Breaking News

International Yoga Day మహిళలకోసం బెస్ట్‌ అండ్‌ హెల్దీ ఆసనాలు

Published on Sat, 06/21/2025 - 09:59

మహిళల ఆరోగ్యానికి, అంతర్గత ఆనందానికి మేలైన సాధనంగా యోగాసనాలు ఎంతగానో ఉపయోగపడతాయి. నేడు యోగా డే సందర్భంగా కొన్ని ఆసనాలు.

హెల్దీగా.. హ్యాపీగా...

కోణాసనం: సైడ్‌ యాంగిల్‌ పోజ్‌ గా పిలిచే ఈ ఆసనం వేస్తే.. శరీరం బాగా స్టెచ్ర్‌ అవుతుంది. కాళ్లు, చేతులకు బలం చేకూరుతుంది. వెన్ను నొప్పి, సయాటికా సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

వృక్షాసనం: నిటారుగా నిల్చొని, ఒక పాదాన్ని రెండవ కాలు మధ్యకి తీసుకొచ్చి, రెండు చేతులు తలమీదుగా పూర్తిగా పైకి నమస్కారం భంగిమలో తీసుకోవాలి. ఈ ఆసనం వల్ల మానసిక సమతుల్యత ఏర్పడి ఏకాగ్రత పెరుగుతుంది.

పాద హస్తాసనం: నిటారుగా నిల్చొని, శరీరాన్ని ముందుకు వంచి, చేతులను పాదాలకు, తలను మోకాళ్లకు ఆనించాలి. దీనివల్ల నరాల వ్యవస్థ చురుకుగా మారి.. రక్త ప్రసరణ మెరుగవుతుంది.

అర్ధ మత్స్యేంద్రాసన: మ్యాట్‌ పైన కూర్చొని, ఎడమ కాలుని కుడి తొడ పక్కగా తీసుకొచ్చి, నేల మీద ఉంచాలి. ఎడమ చేతిని ఎడమ మోకాలు నుంచి తీసుకొచ్చి, పాదం పట్టుకోవాలి. కుడి చేతిని నిటారుగా నేల మీద ఉంచాలి. ఈ ఆసనం వల్ల ఆక్సిజన్‌ లెవెల్స్‌ పెరిగి ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది.

సేతు బంధాసన: దీనిని బ్రిడ్జ్‌ పోజ్‌ అంటారు. ఇది కటి భాగం, గర్భాశయం, వెన్నుకి చాలా మంచిది. ఇది కటి కండరాలను బలోపేతం చేస్తుంది. పునరుత్పత్తి అవయవాలకు రక్త ప్రసరణను పెంచుతుంది.

మార్జాలాసనం: క్యాట్‌–కౌ పోజ్‌ గా పిలిచే ఈ ఆసనం వెన్నెముక బలానికి, ఒత్తిడిని తగ్గించడంలోనూ సహాయపడుతుంది కటి కండరాలను ఫ్లెక్సిబుల్‌గా చేస్తుంది.

బాలాసన: చైల్డ్‌ పోజ్‌ పెద్దలకు కూడా మేలు చేస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గించడానికి, విశ్రాంతికి సహాయపడుతుంది. ఈ ఆసనం వెన్నునొప్పిని తగ్గించి, మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది.

భుజంగాసన: కోబ్రా పోజ్‌ గా పిలిచే ఈ ఆసనం ఛాతీ, వెన్ను భాగాలను బలోపేతం చేస్తుంది. ఇది శ్వాసను మెరుగుపరుస్తుంది. శక్తిని పెంచుతుంది.

 త్రికోణాసన: ట్రయాంగిల్‌పోజ్‌ వల్ల  పాదాలు, కాళ్ళు, చేతులు, వెన్నును బలోపేతం అవుతాయి. శరీరానికి సమతుల్యతను అందిస్తుంది.

మాలాసన: దీనిని గార్లాండ్‌ పోజ్‌ అంటారు. రెండు కాళ్ళను వెడల్పుగా ఉంచి, మోకాళ్ళ వరకు వంగి, చేతులను నమస్కారం స్థితికి తీసుకురావాలి. ఈ ఆసనం సాధన చేయడం వల్ల రుతుక్రమమం, మలబద్ధకం సమస్యలు తగ్గుతాయి. తొడ కండరాల శక్తి పెరుగుతుంది.

ఈ ఆసనాలను రోజూ సాధన చేయడం వల్ల మానసిక ప్రశాంతత చేకూరి శారీరక ఆరోగ్యం అభివృద్ధి అవుతుంది ఫలితంగా జీవన శైలిలో మంచి మార్పులు కలుగుతాయి. 

Today Tip : బాల్కనీ మొక్కలు.. అదిరిపోయే చిట్కా!
– అనూష రాకేష్, 
యోగా ట్రైనర్, హైదరాబాద్‌ 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు