Breaking News

India-UK deal రెండింటికీ లాభమే!

Published on Thu, 05/29/2025 - 10:11

ఇటీవలి కాలంలో వస్తువుల తయారీలో చైనా, కంప్యూటర్‌ రంగ సేవలలో భారత్‌ ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. అమెరికా, పశ్చిమ యూరప్‌ దేశాలు పరిశోధన, కొత్త వస్తువులు కనుగొనడంలో ముందంజలో ఉన్నాయి. అమెరికా అనేక దేశాల నుండి వస్తు–సేవలను విరివిగా దిగుమతి చేసుకుంటోంది. ముఖ్యంగా గత శతాబ్దం ఆఖరి రెండు దశాబ్దాలలో ప్రపంచ వాణిజ్యం విరివిగా పెరిగింది. ఈ సమ యంలో అమెరికా దిగుమతులు పెరగడం వల్ల ఆ దేశ పారిశ్రామిక రంగ అభివృద్ధి కొంతవరకు తగ్గుముఖం పట్టింది. తిరిగి విరివిగా తమ దేశంలోనే వస్తువులను ఉత్పత్తి చేసి ఎగుమతులు పెంచి గత వైభావాన్ని తిరిగి సాధించడానికి చేసే ప్రయత్నంలో భాగంగా దిగుమతి సుంకాలను పెంచడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నడుం బిగించారు. అలాగే పశ్చిమ ఐరోపా దేశాలు కూడా ఈ దిశలోనే అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ప్రయత్నాలలో భాగమే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు.

ఈ మే నెల ఆరవ తేదీన భారత్‌–బ్రిటన్‌ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (India-UK free trade agreement) చేసుకున్నాయి. ఈ ఒప్పందం ద్వారా ఇరు దేశాలూ లాభంపొందాలని చూస్తున్నాయి. ఒప్పందం ఫలితంగా ఇరు దేశాలలో వస్తుసేవల ఉత్పత్తిపై పడే వ్యతిరేక ప్రభావాన్ని తగ్గించడానికి క్రమ క్రమంగా ఉభయ దేశాలూ సుమారు పదేళ్ల కాలంలో దిగుమతి సుంకాలను చాలా వరకు తగ్గించి నామ మాత్రపు సుంకాలనే విధిస్తాయి. దీనివల్ల భారత్‌ జౌళి ఉత్పత్తులను ఇతోధికంగా బ్రిటన్‌కు ఎగుమతి చేయవచ్చు. మన పౌరులు బ్రిటన్‌లో ప్రస్తుతం కంటే సులభంగా ఉద్యోగాలు పొందవచ్చు. ఇందుకు ప్రతిఫలంగా విస్కీ లాంటి మత్తు పానీయాలపై భారత్‌ వెంటనే దిగుమతి సుంకాలు తగ్గిస్తుంది. అలాగే కొన్ని రకాల పారిశ్రామిక ఉత్పత్తులు, మాంసం ఉత్పత్తులపై కూడా భారత్‌ తక్కువ దిగుమతి సుంకాలు విధిస్తుంది. ఇందువలన భారత్‌లో అ వస్తువుల ఉత్పత్తిదారులు కొంత ఇబ్బంది పడే మాట వాస్తవమే. మొత్తం మీద ఈ ఒప్పందం రెండు దేశాలకూ లాభసాటి అనేది నిపుణుల భావన.

అమెరికా, ఐరోపాలతో కూడా ఇటువంటి ఒప్పందాలు చేసుకుని ఎగుమతులు పెంచడానికి భారత్‌ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. పారిశ్రామిక ఉత్పత్తులతో పాటు వ్యవసాయ ఉత్పత్తులపై భారత్‌ దిగుమతి సుంకాలు తగ్గించాలని అమెరికా పట్టుబడుతోంది. అయితే వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులు మన రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకం. అందువలన భారత్‌ ఏ దేశంతో అయినా ఆచి తూచి వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాలి.

– శ్రీరామ్‌ చేకూరి, జె.ఎస్‌. సుధాకరుడు 
ఆర్థిక రంగ నిపుణులు 

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)