Breaking News

చెత్తలో పారేసిన లాటరీ టికెట్‌..ఏకంగా అన్ని కోట్లా..! కన్నీళ్లు పెట్టుకున్న మహిళ

Published on Thu, 08/06/2026 - 11:27

ఒక్కోసారి పొరపాటున లేక ఏమరపాటున పెద్ద వాల్యు చేయదని పడేసిన లాటరీ టికెట్‌ ఒక్కోసారి ఊహకందని రేంజ్‌లో డబ్బును గెలుచుకుంటుంది. నిజమా కల అనిపించేంత సొమ్ముని అందిస్తుంటుంది. అయితే ఆ లాటరీ మన వద్ద ఉంటే..ఆ అదృష్టం మన చెంతే.. అదే చేజార్చుకుంటూ ఆ బాధ మాటలకందనిది. ఇక్కడొక మహళ కూడా చేజేతులారా లాటరీ టికెట్‌ని పోగోట్టుకుంది. కట్‌చేస్తే అది ఎంత మొత్తం గెలుపొందిందంటే..

ఈ విచిత్ర ఘటన ఇటలీలో చోటు చేసుకుంది. దక్షిణ ఇటలీలోని బిటోంటోలో ఒక దుకాణంలో తన లాటరీ నంబర్లను సరిచూసుకున్నప్పుడు, అది అనర్హమైనది, (నాన్‌ పేబుల్‌) అని సందేశం రావడంతో మరో ఆలోచన లేకుండానే పారేసింది. నిజానికి అలా దుకాణం వద్ద చెల్లించలేనంత భారీ సోమ్ముని గెలుపొందినప్పుడే ఇలాంటి సందేశం వస్తుంది. అయితే సదరు మహిళ దుకాణం నుంచి ఇంటికి తిరిగి వచ్చాక..ఆమె తరుచుగా ఆడే నంబర్లే ఆమెను విజేతగా నిలిపాయని, కటుంబ సభ్యులు చెప్పాకగానే తెలియలేదు అసలు విషయం. 

ఆమె ఎంచుకునే నంబర్లన్నీ అత్యంత ఆప్తులైన వారికి సంబధించినవే. దీంతో ఆమె వెంటనే ఆ టికెట్‌ కోసం దుకాణానికి పరిగెత్తింది. అప్పటికే ఆ టికెట్‌ చెత్తలో పారేయబడటం, చెత్తను తరలించే వాహనంలో వెళ్లిపోవడం చకచక​ జరిగిపోయాయి. ఎలాగైనా  టికెట్‌ని తిరిగిపొందేందుకు..ఆమె కుటుంబ సభ్యులు వ్యర్థాల నిర్వహణ సంస్థ 'SANB' నిర్వాహకుడు రాబర్టో నికోలా టోస్కానోను సంప్రదించారు. చెత్తను తీసుకువెళ్లే ట్రక్ అప్పటికే దానిని తీసుకెళ్లిపోవడంతో, అది దొరుకుతుందనే పెద్దగా ఆశ లేకుండానే టోస్కానో అతని బృందం ఆ ట్రక్‌ని గుర్తించి ఆపారు. 

చెత్తలో ప్రమాదకరమైన పదార్థాలు ఉండే అవకాశం ఉన్నందున, ప్రత్యేక సంరక్షణా సౌకర్యాలున్నా..సంస్థకు తరలించి, అక్కడి పారిశుధ్య కార్మికుల సాయంతో జల్లెడ పట్టారు. చివరికి ఆశ్చర్యకరంగా ఆ టికెట్‌ని గుర్తించారు. అదృష్టవశాత్తు చెక్కు చెదరకుండా ఉండటంతో ఆ విషయాన్ని టోస్కానో సదరు మహిళకు తెలియజేశారు. పాపం ఆ మహిళ ఒక్కసారిగా భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంది. 

అయితే ఆమెకు అదృష్టం తిరిగి వరించినా..ఒక షరతు వర్తిస్తుందామెకు. ఎందుకంటే..SANB ఒక ప్రభుత్వ సంస్థ కావడంతో, ఆ అన్వేషణ ప్రక్రియకు అయిన అదనపు ఖర్చులన్నింటినీ భరించేందుకు ఆ మహిళ ఒక ఒప్పందంపై సంతకం చేయాల్సి ఉంటుంది. ఇంతకీ ఆ టికెట్‌ ఎంత సొమ్ము గెలుపొందిదంటే..అక్షరాల రూ. 11 కోట్లు. ఏదీఏమైతేనేం కాలదన్నుకున్నది కోట్లు తెచ్చిపెట్టింది..తిరిగి చెంతకు చేరింది. రాసి పెట్టుంటే..అది మన చెంతకు ఏదో విధంగా వచ్చి తీరుతుంది అంటే ఇదే కదూ..!

(చదవండి: షాపింగ్‌ కోసం ఏకంగా హెలికాప్టర్‌..!విస్తుపోయిన అధికారులు)

 

Videos

వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి

మంత్రి నారాయణ పై సిట్ విచారణ జరపాలి అమరావతి రైతుల కీలక డిమాండ్

ఊహించని ఊచకోత.. అప్పుడే రూ.100 కోట్లు

దానంకు ఖైరతాబాద్ టికెట్ టెన్షన్

కర్నూలులో పట్టపగలే చోరీ.. రైతు బైక్ నుంచి రూ.2 లక్షలు మాయం

చింతమనేని నీకే చెప్తున్నా దెందులూరు గడ్డ సాక్షిగా.. నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

గణేష్ నిమజ్జనంలో దుమ్మురేపిన హైదరాబాద్ లేడీ పోలీస్ డాన్స్

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

మధుబాబును సస్పెండ్ చేసిన కూటమి ప్రభుత్వం ఉద్యోగ సంఘాల ఆగ్రహం

ఉండ్రాజవరంలో హైటెన్షన్.. పోలీసులకు వంగవీటి కూతురు మాస్ వార్నింగ్

Photos

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

హైదరాబాదులో వినాయక నిమజ్జనం సందడి..(ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం దృశ్యాలు..(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో సమ్మక్క పాత్ర.. నటి జ్ఞాపకాలు (ఫొటోలు)