Breaking News

బౌద్ధవాణి : మాకు పిచ్చుకలతో పోలికా..!?

Published on Mon, 02/12/2024 - 08:37

"వసంతకాలం వచ్చేసింది. చివురులు తొడిగిన చెట్లన్నీ పుష్పించాయి. పూత పిందెలుగా మారుతోంది. ప్రకృతి పూల పరిమళాలతో పరవశించి పోతోంది. ఆ మామిడితోటలో చల్లదనానికి తోడు చక్కని పరిమళాలు వీస్తున్నాయి. ఆ తోట ఒక అంచున పెద్ద కాలువ. నీరు బాగా ఇంకిపోయి ఉంది. పాయలు పాయలుగా సన్నని ధారలు ప్రవహిస్తున్నాయి. ఆ కాలువ గట్టు మీద పెద్ద మామిడిచెట్టు. సమయం మధ్యాహ్నం దాటింది. పొద్దు పడమటికి వాలింది. ఆ చెట్టు కింద భిక్షుగణంతో కూర్చొని ఉన్నాడు బుద్ధుడు. భిక్షువులకి తాము తీసుకోవలసిన ఆహార నియమాల గురించి బోధిస్తున్నాడు."

‘‘భగవాన్‌! నేను రోజుకు మూడు పూటలా తినేవాణ్ణి. చిన్నతనం నుండి అదే అలవాటు. బౌద్ధసంఘంలో చేరాక ఉదయం, సాయంత్రం కొన్నాళ్ళు తిన్నాను. మధ్యాహ్నం క్రమంగా మానేశాను. కొన్నాళ్ళు చాలా బాధ అనిపించింది. ఆకలికి తాళలేకపోయాను. కానీ.. కొన్నాళ్ళకు అదే అలవాటైంది. ఆ తరువాత మీరు.. ‘రాత్రి భోజనం మానండి’ అన్నారు. నెమ్మదిగా మానేశాను. ఇప్పుడు రోజుకి ఒక్కపూట భోజనం చేస్తున్నాను. ఆరోగ్యంగా ఉన్నాను. ఉత్సాహంగా ఉన్నాను. తేలికపడ్డాను. చదువు పట్ల శ్రద్ధ పెరిగింది.’’ అన్నాడు ఉదాయి అనే భిక్షువు.

అంతలో ఆ పక్కనే ఉన్న తుమ్మచెట్లు మీదనుండి పిచ్చుకల అరుపులు వినిపించాయి. కొందరు అటుకేసి చూశారు. అరుపులు నెమ్మదిగా సద్దుమణిగాయి. చిక్కని కొమ్మల్లో చిక్కుకుపోయిన పిచ్చుక నెమ్మదిగా బైటపడి, రెక్కలు దులుపుకుని లేచిపోయింది.

‘‘భగవాన్‌! రాత్రిపూట చీకటిలో భిక్ష కోసం తిరగాలంటే.. ఎన్నో ఇబ్బందులు వచ్చేవి. ఒకసారి నేను మురికి గుంటలో పడ్డాను. మన ధర్మపాలుడైతే ముళ్ళ పొదలో చిక్కుకున్నాడు’’ అన్నాడు ఒక భిక్షువు.
       ‘‘నేనైతే.. ఒకసారి దొంగలమూకతో కలసిపోయాను’’ అన్నాడు ఇంకో భిక్షువు.
‘‘భగవాన్‌! నా అనుభవం చెప్పడానికి మరీ ఇబ్బందికరం. ఆరోజు రాత్రి మబ్బు పట్టింది. నేను ఒకరి ఇంటికి వెళ్ళే సమయానికి పెద్ద మెరుపు మెరిసింది. ఇంటి పెరట్లో ఉన్న స్త్రీ నన్ను ఒక్కసారి చూసి భూతం అనుకొని భయపడింది. పెద్దగా అరిచింది. తెగ తిట్టి పోసింది. నేను ‘‘చెల్లీ! నేను భిక్షువుని’’ అని సర్ది చెప్పి బైటపడ్డాను’’ అన్నాడు మరో భిక్షువు.

కానీ కొందరు భిక్షువులు మాత్రం అసహనంగా కూర్చొని ఉన్నారు. వారికి ఒంటిపూట భోజనం అలవాటు కావడం లేదు. మూడుపూటలా తింటే గానీ.. ఆకలి శాంతించదు. కొందరు కనీసం రెండు పూటల’’ అన్నారు.

అంతలో.. తుమ్మచెట్టు మీద మరలా పిచ్చుకల అలజడి.. చిక్కని కొమ్మల మధ్య చిక్కుకుపోయిన ఎండు పీచుల మధ్య చిక్కుకుపోయింది ఒక పిచ్చుక. అది అటూ ఇటూ కొట్టుకుంటుంది. కొట్టుకున్న కొద్దీ ఇంకా ఇంకా చిక్కుకు పోతోంది. బుద్ధుడు నెమ్మదిగా..  ‘‘భిక్షువులారా! మీలో ఒకరు వెళ్లి ఆ బంధనాలు విడిపించండి’’ అన్నాడు. ఒక భిక్షువు లాఘవంగా చెట్టెక్కి పిచ్చుక బంధనాల్ని తొలగించాడు. అది భయంతో తుర్రున ఎగిరిపోయింది.

‘‘భిక్షువులారా! చూశారా! ఆ పిచ్చుక చిక్కుకున్న బంధాలు చిన్న చిన్న పీచులు. ఎండిపోయినవి. బలహీనమైనవి. కానీ, ఆ పిచ్చుక దాన్ని తెంచుకోలేక పోయింది.. కారణం?’’ అని అడిగాడు.
‘‘ఆ పిచ్చుక ఆ బంధనాల కంటే బలహీనమైంది’’ అన్నాడు ఉదాయి. 
       ‘‘మరి, చాలా బలమైన గొలుసులతో తాళ్ళతో బంధించిన ఏనుగు ఆ బలమైన బంధనాన్ని సైతం తెగ తెంచుకోగలదు. ఆహారం విషయంలో మీలో కొందరు ఆ పిచ్చుకలాంటి వారే. మరికొందరు ఏనుగు లాంటివారు. కోరికల్ని తెగ తెంచుకోగలిగారు’’ అన్నాడు. 
           ‘‘బుద్ధుడు, ఇంకా ఎందరో భిక్షువులు ఒంటిపూట భోజనంతో సంతోషంగా, ఆరోగ్యంగా, శక్తిమంతంగా ఉంటున్నారు. మేమెందుకు పిచ్చుకలంత బలహీనులం కావాలి?’’ అనుకున్నారు ఆకలికి ఆగలేనివారు.

వారూ నెమ్మదిగా దాన్ని సాధించుకున్నారు. మాకు పిచ్చుకలతో పోలికా? అన్నట్లు దృఢచిత్తులయ్యారు.

– డా. బొర్రా గోవర్ధన్‌

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)