Breaking News

షుగర్‌ను కంట్రోల్‌ చేసే నల్ల జీలకర్ర.. ఇలా వాడితే నొప్పులన్నీ పరార్‌

Published on Fri, 11/17/2023 - 15:50

జీలకర్రను దాదాపు అన్ని వంటల్లో ఉపయోగిస్తారు. దీనివల్ల రుచి మాత్రమే కాదు, రోగనిరోధక శక్తి సైతం పెరుగుతుంది. అయితే జీలకర్రతో పోలిస్తే నల్ల జీలకర్రలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని కలోంజీ విత్తనాలు అని కూడా అంటారు. మరి నల్ల జీలకర్ర వల్ల కలిగే ఉపయోగాలు ఏంటన్నది ఇప్పుడు చూద్దాం.

నల్ల జీలకర్ర జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. పొట్టలో రసాయనాలు విడుదలయ్యేందుకు సహాయపడుతూ, మలబద్దకాన్ని నివారిస్తుంది. కొలెస్ట్రాల్‌ పెరగనివ్వకుండా నివారిస్తూ, లావు, ఉబ్బసం వంటి సమస్యలను అదుపు చేస్తుంది.

► నల్ల జీలకర్రతో తయారు చేసిన నూనెని నుదిటి పైన రుద్దుకోవడం వళ్ళ తలనొప్పి దూరం అవ్వడమే కాకుండా, ప్రశాంతంగా నిద్ర పడుతుంది.
► నల్ల జీలకర్ర నూనె పంటికి  సంబంధించిన సమస్యలను, చిగుళ్ళకి సంబంధించిన సమస్యలను, బలహీనమైన పంటి నొప్పిని తగ్గిస్తుంది,కేవలం కొన్ని నూనె చుక్కలను జల్లడంతో నొప్పి తగ్గుతుంది.  నల్ల జిలకరలో థైమోక్విన్ అనే కెమికల్ ఉంటుంది అది మీ చిగుళ్లను ఆరోగ్యగా ఉంచుతుంది. 
► వయసు పైబడిన వారిలో మతిమరుపు సమస్య కనిపిస్తుంటుంది. అలాంటి వాళ్లు ఖాళీ కడుపుతో నల్ల జీలకర్రను తీసుకుంటే మెమరీ పవర్‌ పెరుగుతుంది. 
► నల్ల జీలకర్ర నూనెలో ఉండే ప్రోటీన్స్‌,ఫాటీ ఆసిడ్స్ బ్లడ్ సర్క్యూలేషన్‌కు ఎంతో ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనె, నల్ల జీలకర్ర నూనెను కలిపి తలకు రాసుకుంటే జుట్టు పెరిగి ధ్రుడంగా తయారవుతుందని, అంతేగాక చుండ్రును కూడా తగ్గిస్తుందని తేలింది.
► మెటబాలింజను మెరుగుపర్చడంలో నల్లజీలకర్ర తోడ్పడుతుంది. ఇది కిడ్నీ ఆరోగ్యాన్ని సైతం మెరుగుపరుస్తుంది.

► ఆడవాళ్లకు నెలసరి ఇబ్బందులను దూరం చేస్తుంది. పీరియడ్స్‌ టైంలో వచ్చే కడుపునొప్పిని తగ్గిస్తుంది.
► కళ్లు ఎర్రగా మారడం, నీరు ఎక్కువగా రావడం వంటి కంటి సమస్యలను నివారించి కంటిచూపును మెరుగుపరుస్తుంది
► షుగర్‌ లెవల్స్‌ని కంట్రోల్‌ చేస్తూ టైప్‌-2 డయాబెటిస్‌ని అదుపు చేస్తుంది. నల్ల జీలకర్ర నూనెని బ్లాక్‌ టీతో కలిపి కాళీ కడుపుతో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
► శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించడంతో పాటు గుండెకి సంబంధించిన సమస్యలను ఇది తగ్గిస్తుంది.
► పెరుగుతున్న కాలుష్యం కారణంగా ఆస్థమా ఒక సాధారణ జబ్బు గా మారింది.నల్ల జీలకర్ర నూనె, తేనె, గోరు వెచ్చని నీటిలో కలిపి రోజు తీసుకుంటే  ఆస్థమా ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 
► నల్ల జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్స్‌ మెండుగా ఉంటాయి. ఇవి బ్రెస్ట్‌ కాన్సర్‌, సెర్వికల్‌ కాన్సర్‌, లంగ్ కాన్సర్, పాంక్రియాటిక్ కాన్సర్ లను నివారిస్తాయి.
► నిమ్మరసం,నల్ల జీలకర్ర నూనెను కలిపి రోజుకు రెండు సార్లు మొహానికి అప్లై చేస్తే మొటిమలు తగ్గుతాయి.
► నల్ల జీలకర్ర, తేనెను గోరు వెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సీజన్‌లో వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యలు కూడా దూరమవుతాయి.

నల్ల జీలకర్ర ఎలా తీసుకోవాలి?
పొడి అయితే రోజు మధ్యాహ్నం అలాగే రాత్రి తిన్న తరువాత అర టీ స్పూన్ తీసుకోవాలి. టాబ్లెట్ అయితే రోజుకు 2 టాబ్లెట్స్ మధ్యాహ్నం అలాగే రాత్రి తిన్న తరువాత తీసుకోవాలి. నూనె రూపంలొ తీసుకుంటే రోజుకి అర టీ స్పూన్ మధ్యాహ్నం అలాగే రాత్రి తిన్న తరువాత తీసుకోవాలి.

-నవీన్‌ నడిమింటి,
ప్రముఖ ఆయుర్వేద వైద్యులు

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు