Breaking News

పోలీస్‌ ఉద్యోగానికి రిజెక్ట్‌, కట్‌ చేస్తే ఐపీఎస్‌గా!

Published on Thu, 02/27/2025 - 15:58

‘‘సాధించినదానికి సంతృప్తిని పొంది… అదే విజయమనుకుంటే పొరపాటోయి…ఆగకోయి భారతీయుడా.. కదిలి సాగవోయి ప్రగతిదారులా’’  ఈమాటల్ని మహాకవి శ్రీశ్రీ  ఏ సందర్భంలో అన్నప్పటికీ.. ఈ మాటల్నే తనకు ప్రేరణగా  తీసుకున్నాడో యువకుడు.  కుటుంబాన్నీ పేదరికం నుంచి బయటపడేయడమే అతని అక్ష్యం.  అలాగని సాధించిన ఉద్యోగంతో  తృప్తి పడలేదు. పట్వారీగా తన ప్రయాణాన్ని ప్రారంభించి, తరువాత తహసీల్దార్, అసిస్టెంట్ జైలర్, స్కూల్ లెక్చరర్‌గా పనిచేశాడు.   ఆరేళ్లలో  (2010-2016) 12 ప్రభుత్వ ఉద్యోగాలు. చివరికి ఐపీఎస్‌ ఆఫీసర్‌గా నిలిచాడు.  ఎలా సాధ్యం అని ఆశ్యర్యపోతున్నారా? తన కలను సాకారం చేసుకునేందుకు ఐపీఎస్‌ అధికారిగా నిలిచేందుకు చేసిన కృషి  ఇందుకు సమాధానం. పదండి అతని  స్ఫూర్తిదాయకమైన  కెరీర్‌ గురించి తెలుసుకుందాం.  


రాజస్థాన్‌లోని రసిసార్‌లో నిరుపేద  కుటుంబంలో జన్మించాడు.  ప్రేమ్‌సుఖ్ డెలు. ప్రారంభంలో ఒంటె బండి డ్రైవర్‌గా పనిచేశాడు. పశువుల మేతకోసి తెచ్చేవాడు. అయితే  పేదరికం నుండి తన కుటుంబాన్ని పైకి తీసుకురావాలనే దృఢ సంకల్పంతో, చదువుకోవాలని నిర్ణయించాడు.  ఎన్నిఇబ్బందులొచ్చినా చదువును సాగించాడు. ఆర్థిక ఇబ్బందుల భారం తన కలలకు అడ్డు రాకుండా జాగ్రత్త పడ్డాడు. అతని కుటుంబం కూడా చదువు ప్రాధాన్యతను గురించింది. ఎన్ని సవాళ్లెదురైనా, పరిమిత వనరులు ఉన్నప్పటికీ  అతనిలో విశ్వాసాన్ని నింపింది. డెలు సంకల్పానికి కుటుంబ  సహకారం మరింత బలాన్నిచ్చింది.

గొప్ప గొప్ప బిరుదులు, హోదాలు కాదు... తనకుటుంబం ఆర్థిక కష్టాలనుంచి బైటపడి, గౌరవంగా బతకాలి ఇదే అతని పట్టుదల.  ప్రేమ్ కష్టపడి చదువుతూ ఎంఏ హిస్టరీ పూర్తి చేశాడు. 2010లో తొలిసారి పట్వారీ (రెవెన్యూ ఆఫీసర్) ఉద్యోగం సంపాదించాడు.  ఆ తరువాతి ఏడాదికే అసిస్టెంట్‌ జైలర్‌గా , ఆ తరువాత ఉపాధ్యాయుడిగా, అనంతరం కాలేజీలో లెక్చరర్​  ఉద్యోగం సంపాదించాడు.  అయితే స్వల్పమార్కులతో  పోలీస్ ​ఉద్యోగం చేజారినా ఐపీఎస్‌  అవ్వాలన్న కల స్థిమితంగా నిద్రపోనీయలేదు. 

మరోపక్క సాధించి చాల్లే..ఉన్నదాంతో సంతోషంగా బతుకుందాం అన్నారు కుటుంబ సభ్యులు. అయినా పట్టువీడని ప్రేమ్..2015లో యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్​ రాశాడు. యూపీఎస్సీలో  (UPSC)  AIR 170 ర్యాంకుతో  తన కలను సాకారం చేసుకునే  తొలి అడుగు వేశాడు. ప్రస్తుతం  గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో పోలీసు సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నారు. ఐపీఎస్​ ఆఫీసర్‌గానూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు.

‘ఉద్యోగం చేసుకుంటూ  యూపీఎసీసీకి  సిద్ధమవ్వడం అంత సులభం కాదు. అంకిత భావంతో చదివాను. కేవలం ఆరేళ్ళలో 12 ప్రభుత్వ పరీక్షలలో ఉత్తీర్ణుడయ్యాడు.  అదే  తనకు స్ఫూర్తినిచ్చింది। అంటాడు డైలు.  ఇదీ కదా పట్టుదల అంటే.. ఇదీ కదా సక్సెస్‌ అంటే.   అవిశ్రాంత దృఢ సంకల్పం , దృఢ నిశ్చయం ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు డైలు. తనలాంటి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)