Breaking News

International Day for Biological Diversity మనల్ని కాపాడే వైవిధ్యం!

Published on Thu, 05/22/2025 - 11:42

‘ప్రకృతితో సామరస్యం, సుస్థిర అభివృద్ధి’ అనే ఇతివృత్తంతో ఈ యేటి ‘అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం’  (International Day for Biological Diversity) నేడు జరుపుకొంటున్నాం. మానవుని కార్యకలా పాల కారణంగానే ఈ భూమిపై జీవ వైవిధ్యం దెబ్బతింటోంది. గత దశాబ్దంలో, మనం గణనీయమైన జీవవైవిధ్య నష్టాన్ని చవి చూశాం. 467 జాతులు అంతరించిపోయాయి. ఈ నష్టం అస్థిరమైన వనరుల వినియోగం, కాలుష్యం, అన్యజీవుల ఆవాస ప్రాంతాల దురాక్రమణ వంటి వాటి వల్ల సంభవించిందే. గత దశాబ్దంలో వివిధ కారణాల వల్ల గణ నీయమైన పంట జన్యు వైవిధ్యం కోల్పోయాం. జీవ వైవిధ్య నష్టా నికి వాతావరణ మార్పు ఒక ముఖ్యమైన చోదకంగా లేదా ఉత్ప్రే రకంగా పనిచేస్తుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, మారుతున్న వర్ష పాత పరిమాణాలు, అడవి మంటలు వంటి సంఘట నలు జీవ జాతుల ఆవాసాలను నాశనం చేస్తాయి. 

 పొంచి ఉన్న జీవవైవిధ్య సంక్షోభం జన్యు వనరు లకు తీవ్రమైన ముప్పును కలిగిస్తుంది, ఇది జాతుల జన్యు వైవిధ్యంలో క్షీణతకు, వాటి విలుప్తానికి కూడా దారితీస్తుంది. ఆహార భద్రతను కాపాడుకోడానికి, కొత్త ఔషధాల అభివృద్ధికి, వాతావరణ మార్పులకు అను గుణంగా జీవజాలంలో ఉన్న మారగలిగిన సామర్థ్యాన్ని కోల్పోకుండా ఉండేందుకు జన్యు వైవిధ్యం తప్పనిసరి. జీవవైవిధ్య పరిరక్షణ లక్ష్యంగా జాతీయ, అంత ర్జాతీయ ‘చట్టపరమైన చట్రాలు’ ఉన్నప్పటికీ, ఉల్లంఘనలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. దేశంలోని జీవ వైవిధ్య చట్టంలో చేసిన కొన్ని సవరణలు, జీవవైవిధ్య పరిరక్షణ స్ఫూర్తికి అనుగుణంగా లేవని చెప్పక తప్పదు. అలాగే చట్టాల బలహీనమైన అమలు, అవినీతి, రాజ కీయ జోక్యం, అవగాహనా రాహిత్యం, ప్రజా మద్దతు కొరవడటం, జీవవైవిధ్యానికి అపార నష్ట హేతువులు.

ఇదీ చదవండి: అల్జీమర్స్‌ను గుర్తించే రక్తపరీక్ష : వచ్చే నెలనుంచి అందుబాటులోకి

జీవవైవిధ్యాన్ని కాపాడటానికి ‘ఇన్‌–సీతూ’ పరి రక్షణ అవసరం ఉంది. ఆ యా జీవ జాలాల సహజ ఆవాసాలలో ఉండే పరిస్థితుల రక్షణ ఒక కీలకమైన వ్యూహం కావాలి. జీవజాలాల ఆవాసాల పునరుద్ధరణ, నిర్వహణలలో ప్రజలకు అవగాహన కల్పించి వారినిఆ ప్రక్రియలో భాగస్వాములను చేయాలి. జాతీయ ఉద్యానాలు, వన్యప్రాణుల అభయారణ్యాలు వంటి రక్షిత ప్రాంతాలను స్థాపించాలి. కేంద్ర ప్రభుత్వ రెండవ ‘జీన్‌ బ్యాంక్‌’ నిర్మాణానికి పూనుకో వడం ఆహ్వానించదగిన పరి ణామం. స్థానిక సమాజాల ‘కమ్యూ నిటీ విత్తన నిధుల’ను అనుసంధాన పరచడం జీవ వైవిధ్య పరిరక్షణలో అత్యంత కీలకమైన అంశం అవు తుంది. వ్యవసాయం, అడవులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటివాటి విషయంలో భూవినియోగ ప్రణా ళికను జీవవైవిధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించాలి. ఈ అన్ని చర్యలూ జీవవైవిధ్యాన్ని కాపాడి భూగోళాన్ని సజీవంగా ఉంచుతాయి.   

ఇదీ చదవండి: పట్టుబట్టాడు, ఐఎఫ్‌ఎస్‌ కొట్టాడు : రైతుబిడ్డ దీక్షిత్‌ సక్సెస్‌ స్టోరీ

  • బలిజేపల్లిశరత్‌ బాబు 
    వ్యాసకర్త జాతీయ జన్యు వనరుల బ్యూరో విశ్రాంత శాస్త్రవేత్త
    (నేడు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం)

     

Videos

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)