Breaking News

ఇరుకు దారులకు చురుకైన కారు..!

Published on Sun, 07/20/2025 - 17:13

ఇరుకు దారుల్లో ద్విచక్ర వాహనాలు ఎలాగోలా ప్రయాణించగలవు గాని, కార్లు ముందుకెళ్లడం అంత సులువు కాదు. ఈ సమస్యను అధిగమించాలనే ఆలోచనతోనే ఇటాలియన్‌ మెకానిక్‌ ఆండ్రియా మరాజీ ప్రపంచంలోనే అతి సన్నని కారును రూపొందించాడు. అలాగని అతడేమీ కొత్తగా కారును తయారు చేయలేదు. 

తన షెడ్డులో మూలపడిన 1993 మోడల్‌ ‘ఫియట్‌ పాండా’ కారు రూపురేఖలను తాను కోరుకున్న రీతిలో మార్పులు చేసి, ఇలా అతి సన్నని కారుగా మార్చేశాడు. దీనికోసం ఆండ్రియా ఏకంగా పన్నెండు నెలలు శ్రమించాడు. రోడ్ల మీద పరుగులు పెట్టేలా దీనిని తీర్చిదిద్దడానికి పూర్తిగా ఫియట్‌ కంపెనీకి చెందిన ఒరిజినల్‌ విడి భాగాలనే ఉపయోగించాడు. 

కారుకు ఉన్న పాత పెట్రోల్‌ ఇంజిన్‌ను తొలగించి, ఎలక్ట్రిక్‌ ఇంజిన్‌ను ఏర్పాటు చేసి, బ్యాటరీని అమర్చాడు. బ్యాటరీని ఒకసారి చార్జ్‌ చేస్తే, పాతిక కిలోమీటర్లు నిరంతరాయంగా ప్రయాణిస్తుంది. ఈ కారు ఎత్తు 140 సెం.మీ., పొడవు 340 సెం.మీ., వెడల్పు 50 సెం.మీ. మాత్రమే! ఈ కారులోనే చక్కర్లు కొడుతూ ఆండ్రియా యూట్యూబ్‌ సంచలనంగా మారాడు.

(చదవండి: జైలు శిక్షనే శిక్షణగా మార్చుకున్న జీనియస్‌ ఖైదీ..!)

#

Tags : 1

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?