Breaking News

దుబాయ్‌ రోడ్ల మీద డ్రైవరమ్మ జోరు!

Published on Sun, 09/28/2025 - 06:57

ముందు వెళ్తున్న కారు ఒక్కసారిగా లెఫ్ట్‌ ఇండికేటర్‌ వేసి, రైట్‌కి తిరిగిందంటే, వెనక వున్నవాళ్లు తక్షణమే ‘లేడీ డ్రైవర్‌!’ అని ఫిక్స్‌ చేసేసుకుంటారు. కాని కొంతమంది ఓవర్‌టేక్‌ చేసి ముందుకు వచ్చి చూస్తే, చీర కట్టుకుని, పూలు పెట్టుకుని, స్టీరింగ్‌పై స్పీడ్‌ రేస్‌ చేస్తున్న మహిళలని చూసి షాక్‌ అవుతుంటారు. ఇలా సమాజంలో మహిళల డ్రైవింగ్‌పై ఇంకా కొందరు సందేహాలు వ్యక్తం చేస్తుంటారు. కాని కేరళకు చెందిన డెబ్బై రెండేళ్ల మణి అమ్మ ఆ మాటలన్నింటినీ రోడ్డుమీద దుమ్ము దులిపేసింది. అందుకే ఆమెను అందరూ ‘డ్రైవర్‌ అమ్మ’ అని పిలుస్తారు. 

మణి అమ్మ కేవలం యాక్టివా నడిపే స్థాయిలో ఆగిపోలేదు. లగ్జరీ కార్లు, బస్సులు, ట్రక్కులు, క్రేన్‌లు, రోడ్‌ రోలర్లు ఇలా మీరు పేరు చెప్పండి, ఆమె ఆ వాహనాన్ని నడిపేందుకు సిద్ధంగా ఉంటుంది. మొత్తం పద్దెనిమిది రకాల వాహనాలను నడిపేందుకు కావలసిన పదకొండు లైసెన్సులు ఆమె చేతిలో ఉన్నాయి. 2004లో భర్త మరణం తర్వాత అతని ‘ఏ టు జెడ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెవీ ఎక్విప్‌మెంట్స్‌’ అనే డ్రైవింగ్‌ స్కూల్‌ను మూసేయకుండా, తానే స్కూల్‌ నడిపించి, తన జీవితాన్నే రేస్‌ ట్రాక్‌లా మార్చేసుకుంది.

 ఇటీవల దుబాయ్‌ వీథుల్లో, సంప్రదాయబద్ధంగా చీర కట్టుకుని ఆత్మవిశ్వాసంగా రోల్స్‌–రాయిస్‌ ఘోస్ట్‌ కారును నడుపుతున్న ఆమె వీడియో వైరల్‌ అవ్వడంతో, అది చూసి ‘మహీంద్రా’ అధినేత ఆనంద్‌ మహీంద్రా కూడా ఆమెకు సెల్యూట్‌ చేశారు. ప్రస్తుతానికి ఈ అమ్మ ఒక్క విమానం నడపటం మాత్రమే మిగిలి ఉంది, అది కూడా నేర్చుకుని నడిపించే ధైర్యం ఉంది అంటోంది మణి అమ్మ.  

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి