Breaking News

నాన్నా... కథ చెప్పవూ!

Published on Sat, 10/31/2026 - 04:42

సెల్‌ఫోన్‌లకు అతుక్కుపోయే ఈ కాలంలో... కథలు చెబితే పిల్లలు వింటారా? అనే సందేహం చాలామంది తల్లిదండ్రులకు వస్తుంది. ఒక్కసారి ఒక్క కథ అయినా చెప్పి చూడండి. వారి రియాక్షన్‌ మీకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. ఉత్తర్‌ప్రదేశ్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌ కిరణ్‌ శివకుమార్‌ తన చిట్టి కూతురి కోసం కథకుడిగా మారారు. 

ఆ కథలను పుస్తకంగా ప్రచురించారు. ‘కథలు చెప్పడం పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఉపయోగపడుతుంది’ అంటున్నారు. ఆశ్చర్యంగా అనిపించినా ‘కథ చెబితేనే పడుకుంటాను’ అని డిమాండ్‌ చేసే పిల్లలు ఇప్పటికీ ఉన్నారు. అలా అని ఏదో ఒక కథ చెబితే సరిపోదు. ఆ కథలు కొత్తగా, ఆసక్తికరంగా ఉండాలి!

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలిస్‌గా విధులు నిర్వహిస్తున్న ఐపీఎస్‌ ఆఫీసర్‌ కిరణ్‌ శివకుమార్‌కు తన చిట్టి కూతురు తన్వీ నుంచి ‘నాన్నా కథ చెప్పు’ అనే విన్నపం వచ్చింది. కూతురికి ఎలాంటి కథలు నచ్చుతాయో తెలుసుకోవడానికి అతడికి కొంత సమయం పట్టింది. ఆ తరువాత అప్పటికప్పుడు అశువుగా కథలు చెప్పడం మొదలు పెట్టారు. 

డైనో మరియు రైనో
తన్వీకి తాను చెప్పిన కథలను గాలికి వదిలేయకూడదు అనుకున్న శివకుమార్‌ వాటిని ‘ది ఫాదర్‌ హూ ర్యాన్‌ ఔట్‌ ఆఫ్‌ స్టోరీస్‌’ పేరుతో పుస్తకంగా ప్రచురించారు. డైనో, రైనో అనేవి ఈ పుస్తకంలో ప్రధాన పాత్రలు. ఊహాజనిత, కాల్పనిక విషయాలే కాదు వివిధ దేశాలు, చారిత్రక సంఘటనలు, సాంస్కృతిక నేపథ్యం గురించి ఈ కథలు సరదా సరదాగా చెబుతాయి.

పాత సినిమాలు చూసి...
తన్వీకి డైనోసర్‌లు అంటే చాలా ఆసక్తి. ఆ ఆసక్తిని దృష్టిలో పెట్టుకొని డైనోసార్‌ ఆధారంగా కథలు చెప్పడం ప్రారంభించారు. ‘కేవలం డైనోసార్‌తోనే కథలు చెప్పడం కష్టం కాబట్టి దానికి తోడుగా ఖడ్గమృగాన్ని తీసుకువచ్చాను. డైనో, రైనో.. ప్రాస కూడా బాగా కుదిరింది’ నవ్వుతూ అంటారు శివకుమార్‌. కథ ఆసక్తికరంగా చెప్పడానికి పాత సౌత్‌ ఇండియన్‌ మూవీస్‌ చూసేవారు శివకుమార్‌. అందులో ఏదో ఒక స్టైల్‌ ఫాలో అయ్యేవారు. ‘ఈరోజు తన్వీకి ఏ కథ చెప్పాలి?’ అనేదానికి సంబంధించి కొంత సమయం కేటాయించుకునేవారు. ఆ సమయం తనకు ఎంతో సంతృప్తికరంగా ఉండేది. సంతోషంగా ఉండేది.

