ఆ దేశంలో తల్లులకు ఆర్థిక భరోసా వేరే లెవెల్‌..!

Published on Thu, 09/11/2025 - 16:06

వర్కింగ్‌ విమెన్‌ ప్రెగ్నెంట్‌ అయితే..కొన్ని కార్పొరేట్‌ కంపెనీలు నిర్థాక్షిణ్యంగా తొలిగించిన ఉదంతాలను చూశాం. కానీ ఈ దేశంలో ఓ విదేశీ మహిళ ప్రెగ్నెంట్‌ అయితే అక్కడి ప్రభుత్వం అండగా నిలబడి ఆర్థిక సాయం అందించింది. ఆ ప్రసూతి సాయం డెలివరీ అయినా తర్వాత కూడా నిరంతరాయంగా కొనసాగడం విశేషం. ఇంతకీ అదంతా ఎక్కడంటే..

దక్షిణ కొరియాలో నేహా అరోరా అనే భారత సంతతి తల్లికి తన గర్భధారణ సమయంలో అక్కడి ప్రభుత్వం అందించిన ఆర్థిక మద్దతు గురించి  నెట్టింట షేర్‌ చేసుకున్నారు. దక్షిణ కొరియా ప్రభుత్వం కాబోయే తల్లులకు అందించే ఆర్థిక సహాయన్ని గురించి సవివరంగా విని నెటిజన్లు సైతం విస్తుపోయారు. 

ఆ ఆర్థిక సాయం ఎలా ఉంటుందంటే..
నెహా తాను ప్రెగ్నెంట్‌ అని నిర్థారణ అయ్యిన వెంటనే వైద్య పరీక్షలు, మందులు తదితరాలన్నింటికి అక్కడి కొరియా ప్రభుత్వం రూ. 63,100 ఇచ్చిందని, దాంతోపాటు బస్సు/టాక్సీ లేదా ప్రైవేట్‌ వాహనం వంటి ట్రావెల్‌ ఖర్చుల కోసం అదనం రూ. 44,030లు అందించినట్లు వెల్లడించింది. ఇలాంటి సహాయం డెలివరీ సమయంలో సైతం అందించిందని, ప్రసవ సమయంలో ఒకేసారి సుమారు రూ. 1.26 లక్షలు దాక ఆర్థిక సహాయం అందించిందని చెప్పుకొచ్చింది. 

దీనిని అధికారికంగా “కంగ్రాగ్యులేటరీ మనీ ఆన్ డెలివరీ(అభినందన ప్రసూతి సహాయం)” అని పిలుస్తారని కూడా తెలిపింది. ఈ ఆర్థిక మద్దతు తన బిడ్డ పుట్టాక కూడా కొనసాగిందని, నెలవారీగా ఆర్థిక సహాయ అందించినట్లు వెల్లడించింది. అంటే..నవజాత శిశువు తొలి ఏడాది ప్రతి నెల రూ. 63,100, రెండో ఏడాది నెలకు రూ. 31,000 చోప్పున..అలా తన బిడ్డకు ఎనిమిదేళ్లు వచ్చే వరకు రూ. 12,600లు చొప్పున ఆర్థిక సహాయం అందించిందని ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో వెల్లడించడమే గాక అందుకు సంబంధించిన వీడియోని కూడా షేర్‌ చేసింది. 

ఈ పోస్ట్‌ని చూసిన నెటిజన్లు దక్షిణ కొరియా ప్రభుత్వం ప్రసూతి ప్రయోజనాలను ప్రశంసించడమే గాక భారతదేశంలో అందించే ప్రసూతి ప్రయోజనాలతో పోల్చారు. అలాగే దక్షిణ కొరియా కుటుంబాలు, పిల్లల సంరక్షణను పట్ల ఎంతలా కేర్‌ తీసుకుంటుందో అవగతమవుతోందంటూ పోస్టులు పెట్టారు. 

 

(చదవండి: 'నాన్‌ డైరియల్‌ డీహైడ్రేషన్‌'..! సాధారణ నీటితో భర్తీ చేయలేం..)
 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)