టెన్త్‌ ఫెయిల్యూర్‌ ఐపీఎస్‌ అధికారి స్టోరీ..! మూడుసార్లు ఫెయిల్‌.. నాల్గోసారి పాసైనా..

Published on Mon, 09/22/2025 - 15:14

పదోతరగతి కూడా పాసవ్వలేదు.. ఇంకేం చదువుతాడు అని అనేస్తారు. కానీ కొందరూ పది ఫెయిలైనప్పటికీ..తర్వాత నెమ్మదిగా సక్సెస్‌ని అందుకోవడం ప్రారంభిస్తుంటారు. అలానే సాగింది ఈ ఐపీఎస్‌ అధికారి ఈశ్వర్ గుర్జార్ ప్రస్థానం. పదోతరగతి ఫెయిలై..సాదాసీదాగా చదివే ఈ అబ్బాయి ఈ రేంజ్‌లో అందుకోవడం చూసి అంత విస్తుపోయారు. అతడికి ఈ సివిల్స్‌ విజయం అంత సులభంగా దక్కలేదు. ఎన్నిసార్లు ఓటమి పలకరించిందో తెలిస్తే చెమటు పడతాయి. పోని విజయ దక్కింది అనుకుంటే అనుకున్న డ్రీమ్‌ జాబ్‌ దక్కక నిరుత్సాహం నిలువెల్ల వెంటాడుతున్న తగ్గేది లే అంటూ పోరాడి దక్కించుకున్న గెలుపు కథ ఇది. ప్రతిష్టాత్మకమైన ఈ సివిల్స్‌ ఎగ్జామ్‌కి ప్రిపేరవ్వుతున్న వాళ్లకు ఈ ఐపీఎస్‌ స్టోరీ ఓ ‍ప్రేరణ. 

అతడే ఈశ్వర్ గుర్జార్. రాజస్థాన్‌లోని భిల్వారాలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి సువాలాల్‌ ఒక కిరాణ దుకాణం నడిపేవాడు. తల్లి సుఖి దేవి గృహిణి. చదువులో యావరేజ్‌ స్టూడెంట్‌. పదోతరగతి బోర్డు ఎగ్జామ్స్‌లో ఫెయిలై తీవ్ర డిప్రెషన్‌కి గురయ్యాడు. కానీ అతడి తండ్రి అందరి నాన్నల్లా కోప్పడకుండా.. ఏం కాదు మరోసారి ప్రయత్నించు పర్లేదని వెన్నుతట్టాడు. 

అదే అతడికి మనోబలాన్నిచ్చి పదోతగరతి పాసైయ్యేందుకు దారితీసింది. అలా 2012లో 54% మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణుడయ్యాడు. ఇక పన్నెండో తరగతి బోర్డు పరీక్షలలో 68% మార్కులు సాధించాడు. ఆ తర్వాత ఎండీఎస్‌ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేసి 2019లో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించాడు. అయితే అతడు తన సక్సెస్‌ని అక్కడితో ఆపకూడదని నిర్ణయించుకున్నాడు. అందుకోసం ప్రతిష్టాత్మకమైన యూపీఎస్సీ సివిల్స్‌ ఎగ్జామ్‌ (UPSC Civil Services Exam)ని ఎంచుకున్నాడు.

వైఫల్యాలు అధిగమించి గెలుపొందిన తీరు..
2019 తొలి ప్రయత్నంలో ప్రిలిమ్స్‌ కూడా క్లియర్‌ చేయలేకపోయాడు. 2020లో ఇంటర్వ్యూ దాక చేరుకున్నా..నిష్క్రమించాల్సి వచ్చింది. చివరికి 2021లో మరోసారి ఓటమిని చవిచూడక తప్పలేదు. ఎట్టకేలకు 2022 నాల్గో ప్రయత్నంలో సివిల్స్‌ని క్లియర్‌ చేసి ఆల్‌ ఇండియా ర్యాంక్‌ 644ని సాధించి ఐఆర్‌ఎస్‌ కేడర్‌కి ఎంపికయ్యారు. కానీ ఆయన చిరకాల వాంఛ ఐపీఎస్‌ అందుకోసం మరోసారి ప్రయత్నించారు. 

అలా 2023లో, అతను ఆల్‌ ఇండియా ర్యాంక్‌ 555తో IPS అధికారి కావాలనే తన కలను సాకారం చేసుకున్నారు. కానీ తన ర్యాంకు మరింత మెరుగుపడేలా చేసి పూర్తి స్థాయిలో ఐపీఎస్‌ హోదాని అందుకోవాలని 2024లో మరోసారి సివిల్స్‌ ఎగ్జామ్‌ రాసి ఈసారి ఏకంగా 483 ర్యాంకుతో మరింతగా మెరుగుపరుచుకున్నారు. ప్రస్తుతం ఈశ్వర్ గుర్జార్‌ సెప్టెంబర్ 2025 వరకు, IPS సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (SVPNPA)లో శిక్షణ పొందుతున్నాడు. 

కృషి, ఓర్పు పట్టుదలతో ఎంతటి కఠినమైన సవాలునైనా ఢీకొట్టి సక్సెస్‌ని అందుకోవచ్చని ప్రూవ్‌ చేశారు. ఓటమి ఎదురైనప్పుడల్లా గెలుపుకి దార్లు వెతికే ప్రయత్నంలో ఉన్నాం అనుకుంటూ ఓర్పుతో ముందుకు సాగాలనే గొప్ప సందేశం అందిస్తోంది ఈ ఐపీఎస్‌ అధికారి ఈశ్వర్‌ గుర్జార్‌ సక్సెస్‌ స్టోరీ.

చదవండి: ఉద్యోగం కంటే ఆరోగ్యమే ముద్దు..!

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)