Breaking News

సీతారామలక్ష్మణ వేషధారణలో ఇండిగో సిబ్బంది: పులకించిన ప్రయాణీకులు

Published on Sat, 01/13/2024 - 12:34

అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామమందిరం ప్రాణప్రతిష్ట ఈ నెల (జనవరి) 22నజరగనుంది.ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈ వేడుక ప్రముఖంగా మారనుంది.  శ్రీరామ్ లల్లా దర్శనం చేసుకోసం భక్తులు వేయికళ్లతో  వేచి చూస్తున్నారు. ఈక్రమంలో ప్రముఖ విమానయాన సంస్థలు దేశంలోని వివిధ నగరాల నుంచి అయోధ్యకు విమాన సర్వీసులను కూడా నడపనున్నాయి. అయితే ఇండిగో విమాన సంస్థ  వార్తల్లో నిలిచింది. 

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన అధికారిక నివాసంలో జరిగిన వర్చువల్ ఈవెంట్ ద్వారా విమాన సర్వీసును  జనవరి 11, గురువారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. గుజరాత్ లోని అహ్మదాబాద్ నుంచి అయోధ్యకు తొలి  విమాన సర్వీసును ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ప్రారంభించింది. తన ప్రారంభ విమానంలో దాని క్యాబిన్ సిబ్బంది శ్రీ రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు, సీత వేషధారణలో  ఆకట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెటిజనులను ఆకట్టుకుంటోంది. 

విమాన సిబ్బంది ఒకరు రాముడిలా కిరీటంతో పాటు బంగారు రంగులో సాంప్రదాయ దుస్తులు, ఆభరణాలతో  అలకరించుకుని మరీ బోర్డింగ్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. ఇక క్యాబిన్ సిబ్బంది రాముడు, లక్ష్మణుడు, సీత , హనుమంతుని వేషధారణలో ఆహ్వానం పలకడంతో ప్రయాణీకులంతా పులకించిపోయారు. ‘జై శ్రీరాం’ అని నినాదాలు చేశారు.


ఈ డైరెక్ట్ ఫ్లైట్‌తో అయోధ్య నేరుగా అహ్మదాబాద్‌కి కనెక్ట్ అయిందని, ఢిల్లీ తర్వాత అయోధ్యకు విమాన సర్వీసుల అనుసంధానమైన రెండో స్థానంలో అహ్మదాబాద్ ఉందని, జనవరి 15 నుంచి ఇతన విమాన సర్వీసులు కూడా ఉంటాయని సీఎం యోగి తెలిపారు.  జనవరి 16న అయోధ్య-ముంబై, ఢిల్లీ-అయోధ్య మధ్య మరో విమాన సర్వీసు ప్రారంభం కానుందని, మెరుగైన విమాన సేవలు పర్యాటకం, వ్యాపార కార్యకలాపాలకు గణనీయంగా దోహదపడతాయని  యోగి పేర్కొన్నారు.  

మరోవైపు స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్, జనవరి 12, శుక్రవారం, జనవరి 21 న ఢిల్లీ నుండి అయోధ్యకు ప్రత్యేక విమాన సర్వీసులను ప్రకటించింది. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానం మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 3 గంటలకు అయోధ్య చేరుకుంటుంది. మరుసటి రోజు తిరుగు ప్రయాణంలో సాయంత్రం 5 గంటలకు బయలుదేరి, సాయంత్రం 6.30 గంటలకు ఢిల్లీలో ల్యాండ్ అవుతుంది. మరుసటి రోజు రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యే ప్రయాణీకులకు భోజనం అందించనుంది.
 

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)