Breaking News

మహిళా సైనికులకు ఇన్ని ఆరోగ్య సవాళ్లు ఉంటాయా..?

Published on Fri, 05/30/2025 - 11:47

మహిళలు సైనిక శిక్షణలో చాలా రకాల ఫిట్‌నెస్ సమస్యలను ఎదుర్కొంటారట. చెప్పాలంటే మగవారి కంటే ఎక్కువ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే మహిళలకు ఉండే ప్రత్యేకమైన శారీరక ధర్మాల రీత్యా వారికి ఈ సమస్యలు అధికమని తెలిపారు. ఇప్పుడిదంతా ఎందుకంటే..గాజాపై ఇజ్రాయెల్‌ దాడుల నేపథ్యంలో ట్రైనింగ్‌లో మహిళా సైనికులు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు తెరపైకి వచ్చాయి. ఎందుకంటే ఇజ్రాయెల్‌ ఆర్మీ మహిళా సైనికులకు శిక్షణ ఇవ్వడం అర్థాంతరంగా నిలిపేసింది. అసలు ఇజ్రాయెల్‌ ఆర్మీ ఆకస్మికంగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది..?. మహిళా సైనికులు శిక్షణ సమయంలో ఎదుర్కొనే ఆరోగ్య సవాళ్లు ఏంటి ..? అంటే..

ఎందుకంటే.. ఇజ్రాయెల్‌ రక్షణ దళాలు ఆరోగ్య ప్రమాదాల దృష్ట్యా మహిళా సైనికులకు శిక్షణ ఇవ్వడం అర్థాంతరంగా నిలిపేశాయి. వైద్య నివేదిక ప్రకారం..వారికి శిక్షణ కొనసాగిస్తే మరిన్ని ఆరోగ్య ప్రమాదాలు ఎదుర్కొనాల్సి ఉంటుందని ఆరోగ్య నివేదిక పేర్కొంది. ఆ నేపథ్యంలోనే మహిళా సైనికులను వినియోగించే మహాత్తర కార్యక్రమాన్ని ఇజ్రాయెల్‌ రక్షణ దళాలు(ఐడీఎఫ్‌) తక్షణమే నిలిపేశాయి. 

అలాగే శిక్షణ పొందిన మహిళలను శత్రు భూభాగంలో పదాతి దళాలకు పరికరాలు, ఆయుధ సామాగ్రిని అందించడం, గాయపడిన సైనికులను కోలుకునేలా సేవలందించడం తదితర విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని ఇజ్రాయెల్‌ రక్షణ దళాలు స్పష్టం చేశాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా మహిళా పదాతిదళ రిక్రూట్‌మెంట్‌ని కూడా నిలిపేసింది. ఇక ఈపాటికే ఆర్మీ కోర్సుల్లో ఉన్న మహిళలు సైన్యంలో కొనసాగాలి అనుకుంటే..కార్యాలయ విధుల్లో సేవాలందించాల్సి ఉంటుందని పేర్కొంది. 

ఇజ్రాయెల్‌ రక్షణ దళంలో పురుషులకు మహిళలకు సైనిక శిక్షణ ఒకేలా ఉంటుందని, కొన్ని విభాగాల్లో ఇద్దరికి మినహాయింపు ఉంటుందనేది సమాచారం. ఇదిలా ఉండగా హమాస్ నేతృత్వంలోని ఉగ్రవాదులు అక్టోబర్ 7, 2023న దక్షిణ ఇజ్రాయెల్ కమ్యూనిటీపై దాడి చేసి దాదాపు వెయ్యి మందికి పైగా ప్రజలను బలిగొన్నారు. ఆ నేపథ్యంలో ఇజ్రాయెల్‌ గాజాపై ప్రతీకార దాడులు నిర్వహిస్తోంది. ఇక వారం ప్రారంభంలోనే ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హమాస్ గాజా చీఫ్ ముహమ్మద్ సిన్వర్ మరణాన్ని ప్రకటించారు.

(చదవండి: ఫ్యాషన్‌కి సరికొత్త అర్థం..! 'సంస్కృత శ్లోకాల సంస్కృతి'..)

మహిళలకు సైనికులకు తలెత్తే ఫిట్‌నెస్ సమస్యలు:
శారీరక బలం ,దృఢత్వం:
సైనిక శిక్షణలో, మహిళలు పురుషులతో సమానంగా శారీరక బలం, దృఢత్వాన్ని సాధించవలసి ఉంటుంది. అయితే, చాలా మంది మహిళలు మగవారి కంటే తక్కువ కండర బలం, తక్కువ శారీరక సామర్థ్యం కలిగి ఉంటారు.

కండరాల నొప్పి, గాయాలు:
కఠినమైన శిక్షణలో, మహిళలు కండరాల నొప్పి, కండరాల గాయాలు, జాయింట్ సమస్యలు ఎదురవ్వుతుంటాయి.

రుతుక్రమం:
దీని కారణంగా మహిళలకు శిక్షణ సమయంలో ఫిట్‌నెస్ సమస్యలు వస్తుంటాయని చెబుతున్నారు నిపుణులు

ఎలా అధిగమించాలంటే... 

  • మహిళా సైనికుల శారీరక దారుఢ్యానికి అనుగుణంగా శిక్షణ ఇవ్వడం. దాంతోపాటు తగిని విశ్రాంతి ఇచ్చేలా ట్రైనింగ్‌లో వెసులబాటు కల్పించాలి. 

  • కఠిన శిక్షణను తట్టుకునేలా పోషకాహారం ఇవ్వడం

  • సకాలంలో వైద్య సహాయం అందుబాటులో ఉండటం.  

  • మహిళలు శారీరక పరిమితుల దృష్ట్యా తర్ఫీదు ఇవ్వడం వంటివి చేస్తే..మహిళలు పురుషులతో సమానంగా, విజయవంతంగా తమ ఆర్మీ ట్రైనింగ్‌ని పూర్తి చేయగలుగుతారని చెబుతున్నారు వైద్య నిపుణులు.

(చదవండి: హమాస్‌ నేత సిన్వార్‌ హతం )

 

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)