Breaking News

రాజుగారు వచ్చారహో!

Published on Thu, 02/19/2026 - 06:05

సౌరభ్‌జైన్‌ అనే  భారతీయుడి  కుటుంబంతో  దుబాయ్‌ పాలకుడు సరదాగా గడిపిన వీడియో  సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది... దుబాయ్‌లోని సాయిహ్‌ అల్‌ సలాం ఎడారి. చుట్టూ ఇసుక తిన్నెలు, ప్రశాంతమైన అల్‌ ఖుద్రా సరస్సు. వారాంతాల్లో సరదాగా గడపడానికి ప్రజలు ఇక్కడికి  వస్తుంటారు. ఈసారి అక్కడికి దుబాయ్‌ పాలకుడు షేక్‌ మహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌ ఎటువంటి హడావిడి, భద్రతా సిబ్బంది లేకుండా స్వయంగా కారు నడుపుకుంటూ వచ్చారు. 

సరస్సు దగ్గర ఆడుకుంటున్న పిల్లలను చూసి, కారు ఆపి ఆత్మీయంగా పలకరించారు. ఆశ్చర్యంతో చూస్తున్న వారి కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్లి చిరునవ్వుతో పలకరించారు. పిల్లలతో కలిసి ఫొటో దిగారు. ఈ అద్భుతమైన క్షణాలను సౌరభ్‌జైన్‌ తన ఫోన్‌లో బంధించాడు. 

‘ఖుద్రా లేక్‌ దగ్గర  గడిపిన ఒక సాధారణ వారాంతం అద్భుతం. దుబాయ్‌ పాలకుడు షేక్‌ మహమ్మద్‌ని కలవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది, పిల్లలపై ఆయన చూపిన ప్రేమ, ఆత్మీయత మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి’ అంటూ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. చాలా తక్కువ టైమ్‌లోనే ఈ వీడియో వైరల్‌గా మారింది. నెటిజనులు దీనిని ‘డ్రీమ్‌ ఆఫ్‌ మిలియ¯Œ ్స’ అంటున్నారు.
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)