది నెటిజన్ల వాదన. 

 

అది కూడా ఒకరిని వ్యక్తిగతంగా ప్రశంసించేటప్పడూ.. ఎంత గౌరవప్రదంగా ఉండే ఫోటోని జత చేస్తూ పోస్ట్‌ పెట్టాలి అని కామెంట్‌ చేస్తున్నారు. అయినా ఇలాంటి విషయాల్లో ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకుని ఫోటో జత చేయాలి లేదంటే అది ప్రశంసలా అస్సలు ఉండదని తిట్టిపోస్తున్నారు  నెటిజన్లు. ఒక్కోసారి కొద్దిపాటి నిర్లక్ష్యం.. మంచిని కూడా చెడుగా చిత్రీకరించేస్తుంది అంటే ఇదే కదా..!.

(చదవండి: భారతదేశ సంప్రదాయ పానీయం గోలిసోడా..అమెరికా, బ్రిటన్‌లో పెరుగుతున్న క్రేజ్‌)
 

 

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)