Breaking News

ప్యారిస్ హాట్ కౌచర్ వీక్‌లో పుత్తడి బొమ్మలా ఇషా..!

Published on Fri, 07/10/2026 - 16:35

ప్యారిస్ హాట్ కౌచర్ వీక్‌లో, అన్నా వింటౌర్‌తో పాటు డిజైనర్ మనీష్ మల్హోత్రా డెబ్యూ షో కోసం ఇషా అంబానీ కూడా పాల్గొన్నారు. ఈ ప్రతిష్టాత్మక ఫ్యాషన్‌ వీక్‌లో మనీష్‌ పాల్గొనడం ఇదే తొలిసారి.  ఈ షో ఫ్రంట్ రోలో కరణ్ జోహార్, అన్నా వింటౌర్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. ఆ ఈవెంట్‌లో మనీష్ ఆటం/వింటర్ 2026 హాట్ కౌచర్ కలెక్షన్ నుంచి చేతితో తయారు చేసిన బంగారు గౌనులో ఇషా మెరిశారు. 

 

చీలమండలం వరకు ఉన్న ఈ స్ట్రక్చర్డ్‌ డ్రెస్‌లో హాల్టర్ నెక్ లైన్‌తో పాటు ఒక శిల్పకళాత్మకమైన కార్సెట్ సిల్హౌట్ ఉంది. దీనిలో మనీష్ రూపొందించిన ప్రత్యేకమైన, క్లిష్టమైన చేతి ఎంబ్రాయిడరీ కూడా ఉంది. ఈ లుక్‌కు ఇషా బంగారంతో అలంకరించిన ఫెర్రాగామో హీల్స్, స్టేట్‌మెంట్ డైమండ్ డ్రాప్ చెవిపోగులు, ఒక ఉంగరాన్ని జత చేసింది. మేకప్ కోసం, ఆమె వింగ్డ్ ఐలైనర్, గోల్డెన్ ఐషాడో, మస్కారా పూసిన కనురెప్పలు, స్పష్టంగా తీర్చిదిద్దిన కనుబొమ్మలు, లేత గులాబీ రంగు బుగ్గలు, నిగనిగలాడే ఎరుపు-గోధుమ రంగు పెదవులను ఎంచుకుంది. 

అందుకు తగ్గట్టుగా తన కురులను మధ్యలోకి పాపిడి తీసి వదులుగా వదిలేసి తన లుక్‌ను పూర్తి చేసింది. అలాగే ఈ ఈవెంట్కు ముందుకు సీనియర్ ఫ్యాషన్ ఎడిటర్ అన్నా వింటౌర్‌తో కబుర్లు చెబుతూ కనిపించింది ఇషా. ఇక అన్నా ఊదారంగు పూలు, టీల్‌ గ్రీన్‌ ఆకులతో కూడిని బోల్డ్‌ ఫ్లోరల్‌ ప్రింట్‌ ఉన్న..బంగారు రంగు సిల్క్‌ మిడి డ్రెస్‌లో హాజరయ్యింది. అందుకు అనుగుణంగా ముదురు ఊదా మెటాలిక్‌ రాళ్లతో అలంకరించిన భారీ ఆభరణాల నెక్లెస్‌ని జత చేశారామె. 

కాగా, పారిస్ హాట్ కౌచర్ వీక్‌లో మనీష్ ప్రదర్శించిన 'మా' అనే కలెక్షన్, మార్చి 19న మరణించిన తన దివంగత తల్లి సుదర్శన్ మల్హోత్రాకు నివాళి. తన చిన్ననాటి జ్ఞాపకాల స్ఫూర్తితో రూపొందించిన ఈ కలెక్షన్‌లో, 1970వ దశకంలో తన తల్లి ధరించిన చీరల ప్రత్యేకమైన రంగులు కనిపిస్తాయి. ముత్యాలు, జర్దోజీ, రేషమ్, సీక్విన్స్ వంటి అనేక రకాల భారతీయ చేతి-ఎంబ్రాయిడరీ (hand-embroidery) పద్ధతులు ఈ కలెక్షన్‌లలో అత్యంత ప్రత్యేకం.

 

(చదవండి: ఉద్యోగం లేదు, ఎలాంటి వేతనం లేదు..!దర్జాగా స్విట్జర్లాండ్‌లో..)

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)