Breaking News

ఇదేం పేరెంటింగ్‌..! వామ్మో ఈ రేంజ్‌లో డేరింగ్‌ పాఠాలా..?

Published on Tue, 09/30/2025 - 17:26

కొన్ని విషయాలు పిల్లలకు అనుభవపూర్వకంగా చెప్పాల్సిందే. సరైనదే అయినా..ప్రాణాలను పణంగా పెట్టేంత డేరింగ్‌ నిర్ణయాలు గురించి చెప్పకపోవడమే మేలు. సురక్షితమైన చర్యలు తీసుకుంటే పర్లేదు. జరగరానీ నష్టం జరిగితే ఇక అంతే పరిస్థితులు. ఇక్కడ అలాంటి భయానక పేరెంటింగ్‌ టీచింగ్‌కి సంబంధించిన ఘటనే చోటుచేసుకుంది. ఆ వీడియో చూస్తే..మరీ ఈ రేంజ్‌లో ధైర్యం విలువ గురించి నేర్పించాలా? అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు..

ఆ వీడియోలో ఓ ప్రముఖ ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌ గారెట్‌ గీ తన కొడుకుని పెద్ద పర్వతం మీద నుంచి నదిలోకి దూకేయమని ప్రోత్సహిస్తాడు. మొదట ఆ పిల్లవాడు భయంతో వెనకడుగు వేస్తాడు. ఆ తర్వాత తండ్రి మాటలకు కాస్త ప్రేరేపించబడినా..దూకే సాహసం చేయలేకపోయాడు. దాంతో చివరికి తండ్రే అతడిని ఎత్తుకుని విసిరేస్తాడు. పాపం ఆ పిల్లవాడు భయంతో నాన్న అని అరవడం స్పష్టంగా వీడియోలో కనిపిస్తుండటం చూడొచ్చు. 

ఆ తర్వాత తండ్రి వెంటనే దూకేసి అతడిని పట్టుకుని ఒడ్డుకి వచ్చేస్తాడు. అందుకు సంబంధించిన వీడియోని చూసిన నెటిజన్లు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం ఎలాగో నేర్పడం మరీ ఈ రేంజ్‌లోనా అంటూ ఫైర్‌ అయ్యారు. పిల్లలందరూ ఒకేలా ఉండరని, కొందరూ చాలా పిరికిగా ఉంటారంటూ హితవు పలికారు. 

నెమ్మదిగా ధైర్యాన్ని నూరిపోస్తూ..స్వతహాగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహించాలే తప్ప ప్రాణాలకే ముప్పు వాట్లిలే ఇలాంటి ప్రమాదకరమైన సాహసాలు తగదు అని సదరు ఇన్‌ఫ్లుయెన్సర్‌ గీకి హితవు పలికారు. అందుకు సంబంధించిన భయానక వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. అంతేగా పిల్లలకు భయం పోగొట్టాలంటే మరి ఇంతలా నేర్పించాలా అని తిట్టిపోస్తున్నారు నెటిజన్లు. అయితే గీ మాత్రం తల్లిదండ్రులుగా తమ ఉద్దేశ్యాలు వేరని, తాము ప్రేమగా జాగ్రత్తగా పిల్లలను చూసుకోగలమని తనదైన శైలిలో కౌంటరిచ్చాడు ఇన్‌ఫ్లుయెన్సర్‌ గీ. 

 

(చదవండి: రుచికరమైన వంట కోసం '3-3-2-2 రూల్‌.'.!)

 

 

#

Tags : 1

Videos

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)