Indias 10 richest temples: రూ. 3 లక్షల కోట్లతో టాప్‌లో ఏది?

Published on Mon, 06/30/2025 - 16:47

ఎంతో పవిత్రమైన,  సాంస్కృతిక వారసత్వాన్ని చాటు  దేవాలయాలకు నిలయం భారతదేశం. కోట్లాదిమంది భక్తులు సర్వశక్తిమంతుడైన ఆ భగవంతుడు తమను సర్వ పాపాలనుంచి, ఆపదలనుంచి కాపాడతాడని విశ్వసిస్తారు. అనేకమంది భక్తులు తమ ఆరాధ్య దైవం పేరుతో లక్షలాది కానుకలను విరాళాలుగా ఇస్తుంటారు. అలా అత్యంత ఘనమైన సంపదతో అలరారే  దేశంలోని టాప్ పది  దేవాలయాలను పరిశీలిద్దాం.

ప్రపంచం నలుమూలల నుండి ప్రతీ ఏడాది లక్షలాది భక్తులు, పర్యాటకులను అద్భుతమైన దేవాలయాలను సందర్శిస్తారు.   మొక్కులు చెల్లించుకుంటారు. ఇందులో నగదు విరాళాలు, బంగారం, వెండి లాంటి  విలువైన  ఆస్తులు ఇందులో ఉంటాయి.  వీటిని అనేక  సామాజిక కార్యక్రమాలను, సేవా కార్యక్రమాలను వినియోగిస్తాయి సంబంధిత ఆలయట్రస్టులు.  ఈ దేవాలయాల సంపద అమూలమ్యైన భక్తుల విశ్వాసాన్ని ప్రతిబింబించడమే కాకుండా, భారతదేశ సాంస్కృతిక, సామాజిక , ఆర్థిక నిర్మాణంలో వాటి పాత్రకు నిదర్శనం కూడా.

భారతదేశంలోని 10 అత్యంత ధనిక దేవాలయాలు
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఆలయం
సుందరమైన తిరుమల కొండలలో ఉన్న ఈ ఆలయం ప్రపంచంలోని అత్యంత ధనిక మతపరమైన ప్రదేశాలలో ఒకటి. దీని విలువ రూ. 3 లక్షల కోట్లు అని అంచనా. ప్రతిరోజూ దాదాపు 50వేల మంది భక్తులు సందర్శిస్తారు . ఈ ఆలయం విరాళాలు, బంగారం , ఇతర కానుకల ద్వారా ప్రతి సంవత్సరం దాదాపు రూ. 1,400 కోట్లు  ఆర్జిస్తుంది.

కేరళలోని తిరువనంతపురంలోని పద్మనాభస్వామి ఆలయం
ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయంగా ప్రసిద్ధి చెందిన పద్మనాభస్వామి ఆలయంలో రూ.1.2 లక్షల కోట్ల విలువైన సంపద దీని సొంతం.బంగారు ఆభరణాలు, వజ్రాలు, పురాతన వెండి , పచ్చలు ఉన్నాయి. 2015లో, గొప్ప ఖజానాను గుర్తించడం  ఇప్పటికే ఉన్న భారీ నిధికి మరింత తోడైంది.

గురువాయూర్ దేవస్వం, కేరళలోని గురువాయూర్
విష్ణువు కొలువై ఉండే ఈ పురాతన ఆలయం సంపదకూడా చాలా ఎక్కువ.. దీనికి రూ.1,737.04 కోట్ల విలువైన బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయి. అలాగే  271.05 ఎకరాల భూమిని కలిగి ఉందని తెలుస్తోంది. ఈ ఆలయంలో బంగారం, వెండి ,విలువైన  స్టోన్స్‌కు సంబంధించి పెద్ద నిధి కూడా ఉంది.  

జమ్మూలోని వైష్ణో దేవి ఆలయం
సముద్ర మట్టానికి 5,200 అడుగుల ఎత్తులో ఉన్న పవిత్ర  దుర్గాదేవి ఆలయం భారతదేశంలోని అత్యంత సంపన్నమైన వాటిలో ఒకటి. 2000-2020 వరకు, దీనికి 1,800 కిలోల బంగారం, 4,700 కిలోల వెండి. రూ. 2,000 కోట్లకు పైగా నగదు విరాళాలుగా వచ్చాయి.

మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా ఆలయం
దేశంలో అత్యధికంగా సందర్శించే ఆలయాలలో ఒకటి షిర్డీ సాయినాథునికి ఆలయం. రోజుకు దాదాపు 25,000 మంది భక్తులను ఆకర్షిస్తుంది. ముంబై నుండి దాదాపు 296 కి.మీ దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని 1922లో నెలకొల్పారు. 2022లో రూ. 400 కోట్లకు పైగా విరాళాలు అందుకుంది. ఇది రెండు ఆసుపత్రులను కూడా నిర్వహిస్తుంది. ప్రతిరోజూ వేలాది మంది యాత్రికులకు ఉచిత భోజనాన్ని అందిస్తుంది.

అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం ( గోల్డెన్ టెంపుల్‌)
బంగారం తాపడం చేసిన అద్భుతమైన దేవాలయం స్వర్ణ దేవాలయం. గొప్ప వాస్తుశిల్పానికి ప్రసిద్ధి చెందిన సిక్కు మతం ఆధ్యాత్మిక హృదయంగా భావిస్తారు. 1581లో నిర్మించబడిన ఇది ప్రతి సంవత్సరం దాదాపు రూ. 500 కోట్లు సంపాదిస్తున్నట్లు  సమాచారం.

