MP మల్లు రవి. క్షమాపణ చెప్పాలి: KTR
Breaking News
రూ.21 వేల జీతం నుంచి ఏడాదికి కోట్లు గడించే రేంజ్‌కి..!
Published on Wed, 01/21/2026 - 11:57
ఎన్నో సక్సెస్ స్టోరీలు నెట్టింట ఆకర్షిస్తుంటాయి. అలానే ఈసారి రెడ్డిట్‌లో వైరల్ అవుతున్న ఈ స్టోరీ వచ్చే అవకాశాలను ఒడిసిపట్టుకుంటే..ఆకామంత గెలుపుని పాదాక్రాంతం చేసుకోవచ్చని చూపించే గాథ ఇది. కనీస అవసరాలు తీర్చుకోలేక అల్లాడుతూ చాలీచాలని జీతంతో మొదలైన అతడి జీవితం..చార్టర్ అకౌంటెంట్‌ని కలవగానే ఎలా మలుపు తిరిగిందో షేర్ చేశాడు. ఈ కథ నెటిజన్లను..అమితంగా ఆకర్షించడమే కాదు..చాలా స్ఫూర్తిదాయకమైన కథ అంటూ కితాబిచ్చేశారు కూడా.
అదేంటంటే..ఒక మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా హోల్డర్ రెడ్డిట్‌లో రూ.21 వేల నుంచి ఏడాదికి రూ. ఒక కోటి నుంచి రెండు కోట్లు వరకు ఆర్జించే రేంజ్‌కి ఎలా చేరుకున్నాడో పంచుకున్నారు. జాబ్ కెరీర్‌లో ఇంత పెద్ద సక్సెస్‌ని ఎలా సాధించాడో సవివరంగా తెలిపి..ప్రేరణగా నిలిచాడు. మొదట్లో అందరం చిన్నాచితకా ఉద్యోగాలే సంపాదిస్తూ..అక్కడ నుంచి అవకాశాలు వెతుక్కుంటూ పోవాలి.
ఆ క్రమంలో మనకు ఎదురయ్యే కష్టాలు, సవాళ్లే..గొప్ప పరిష్కారాన్ని, విజయాన్ని అందిస్తాయిని చెప్పేందుకే తన కథను షేర్ చేస్తున్నానంటూ తన విజయగాథను చెప్పుకొచ్చాడు. తాను పనిచేసిన తొలి ఉద్యోగాన్ని గుర్తు చేసుకుంటూ..ఒక ఆర్థిక సంస్థలో "డాక్యుమెంట్ ఎగ్జిక్యూటివ్" ఉద్యోగం సంపాదించానని, ఎందుకంటే కరోనా సమయం కావడంతో ఉద్యోగ మార్కెట్ సవ్యంగా లేని గడ్డుపరిస్థితుల్లో ఆ చిన్న ఉద్యోగమే తనకు ఆదారమైందని చెప్పుకొచ్చాడు.
ఆ ఉద్యోగం దగ్గర దగ్గర డెలివరీ బాయ్‌లాంటిదని తెలిపాడు. అప్పుడు రూ. 18 వేలు వేతనం అందుకునేవాడినని చెప్పాడు. తన పని క్లయింట్ల నుంచి ఫైళ్లను సేకరించడం, డాక్యుమెంట్లను వెరిఫై చేసి బ్యాంకులకు సమర్పించడమని అన్నారు. తాను ఢిల్లీలో వేసవి, శీతాకాలపు పొగమంచులను లెక్కచేయకుండా పనిచేసినట్లు చెప్పుకొచ్చాడు.
అంతలా నాలుగేళ్లకు పైగా కష్టపడితే తన జీతం కేవలం రూ. 2 వేలు మాత్రమే పెరిగిందని, దాంతో రూ. 21,000 వేతనం అందుకునేవాడినని వివరించాడు. ఆ క్రమంలో ఒక చార్టడ్ అకౌంటెంట్‌ని(సీఏ)ని కలవగా..తన లైవ్ ఊహించిన మలుపు తిరిగి ..స్వతంత్రంగా ఫంఢింగ్ కేసును నిర్వహించి, నెట్‌వర్క్ ద్వారా ప్రాసెస్ చేస్తూ..50 శాతం ఆదాయం పొందేలా డీల్ కుదుర్చుకున్నట్ల తెలిపాడు. అలా ఇవాళ వందల కోట్లు విలువైన డీల్స్ నిర్వహిస్తూ..ఏడాదికి ఒక కోటి నుంచి రెండు కోట్లు వరకు గడిస్తున్నట్లు తెలిపాడు.
జాబ్ మార్కెట్‌కి మన డిగ్రీతో పనిలేదని అన్నాడు. తాను ఇంతకుమందులా డెలివరీ బాయ్‌లా ఫైళ్లను బ్యాంకులకు డెలివరీ చేయడం లేదని, పూర్తిస్థాయి ఆర్థిక సలహాదారుగా పనిచేస్తూ..కోట్లు గడిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. తాను సంక్లిష్ట రుణ సాధనాలు నిర్వహిస్తానని,ప్రాజెక్ట్ ఫండింగ్ నుంచి ఈక్విటీ ఫండింగ్, పెట్టుబడులు, అధిక టికెట్ బీ2బీ రుణాలు వంటివి నిర్వహిస్తానని పోస్ట్‌లో తెలిపాడు.
ప్రస్తుతం తాను వాణిజ్య రియల్ ఎస్టేట్ నుంచి ఆతిధ్య రంగంపై ఫోకస్ పెట్టినట్లు తెలిపాడు. ఆ నేపథ్యంలోనే హోటళ్లు, ఆస్పత్రులు కొనుగోలు, అమ్మకాలను సులభతరం చేస్తున్నానని పోస్ట్‌లో రాసుకొచ్చాడు. నెటిజన్లు బ్రో చాలా బాగుంది మీ విజయగాధ..చాలా స్ఫూర్తిదాయకం, ప్రేరణ కూడా అంటూ పోస్టులు పెట్టారు.
(చదవండి: బిర్యానీలలో హైదరాబాద్ బిర్యానీ రుచే వేరు..! సాక్షాత్తు జపాన్ రాయబారి సైతం..)
Tags : 1