Breaking News

ఆహా ఏమి రుచి..! నోరూరించే వివిధ రకాల వంటకాలు..

Published on Fri, 10/17/2025 - 11:06

నోరూరించే వివిధ రకాల వంటకాలకు నగరం వేదికైంది.. పాకశాస్త్రంలో ప్రావీణ్యం పొందిన పలువురు చెఫ్‌లు వివిధ ప్రాంతాల వంటకాలతో ఆకట్టుకున్నారు. అంతర్జాతీయ చెఫ్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని భాగ్యనగరంలోని సనత్‌నగర్‌లో అగ్రోమెచ్‌ స్టూడియో తెలంగాణ, ఆంధ్ర చెఫ్‌ల వంటకాలకు గురువారం వేదికైంది. అత్యంత ఘనంగా నిర్వహించిన కార్యక్రమం చెఫ్‌ల ఐక్యత, వారసత్వ కళ, పాకశాస్త్రానికి వేదికగా నిలిచింది.     

తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన చెఫ్‌లు కేవలం వేడుక జరుపుకోవడానికి మాత్రమే కాకుండా, ఒకరికొకరు కనెక్ట్‌ అవ్వడానికి, మెరుగైన భవిష్యత్తుకు తమ అనుభవాలను పంచుకున్నారు. పాకశాస్త్రంలో పేరెన్నికగన్న చెఫ్స్‌ కాశీ విశ్వనాథన్, శేఖర్, సంజయ్‌ తుమ్మ, సుధాకర్‌ ఎన్‌.రావు, మిస్టర్‌ పాల్గుణి నాయుడు, సుధా కుమార్, మిస్టర్‌ అన్మోల్‌ ప్రభు, మిస్టర్‌ కళ్యాణ్‌ చక్రవర్తి, రవీందర్‌ రెడ్డి వంటి ప్రఖ్యాత చెఫ్‌లు, ముఖ్య అతిథులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 

వీరంతా పాక శాస్త్రం, ఆరోగ్యం, ఆవిష్కరణల పరిణామంపై ప్రభావవంతమైన సూచనలను అందించారు. ఆహారం అంటే పోషకాహారం మాత్రమే కాదు, సంరక్షణ, సృజనాత్మకత, స్థానిక భాష.. అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, ప్రొఫెషనల్‌ చెఫ్‌లతో పోటీ పడుతూ తమ పాక శాస్త్ర ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు. అనుభవజ్ఞులైన చెఫ్‌ల నేతృత్వంలోని ఇంటరాక్టివ్‌ షేరింగ్‌ సెషన్స్, మనదైన వారసత్వ వంటకాలను పంచుకున్నారు. 

బెస్ట్‌ వంటకాల ప్రదర్శన చేసిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందించారు. చెఫ్‌ల మధ్య సోదరభావాన్ని ఏర్పరిచింది. ఈ సందర్భంగా సీఏటీఏ వ్యవస్థాపకుడు, ప్రధాన కార్యదర్శి చెఫ్‌ యాదగిరి మాట్లాడుతూ ‘అంతర్జాతీయ చెఫ్‌ దినోత్సవం కేవలం ఒక వేడుక కాదు.. ఇది ఓ కుటుంబం, ఆహారానికీ జీవం పోసే ప్రతి కళాకారుడినీ వృద్ధిలోకి తీసుకురావడమే ప్రధాన ఉద్దేశం’ అన్నారు. చెఫ్స్‌ ఐక్యత, సేవా సందేశంతో తెలంగాణ, ఆంధ్ర అంతర్జాతీయ చెఫ్‌ దినోత్సవం– 2025 వేడుకను ముగింపుగా కాకుండా ఒక ప్రారంభ సూచికగా నిలిచింది..   

(చదవండి: ప్రపంచ ఆరోగ్య వేదికపై ప్రసంగించిన తొలినటి...! ఏం మాట్లాడారంటే..)

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)