మధుర మీనాక్షి ఆలయం
తమిళనాడులో మధురైలో ఉన్న ఈ ఆలయం దాని అద్భుతమైన డిజైన్ , పండుగ వాతావరణానికి ప్రశంసలు అందుకుంది. ఇక్కడకొలువుదీరిన మీనాక్షి అమ్మవారిని దర్శించుకునేందుకు  ఇది రోజుకు 20వేల మందికి పైగా భక్తులువస్తారు.  ప్రతి సంవత్సరం రూ. 60 మిలియన్లు సంపాదిస్తుందని అంచనా.

సిద్ధివినాయక ఆలయం, ముంబై
ముంబైలోని ప్రభాదేవి ప్రాంతంలో ఉన్న ఈ ప్రసిద్ధ గణేష్ ఆలయం భారతదేశంలోని అత్యంత ధనవంతులలో ఒకటి, దీని విలువ రూ. 125 కోట్ల అంచనా. దీనికి ప్రతిరోజూ రూ. 30 లక్షల విలువైన కానుకలు అందుతాయి.ఇక్కడ విగ్రహం 4 కిలోల బంగారంతో అలంకరించి ఉంటుంది.

గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయం
భారతదేశంలోని అత్యంత గౌరవనీయమైన శివాలయాలలో ఒకటైన సోమనాథ్ 12 జ్యోతిర్లింగాలలో ఇది మొదటిదిగా భావిస్తారు. ఈ ఆలయం గర్భగుడిలో 130 కిలోల బంగారం, దాని శిఖరంపై అదనంగా 150 కిలోలు ఉన్నాయట.

ఒడిశాలోని పూరిలోని శ్రీ జగన్నాథ ఆలయం
ఒడిశా ఆధ్యాత్మిక వారసత్వానికి మూలస్తంభమైన  11వ శతాబ్దపు ఆలయం జగన్నాథ ఆలయం. చార్ ధామ్ యాత్రలో కీలకమైంది కూడా. . దీని విలువ దాదాపు రూ. 150 కోట్లు . దీంతోపాటు దాదాపు 30వేల ఎకరాల భూమి ఉంది. దీంతోపాటు ఇటీవల నిర్మితమైన, బాగా ప్రాచుర్యం పొందిన, అత్యంత ఖరీదైన ప్రాజెక్టులలో ఒకటి అయోధ్యలోని రామమందిరం.

Videos

ఎల్లుండే మెగా సునామీ?

భారత్ కి అపాచీ యుద్ద హెలికాప్టర్లు వచ్చేస్తున్నాయ్ !

కళ్లకు గంతలు కట్టి.. కత్తితో పొడిచి తండ్రిని హతమార్చిన కుమారుడు

సింగయ్య మృతిపై బయటికొస్తున్న నిజాలు టెన్షన్ లో బాబు, లోకేష్

కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుడు వాదనను ఎండగట్టిన హైకోర్టు

Pashamylaram Blast: శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ బయటపడుతున్న మృతదేహాలు

ఏపీలో ఉద్యోగం చేయాలంటేనే బెదిరిపోతోన్న ఐఏఎస్, ఐపీఎస్ లు

రాయచోటిలో ఉగ్రవాదులు అరెస్ట్

వంశీని జైల్లో పెట్టి.. మీ గొయ్యి మీరే తవ్వుకున్నారు

మెడికల్ విద్యార్థులపై పోలీసులతో దాడి చేయిస్తారా: YS జగన్

Photos

+5

నిహారిక కొణిదెల కొత్త సినిమా..సంగీత్ శోభన్, నయన్ సారిక జంట కొత్త చిత్రం (ఫొటోలు)

+5

కన్నుల పండుగగా బల్కంపేట ఎల్లమ్మతల్లి రథోత్సవం (ఫొటోలు)

+5

చిరు జల్లుల్లో చూడాల్సిన బ్యూటిఫుల్‌ బీచ్‌లు ఇవే...

+5

తెలంగాణ : నీటి గుహలోని అత్యంత అద్భుత‌మైన ఈ శివుడ్నిఎప్పుడైనా దర్శించుకున్నారా? (ఫొటోలు)

+5

తమ్ముడుతో టాలీవుడ్‌లో ఎంట్రీ.. అప్పుడే లైన్‌లో పెట్టేసిందిగా! (ఫోటోలు)

+5

ఏపీ : అమ్మో ఒకటో తారీఖు.. పరుగులు పెట్టాల్సిందే (ఫొటోలు)

+5

‘సోలో బాయ్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

హైదరాబాద్ : అందాల శ్రీలంక..అద్భుత ఎంపిక (ఫొటోలు)

+5

బల్కంపేట : వైభవోపేతంగా ఎల్లమ్మ పోచమ్మ కల్యాణోత్సవం..ఉప్పొంగిన భక్తిభావం (ఫొటోలు)

+5

ఈ ఏడాది చాలా స్పెషల్.. పెళ్లి రోజు సెలబ్రేట్‌ చేసుకున్న మహాతల్లి జాహ్నవి..!