వీధి బాలుడి నుంచి కేఫ్ యజమానిగా..! అక్కడ ప్రతి టేబుల్‌ వెనుక..

Published on Fri, 10/23/2026 - 16:08

మనం పడ్డ కష్టాలు మరొకరెవరు పడకూడదు అనుకుంటారు చాలామంది. నోటి మాటగా అలా అనేస్తామే గానీ..అది ఆచరణ సాధ్యం కానిది. కొందరే తనలా కష్టాలు, కన్నీళ్ల మధ్య పెరిగిన వాళ్ల పాలిట ఆప్తమిత్రుడిలా మారి వాళ్ల ఆలనాపాలనా చూసుకుంటారు. అంతేగాదు తన మాదిరిగా పైకొచ్చేలా నిస్వార్థంగా సాయం చేస్తుంటారు. అలాంటి రియల్‌ హీరోనే ముంబైకి చెందిన అమీన్‌ షేక్‌. అతని కథ వింటే కళ్లు చెమ్మగిల్లడమే కాదు..జీవితం అంటే ఏంటో తెలుస్తుంది కూడా. మరి ఆ స్ఫూర్తిదాయక స్టోరీ ఏంటో చకచక చదివేద్దామా..!

ముంబైకి చెందిన అమీన్‌ షేక్‌(Amin Sheikh) బాల్యం కలలో కూడా పగవానికి కూడా రాకూడదని కోరకునేలా సాగింది. ఇంకా స్పష్టంగా మాటలు రాని వయసులోనే కష్టాలకు తాళ్లలేక ఇంటి నుంచి పారిపోయాడు. వీధుల్లో తిరుగుతూ చెత్త ఏరుకుంటూ బతికేవాడు. ఎవరైనా ఆహారం పెడతారేమో అని ఎదురుచూపులు చూసేవాడు. అలా వీధి బాలుడిగా పెరుగుతున్న అతడు సరిగ్గా ఎనిమిదేళ్ల ప్రాయంలో ఒక క్యాథలిక్‌ సన్యాసిని కంట్లో పడ్డాడు. ఆమె అతడిని రక్షించి జెసూట్ అనాథాశ్రమంలో వసతి ఏర్పాటు చేసింది. ఇక అక్కడ పెరిగిన అమీన్‌ ఏడో తరగతి వరకు చదువుకుని ఆ తర్వాత డ్రైవింగ్‌ నేర్చుకున్నాడు. 

జీవితాన్ని మలుపు తిప్పిన ఆ ప్రయాణం..
అలా అతడు ఒక ధనవంతుడి వద్ద డ్రైవర్‌గా పనిచేసేవాడు. అయితే యజమాని మంచి లగ్జరీ కేఫ్‌లకు వెళ్తే తను బయటే ఉండాల్సి వచ్చేది. ఒకవేళ్ల లోనికి వెళ్తే.. ఇది నీలాంటి వాళ్లకు కాదు అని ముఖం మీదే చెప్పేసేవారు. అయినా అక్కడ ఒక కప్పు కాఫీ ఖరీదుతో అమీన్‌ ఒక బిర్యానీ పొట్లం, కూల్‌డ్రింక్‌ కొనుక్కుని తాగొచ్చు. అయినా అసలు కాఫీ ఎక్కడైన కాఫీనేగా ఎందుకింత ఖరీదు, బంగారంతో ఏమైనా చేస్తారా అని ఆలోచిస్తుండే వాడు. 

ఇంతలో ఆ ధనవంతుడు అమీన్‌కు 2003లో బార్సిలోనాకు ప్రయాణించడానికి సహాయం చేశాడు. ఆ స్పానిష్ నగరంలో పర్యటిస్తున్నప్పుడు, కేఫ్‌లు, రెస్టారెంట్లు అతన్ని సాదరంగా ఆహ్వానించి, ఇతర కస్టమర్లతో పాటు అదే టేబుల్ వద్ద కూర్చోమని చెప్పడం అతను గమనించాడు. భారతదేశంలోని అతని అనుభవానికి ఇది పూర్తి భిన్నంగా ఉంది. ఎందుకంటే మన దేశంలో, యజమానులు భోజనం చేస్తున్నప్పుడు డ్రైవర్లు తరచుగా బయట వేచి ఉండాల్సి వచ్చేది. అలాంటిది ఇక్కడ ధనిక, పేద అనే తారతమ్యం లేకుండా గౌరవంగా చూడటం అమీన్‌ని ఎంతగానో ఆకట్టుకుంది. అప్పుడు అతడికి అనిపించింది విభిన్న నేపథ్యాలకు చెందిన వ్యక్తులు తమ సామాజిక హోదాతో సంబంధం లేకుండా గౌరవంగా చూసే కేఫ్‌ని ఏర్పాటు చేయాలని అనుకున్నాడు. 

