Breaking News

విద్య, విజ్ఞానం మాత్రమే చాలదు! నిత్య జీవితానికి..

Published on Mon, 07/06/2026 - 07:47

విద్య, విజ్ఞానం ఉన్నంత మాత్రాన చాలదు. నిత్య జీవితానికి లోకజ్ఞానం, ఇంగిత జ్ఞానం చాలా అవసరం. విద్యావంతులమని విర్రవీగరాదు. ప్రతి వ్యక్తి దగ్గర నేర్చుకోవలసినవి ఎన్నో వుంటాయని గుర్తించాలి. ఎంత విజ్ఞానికైనా ఒక్కొక్కసారి సామాన్య విషయం తెలియక పోవచ్చు, స్ఫురించక పోవచ్చు. ఎంతటి మేధావులైనా, కొన్నిసార్లు అతి సంక్లిష్టమైన విషయాల గురించి ఆలోచిస్తూ నిత్యజీవితంలోని చాలా సాధారణమైన విషయాలను గమనించలేకపోవచ్చు.

న్యూటన్‌ గొప్ప వైజ్ఞానిక శాస్త్రవేత్త. భూమికి గల ఆకర్షణ శక్తిని కనిపెట్టినవాడు న్యూటన్‌. నిరంతరం తన పరిశోధనాంశానికి సంబంధించిన ఆలోచనలోనే నిమగ్నుడై ఉండేవాడు. పరిశోధనలే అతని లోకం. ఇతర విషయాలను అతను ఏమీ పట్టించుకోలేదు.
న్యూటన్‌ ఎంతో ప్రీతిగా ఒక పిల్లిని పెంచేవాడు, అతను తలుపు వేసుకొని పరిశోధనలో నిమగ్నుడై ఉన్నప్పుడు పిల్లి తలుపు దగ్గర చేరి ‘మ్యావ్‌ మ్యావ్‌ ’ అని అరిచేది. ఇది చూసి జాలి వేసి తలుపులో ఒక రంధ్రం చేయించాడు. దానికి అవసరమైనప్పుడంతా ఆ పిల్లి ఆ రంధ్రంనుండి లోపలికి వచ్చి, పోతూ వుండేది.  కొంత కాలానికి ఆ పిల్లికి రెండు పిల్లలు పుట్టాయి.

న్యూటన్‌ వడ్రంగిని పిలిపించి మరో రెండు రంధ్రాలు చేయమన్నాడు. వడ్రంగి రెండు రంధ్రాలు ‘దేనికి’ అని అడిగాడు. అప్పుడు న్యూటన్‌ ‘ఇన్నాళ్ళు ఒకే పెద్ద పిల్లి వుండేది. ఇప్పుడు దానికి రెండు పిల్లలు పుట్టాయి. వాటికోసం మరో రెండు కన్నాలు కావాలి కదా!‘ అన్నాడు. ‘‘ఏమండీ! ఉన్న ఒక రంధ్రంలో నుండే ఆ రెండు పిల్లలు దూరవచ్చు. ఒకదాని తరువాత మరొకటి వెళ్తాయి కదా’ అన్నాడు. ‘‘వడ్రంగికి వున్న తెలివి నాకు లేకపోయిందే. నేనీవేళ ఒక గుణపాఠం నేర్చుకున్నాను.’’ అని న్యూటన్‌ అనుకున్నాడు.

విద్య, హోదాతో సంబంధం లేకుండా.. చిన్న పిల్లల నుండి, సామాన్య వృత్తుల వారి వరకు ప్రతి ఒక్కరి దగ్గరి నుండి మనం నేర్చుకోవడానికి ఏదోకటి ఉంటుంది. ఈ కథలో న్యూట¯Œ కు పిల్లి పట్ల ఉన్న జాలి, ప్రేమ కూడా మనకు కనిపిస్తాయి. పరిశోధనల్లో ఎంత మునిగిపోయినా, ఆ మూగజీవి ఇబ్బంది పడకూడదనే అతని ఆలోచన గొప్పది. ‘విద్య వినయాన్ని ఇస్తుంది’ అంటారు. ఈ కథ న్యూటన్‌ మేధస్సునే కాకుండా, అతనిలోని వినయాన్ని, నిరంతర అభ్యాసకుడిని మనకు పరిచయం చేస్తుంది.

పుస్తక జ్ఞానం ఎంత ఉన్నా, లోకజ్ఞానం లేదా కామన్‌ సెన్స్‌ అనేది అంతే ముఖ్యం.   తాను ప్రపంచం గర్వించదగ్గ మహా శాస్త్రవేత్తనని న్యూటన్‌ అహంకరించలేదు. ఒక సామాన్య వడ్రంగి చెప్పిన మాటలోని నిజాన్ని గ్రహించి, ‘ఈ రోజు ఒక గుణపాఠం నేర్చుకున్నాన’ని ఒప్పుకోవడం అతని గొప్పతనానికి, వినమ్రతకు నిదర్శనం. – తరిగొప్పుల విఎల్లెన్‌ మూర్తి

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)