Breaking News

అన్నీ ఎదురుదెబ్బలే, 4 సార్లు ఫెయిల్‌ : సక్సెస్ చేయి అందుకుంది

Published on Sat, 03/30/2024 - 15:11

అసాధారణమైన సంకల్ప శక్తి, పట్టుదల ఉంటే ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కోవచ్చు. బాధలనుంచే  సంతోషాన్ని, సక్సెస్‌ను అందుకోవచ్చు. ఢిల్లీకి చెందిన అన్షికా జైన్ సక్సెస్‌ స్టోరీ చదివితే దీన్ని అక్షరాలా నిజం అంటారు. ఇంతకీ అన్షిక ఏం సాధించారో ఈ కథనంలో  తెలుసుకుందాం.

ఢిల్లీకి చెందిన అన్షికా అయిదేళ్ల ప్రాయంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది. దీంతో అమ్మమ్మ , మేనమామల వద్దే పెరిగింది. వారే ఆమె జీవితంలో ప్రధానంగా మారిపోయారు. ఆమె జీవితంలో బలమైన స్తంభాలుగా  నిలిచారు.  ఆమె ఉన్నతికి  బాటలు వేశారు. 

ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న అన్షిక అమ్మమ్మ తాను సివిల్ సర్వెంట్ కావాలని కలగంది. కానీ అది సాకారం లేదు. అందుకే మనవరాలిని ఆ వైపు ప్రోత్సహించింది.  అన్షిక కూడా అమ్మమ్మ డ్రీమ్‌ను నెరవేర్చాలని నిర్ణయించుకుంది.  

ఢిల్లీ యూనివర్సిటీలోని రాంజాస్ కాలేజీలో ఎంకామ్‌ పూర్తి చేసిన తర్వాత, దేశంలోని అతిపెద్ద  కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది అన్షికకు. కానీ ఐపీఎస్‌ కావాలనేది  కోరికతో దానిని తిరస్కరించింది. యూపీఎస్‌సీ కోసం సిద్ధమవుతోంది. ఇక్కడే మరోసారి ఆమెకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. 2019లో తనకు పెద్ద దిక్కుగా ఉన్న అమ్మమ్మను కోల్పోయింది. ఏకైక సపోర్ట్ సిస్టమ్‌ మాయం కావడంతో చాలా బాధపడింది అన్షిక. కానీ అమ్మమ్మ డ్రీమ్‌ గుర్తు చేసుకుంది. పట్టుదలతో  ప్రిపరేషన్‌ను కొనసాగించింది.

నాలుగు సార్లు విజయం దక్కకపోయినా పట్టు వీడలేదు. 2020లో జస్ట్‌ ఒక్క నంబరులో అవకాశాన్ని కోల్పోయింది. చివరికి అయిదో ప్రయత్నంలో AIR-306 ర్యాంకు  సాధించింది. అలా ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్‌ కావాలనే ఆమె కోరిక ఫలించింది. 2023, జూన్‌ 5  ఏఐఎస్‌ అధికారి వాసు జైన్‌ను ప్రేమ వివాహం చేసుకుంది.  అన్షిక  ఐపీఎస్‌  కల సాకారంలో వాసు జైన్‌  పాత్ర కూడా చాలా ఉందిట.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)