తన్వీ స్పందన
ఇంతకీ పుస్తకం వచ్చిన తరువాత తన్వీ స్పందన ఏమిటి? ‘ఎందుకు ఈ పుస్తకం రాశారు?’ అని తండ్రిని ముద్దు మాటలతో అడిగింది. ఆ మాటలలో పుస్తకం రావడంపై పెద్దగా సంతోషం కనిపించలేదు. ఇంతకీ విషయం ఏమిటంటే...తన్వీ కథలను చదవాలనుకోవడం లేదు. తండ్రి నోటి నుంచి మాత్రమే వినాలనుకుంటుంది!    
                             ∙

పిల్లలకు కథలు చెప్పడం... పెద్దలకు మేలు చేస్తుంది!
∙పిల్లలకు కథలు చెప్పడం అనేది పెద్దల ఊహశక్తికి, మానసిక చురుకుదనానికి ఉపయోగపడుతుంది ∙కథ చెప్పే విధానం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. జ్ఞాపకశక్తి, తార్కిక ఆలోచన మెరుగవుతుంది 
∙అప్పటికప్పుడు కథలు అల్లి పిల్లలకు చెప్పడం వల్ల క్రియేటివిటీ పెరుగుతుంది 
∙పిల్లలు అడిగే ప్రశ్నల ఆధారంగా అప్పటికప్పుడు కథలు అల్లడం ద్వారా ‘క్విక్‌–థింకింగ్‌ స్కిల్స్‌’ పెరుగుతాయి ∙రోజువారి ఒత్తిడి నుంచి బయటపడడానికి పిల్లలకు కథలు చెప్పడం అనేది సృజనాత్మక మార్గం.

Videos

విజయనగరంలో ఇంత దారుణం ఎప్పుడు చూడలేదు ఇంతలా దాడి చేస్తారా..

రంపంతో దాడి.. అమ్మాయి మేనత్త చెప్పిన సంచలన విషయాలు

ఎవరొచ్చినా అదే దూకుడు.. మారని ఇజ్రాయెల్ వైఖరి..!

రాప్తాడు స్కూల్ లో దారుణం! టెన్త్ బాలికపై రంపంతో...

రంపంతో విద్యార్థినిపై దాడి నిందితుడు అరెస్ట్

ఉప్పాడపై ఉప్పెన.. కొట్టుకుపోయిన బీచ్... వైరల్ అవుతున్న వీడియో

రాప్తాడు సైకో.. రంపంతో విద్యార్థినిపై దాడి అసలు కారణం అదే

రంపం తీసుకుని వస్తుంటే స్కూల్ లో పనోడు అనుకున్నాం.. షాకింగ్ నిజాలు

వేడినీళ్లు తాగు బాబూ.. సూర్యవంశీపై తల్లి ప్రేమ చూడండి!

నెలకు 60,000 ఆదాయం.. SBI అదిరిపోయే స్కీమ్

Photos

+5

40 ఏళ్లు దాటాయి అంటే ఎవరూ నమ్మరేమో! (ఫొటోలు)

+5

వరంగల్ :‌ నిట్‌లో సాంకేతిక మహోత్సవం టెక్నోజియాన్‌–26 ప్రారంభం (ఫోటోలు)

+5

‘ఆదర్శ కుటుంబం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఫెస్టివ్ మూడ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. (ఫోటోలు)

+5

బ్లూ డ్రెస్‌లో నటి ప్రణవి గ్లామర్.. (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో శ్రద్ధాకపూర్ గ్లామర్‌.. (ఫోటోలు)

+5

భర్తతో కాజల్ అగర్వాల్ కార్వా చౌత్ సెలబ్రేషన్స్.. (ఫోటోలు)

+5

ధోనితో మంధాన ముచ్చట.. ఫొటోలు వైరల్‌

+5

'ఆదర్శ కుటుంబం'మూవీ HD స్టిల్స్‌

+5

అనిల్ కపూర్ నివాసంలో ‘కర్వా చౌత్’ పండుగ సెలబ్రేషన్స్ (ఫొటోలు)