రచనతో కేఫ్‌..
అందుకోసం డబ్బు ఎలా అన్నది ప్రశ్న. అసలు తన కథనే పుస్తకంగా మలిచి అమ్మితే..అని ఠక్కున ఆలోచన రావడమే ఆచరణలో పెట్టాడు. అలా తన ఆత్మకథ 'బాంబే ముంబై: లైఫ్ ఈజ్ లైఫ్, ఐ యామ్ బికాజ్ ఆఫ్ యూ' రాసిన పుస్తకం హాట్‌కేకుల్లా అమ్ముడుపోయింది. అలా వచ్చిన సొమ్ముతో ముంబైలో అమీన్ షేక్ అంధేరి ప్రాంతంలోని 'బాంబే టు బార్సిలోనా లైబ్రరీ కేఫ్' ప్రారంభించాడు. ఇది లైబ్రరీ కమ్‌ కేఫ్‌. ఇక్కడ సుమారు 15 మంది దాక పనిచేస్తుంటారు. వారంతా తనలా పెరిగిన అనాథలే. అంతేగాదు ఆ కేఫ్‌ ప్రవేశద్వారం వద్ద ఇది వీధి అమ్మాయిలు, అబ్బాయిలచే నడపబడుతున్న కేఫ్‌ అని సగర్వంగా రాసి ఉంటుంది. 

ఎందిరికో బతుకుదెరువు మార్గదర్శినిగా..
ఈ కేఫ్‌ ఒక కాఫీ కప్పుకి మించి వీధి బాలలకు ఆశ్రయం, బతుకుదారిని  చూపిస్తుంది. తగినంత డబ్బు లేని వారికి రాయితీ ఇచ్చి మరి తక్కువగా సర్వ్‌ చేస్తుంది. అలాగే సమీపంలోని నిరాశ్రయ పిల్లలకు ఉచితం ఆహారం అందిస్తుంది. అంతేకాదు ఇక్కడ కాఫీ తోపాటు విదేశీ డెజర్ట్‌లు కూడా ఉంటాయి. అంతేగాదు ఇక్కడ పనిచేసేవారు ఉన్నతంగా స్థిరపడ్డవారు కూడా ఉన్నారు. ఒకప్పుడు ఆ కేఫ్‌ కార్యకలాపాలు నిర్వహించి ఖుష్బూ అలీ అమీన్‌ ప్రోత్సాహంతో ఫ్యాషన్‌డిజైన్‌ కోర్సు చదివింది. 

పైగా మాల్టీస్ ఫ్యాషన్ బ్రాండ్ 'చార్లెస్ & రాన్' ఒప్పందం కుదుర్చుకుని ఇంటర్న్‌షిప్‌ చేసే అవకాశం దక్కించుకుంది. అలాగే వంటవాడిగా పనిచేసిన సైరాజ్‌ బాబు మెథారి రాప్‌ సంగీతం, రచనల్లో కొనసాగుతున్నాడు. అంతేగాదు ఈ కేఫ్‌  పబ్లిక్ రిలేషన్స్ బృందంలో మాజీ సభ్యురాలైన అలుమెలు బహదూర్‌కు తక్కువ ఆదాయ కుటుంబాల పిల్లల కోసం ఒక పాఠశాలను ప్రారంభించాలనే కల ఉండేది. 

అందుకు షేక్‌ సహకారం అందించడమే కాదు ఇరువురు కలిసి 'లిటిల్ గురూస్ నెస్ట్' అనే ఒక ప్రారంభ విద్యా కేంద్రాన్ని స్థాపించారు, దీనిని జనవరి 2023లో ప్రారంభించారు. ఇక్కడ మాంటెస్సోరి, వాల్డార్ఫ్ విద్యా పద్ధతుల్లో పాఠాలను బోధిస్తారు. అంతేగాదు ఇక్కడ చదివే పిల్లలందరికీ ఎడ్యుకేషన్‌ ఉచితమే. ఇలా ఉచితంగా చదువు అందించడం కోసం  'స్ట్రీట్ ఏంజిల్స్ ఫౌండేషన్'ను కూడా స్థాపించారు. అలా అమీన్‌ షేక్‌ పాఠశాల, కేఫ్‌ రెండింటిని విస్తరించేలా నిధులను పోగుచేస్తున్నారు. తనలాంటి వీధిబాలలెందరికో బతుకుతెరువుని అందిస్తున్నాడు.

 

ఇదీ చదవండి: రూ. 7 లాటరీ టికెట్‌తో..రూ.కోటి గెలుచుకుంది!

 

Videos

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

సుప్రీం చెప్పినా లెక్కలేదు.. కూటమికి అడుగడుగునా జగన్ భయం

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)