Breaking News

సమ్యక్‌ దృష్టి.. మిధ్యా దృష్టి!

Published on Mon, 06/15/2026 - 08:31

బుద్ధుడు ఒకసారి మగధ రాజధాని రాజగృహలో ఉన్నాడు. వేణు వనంలో ఉడుతలకు మేత వేస్తున్నాడు. వాటిలో కొన్ని బుద్ధుని మీదకు ఎక్కాయి. ఇంకొన్ని మేత మేస్తున్నాయి. కొమ్మ మీద ఉన్న ఉడుతలు రెండు చకచకా వచ్చి బుద్ధుని ముందు నిలబడ్డాయి. అప్పుడు జయసేనుడు, భూమిజుడు ఇద్దరూ అక్కడికి వచ్చారు. వారూ ఉడుతలకు ఆహారం పెట్టారు. అప్పుడు జయసేనుడు ‘‘భగవాన్‌! సమ్యక్‌ దృష్టి, మిధ్యా దృష్టి గురించి చెప్పండి’’ అన్నాడు.

‘‘భిక్షువులారా! నూనె కావలసిన వాడు నూనె కోసం వెతుకుతున్నాడు. వాడు నూనె తొట్టిలో ఇసుక పోసినాడు. ఎంతసేపటికీ నూనె రాదు. అది మిధ్యా దృష్టి’’ ‘‘భగవాన్‌! ఔను. నూనె కావలసిన వాడు ఇసుక పోస్తే నూనె ఎలా వస్తుంది?’’ అన్నాడు భూమిజుడు. ‘‘అలాగే.. పాలు కావలసిన వాడు పాల కోసం వెతుకుతూ ఆవు కొమ్మును పితుకుతాడు. వాడూ పాలను పొందలేడు. అవే మిధ్యా కర్మలు’’

‘‘ఒకడు వెన్నను కావాలనుకుంటాడు. బానలో నీటిని పోసి కవ్వాన్ని వేసి తిప్పుతాడు. వాడికీ వెన్న లభించదు. ఇదే మిధ్యా ప్రయత్నం’’
‘‘భగవాన్‌! చాలా చక్కగా చెప్పారు’’ అన్నాడు జయసేనుడు. ‘‘అలాగే వేరొకడు... అగ్నిని కావాలని వెతుకుతూ ఉంటాడు. చేవగల పచ్చికట్టెను మధిస్తాడు. అప్పుడూ కూడా మంటను పొందలేడు. ఇదే మిధ్యా సంకల్పం’’ ‘‘కాని ఒకడు పాలు కావాలనుకుని చంటి దూడను పితుకుతాడు. ఆవు రొమ్మును పితకడు. ఇదే మిధ్యా వాక్కు’’ 

‘‘ఇంకొకడు... పెరుగును పోసి కవ్వంతో తిప్పుతాడు. వాడు వెన్నను పొందుతాడు. ఇదే సమ్యక్‌ దృష్టి... అలాగే మిగిలినవన్నీ... అన్నాడు బుద్ధుడు. 
‘‘భగవాన్‌! నూనెను కావలసినవాడు ఆవనూనెతో, పాలు కావలసినవాడు ఆవు పొదుగుతో, వెన్న కావలసిన వాడు బానలోని వెన్నతో... ఇలా పొందాలి.’’అన్నాడు భూమిజుడు.

‘‘అవును.’’ అన్నాడు బుద్ధుడు. ఈ నాలుగు ఉపమానాలు చెప్పాడు. ఇద్దరూ ప్రసన్నలయ్యారు. 
చెట్టు మీద ఉన్న ఒక ఉడుత కిందకు దిగలేదు. అటూ ఇటూ ఆలోచిస్తుంది. కొంచెం కిందకు కొంచెం పైకీ పోతుంది. వారిద్దరూ పిలిచారు. అది అలాగే చూస్తోంది. బుద్ధుడు చూశాడు. ఉడతను కిందికి రమ్మన్నాడు. అది కిందకు వచ్చింది.
‘‘ఇదిగో తిను... నీ మేత...’’ అంటూ మేత వేశాడు. అది నెమ్మదిగా వచ్చి బుద్ధుడి దగ్గర వాలింది. దాన్ని తీసుకుని దాని వీపుని నిమిరాడు. అది కొమ్మపైన వాలినట్టుగా ఆయన పాదాల మీద వాలిపోయింది. – డా. బొర్రా గోవర్ధన్‌

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)