Breaking News

హిజాబ్‌ లేకుండా పాట..ఏకంగా 74 కొరడా దెబ్బల శిక్ష!

Published on Fri, 06/19/2026 - 16:17

కొన్ని దేశాల్లో మహిళలు ఎలా అణిచివేతకు గురవ్వుతున్నారు అనేందుకు ఈ ఘటన ఉదాహరణ. ఇంకా పలు చోట్ల వాళ్లు బయట ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎలా ప్రవర్తించాలి అనేదానిపై కఠినమైన ఆంక్షలు ఉన్నాయి. వాటిని ఉల్లంఘిస్తే అక్కడి కోర్టులు ఎలాంటి శిక్షలు విధిస్తాయో తెలిస్తే విస్తుపోతారు. 

ఇరాన్‌లో ప్రముఖ గాయని పరాస్టూ అహ్మదీ హిజాబ్‌ ప్రస్తుతం ఆ పరిస్థితనే ఎదుర్కొంటోంది. హిజాబ్‌ లేకుండా పాట పాడినందుకు ఇరాన్‌ కళాకారిణి పరాస్టూ అహ్మదీకి దారుణమైన శిక్ష విధించింది అక్కడి క్రిమినల్‌ కోర్టు. 2024 నాటి కేసు ఇది. యూట్యూబ్‌లో లైవ్‌లో హిజాబ్‌ లేకుండా పాట పాడినందుకు 74 కొరడా దెబ్బల శిక్ష విధించింది ఇరాన్‌ ఖోమ్ ప్రావిన్స్‌లోని ఒక క్రిమినల్ కోర్టు. 

ఈ ఆమె పాట పాడిన వీడియో యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ అవ్వగానే లక్షలాది వ్యూస్‌ వచ్చాయి. ఆ తక్షణమే హిజాబ్‌ లేకుండా దేశభక్తి గీతాన్ని ఆలపించండంతో ఇరాన్‌లోని ఇతర సంగీతకళాకారులు భగ్గుమన్నారు. ఆమె చేసిన పనికి అప్పుడే ఆమెను నిర్బంధించి మరీ అరెస్టు చేశారు. పరస్టూ ఇరాన్‌ మహిళా ప్రదర్శకులపై విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా పాటను ఆలపించిందామె. అక్కడ చట్టాల ప్రకారం..మహిళలు బహిరంగంగా సోలోగా పాడటానికి తీవ్రమైన పరిమితులు ఉంటాయి. 

తప్పనిసరిగా హిజాబ్‌ ధరించాలనే నిబంధన ఉంది. దాంతో పరస్టూ తన వీడియో అప్‌లోడ్‌ చేసిన కొద్దిసేపటికే అరెస్టు చేసి, అధికారికంగా కేసు నమోదు చేశారు. ఆ నేపథ్యంలోనే ఖోమ్ ప్రావిన్స్ క్రిమినల్ కోర్టు  ఈ కంటెంట్‌ను అసభ్యకరమైనది, అనైతికమైనదిగా పేర్కొంటూ ఇలా ఆమెకు శిక్ష విధించింది. కాగా పరస్టూ 2024లో ఇరాన్‌లోని ఒక చారిత్రాత్మక సత్రం (కారవాన్సరీ)లో "ఊహాత్మక సంగీత కచేరీ"గా పిలిచే ప్రదర్శన నిర్వహించి అంతర్జాతీయ గుర్తింపు పొందారు. 

ఆ వీడియోలో ఆమె చేతులేని నల్లటి దుస్తులు ధరించి, హిజాబ్‌ లేకుండా ప్రదర్శించడంతోనే అక్కడి అధికారుల ఆగ్రహావేశాలకు గురయ్యారామె. కాగా పరస్టూకి విధించిన శిక్షతో అక్కడి సాంస్కృతిక సెన్సార్‌షిప్‌పై ఇరాన్ కళాకారుల్లో ఆందోళనలను పెంచింది. అంతేగాదు ఆ గాయని పరస్టూకి విధించిన శిక్షను ఇరాన్‌ కార్యకర్తలు, మానవహక్కుల సంఘాలు తీవ్రంగా ఖండించడం గమనార్హం.

(చదవండి: మిస్ వరల్డ్ పోటీల్లో చీర ధరించిన అందాల రాణి ఎవరో తెలుసా..! ఆమె ఐశ్వర్యరాయ్‌కి..)

 

#

Tags : 1

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)