Breaking News

Intips: ఈ పదార్థాలకు పురుగు పట్టకుండా.. ఇలా చేయండి!

Published on Fri, 09/27/2024 - 10:36

బియ్యం, గోధుమపిండి, కంది, పెసర, మినప్పప్పు లాంటì  వాటి విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే, చిన్న చిన్న కీటకాలు చేరుతాయి. వీటిని తింటే కడుపునొప్పి, ఫుడ్‌ పాయిజనింగ్‌ సమస్యలు, కొన్నిసార్లు అలర్జీలు కూడా రావచ్చు. అయితే కొన్ని చిన్న చిట్కాలు పాటించడం ద్వారా వాటికి పురుగులు పట్టకుండా కాపాడుకోవచ్చు.

ఎండు వెల్లుల్లి రెబ్బలు..
పప్పు, బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే, అందులో కొన్ని ఎండు వెల్లుల్లి రెబ్బలు కలపాలి. వెల్లుల్లి నుంచి వెలువడే గాఢమైన వాసన వల్ల పురుగులు పప్పు, బియ్యం గింజల వైపు రాలేవు.

వాము కలపడం..
బియ్యం డబ్బా లేదా బస్తాలో కాస్తంత వాము వేస్తే, అందులో పురుగులు పట్టవు. ఎందుకంటే వాము వాసన కూడా పురుగులకు పడదు.

ఎండు మిరపకాయలు..
బియ్యం లేదా గోధుమలు నిల్వ చేసేటప్పుడు, కాసిని ఎండు మిరపకాయలు ఉంచితే, పురుగు పట్టకుండా చాలాకాలం పాటు తాజాగా ఉంటాయి.

వేపాకులు..
వేపాకులకు ఉండే చేదు గుణం, ఘాటైన వాసన వల్ల పురుగులు దూరంగా ఉంటాయి. అందుకే, బియ్యం నిల్వ చేసే పాత్రలో కొన్ని వేపాకులు వేస్తే పురుగులు పట్టవు.

మిరియాలు..
బియ్యం నిల్వచేసే డబ్బాల్లో కొన్ని మిరియాలు వేస్తే, అందులో పురుగులు పట్టవు. మిరియాల వాసన చాలా ఘాటుగా ఉంటుంది. వీటిని గోధుమల్లో కలిపి, వాటికి కూడా పురుగులు పట్టకుండా జాగ్రత్త పడొచ్చు.

లవంగాలు..
లవంగాల ఘాటు వాసనను పురుగులు, కీటకాలు భరించలేవు. అందుకే, బియ్యం నిల్వ ఉంచే పాత్రలో కాసిని లవంగాలు వేయాలి. లవంగ నూనె కూడా కీటకాలను దూరం చేస్తుంది.

ఇవి చదవండి: ఇవి.. సహజసిద్ధ'మండి'!

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)