Breaking News

ఐఏఎస్‌ అధికారిణికి బంగారు పల్లకితో వీడ్కోలు..!

Published on Wed, 10/08/2025 - 12:42

దేశంలోనే అత్యుత్తుమ గౌరవప్రదమైన సర్వీసులు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ . ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ తమ సేవలను అందిస్తుంటారు. అలా తమ సేవలతో ప్రజల గుండెల్లో స్థానం దక్కించుకుని, మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న అధికారులు ఎందరో ఉన్నారు. అలానే ఒక కలెక్టర్‌ తన కింద సిబ్బంది, ప్రజల మన్ననలను అందుకుని అద్భుతమైన గౌరవాన్ని అందుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. 

ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ‍లోని సియోని జిల్లా కలెక్టర్‌ సంస్కృతి జైన్‌ బదిలీపై వెళ్తూ..తన సహచర సిబ్బంది, ప్రజల నుంచి రాజవంశీకులు రేంజ్‌లో గొప్ప సత్కారం పొందారామె. మాజీ కలెక్టర్ సంస్కృతి జైన్‌, ఆమె ఇద్దరు కుమార్తెలను బంగారు పల్లకీలో కూర్చోబెట్టి మరీ వీడ్కోలు పలికారు. సిబ్బంది స్వయంగా తమ భుజాలపై మోస్తూ ఆమె వాహనం వద్దకు తీసుకువెళ్లి ఘనంగా వీడ్కోలు పలికారు. 

ఇక ఇటీవలే, మధ్య ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం సియోని కలెక్టర్ సంస్కృతి జైన్‌ని భోపాల్‌కి బదిలీ చేసింది. ఈ నేపథ్యంలోనే నూతన కలెక్టర్ శీతల పాట్లేకు స్వాగతం పలికి, సంస్కృతి జైన్‌కు వీడ్కోలు పలికే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా, కలెక్టర్ జైన్ అవసరమైనప్పుడల్లా ముందుకు వచ్చి డిపార్ట్మెంటల్ సిబ్బందికి నాయకత్వం వహించి వారి తప్పులను ఎత్తి చూపేవారట. 

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిని మెరుగుపరచడానికి కలెక్టర్ జైన్ ప్రారంభించిన “గిఫ్ట్ ఎ డెస్క్” ప్రచారం కూడా అత్యంత ప్రజాదరణ పొందింది. అంతేగాక సమాజంలోని అన్ని వర్గాలచే ప్రశంసలు అందుకున్నారామె. సుమారు 15 నెలల కాలంలో ప్రజలకు చేరువవ్వడమే కాకుండా తన సేవలకుగానూ విశిష్ట గుర్తింపు కుడా దక్కించుకున్నారామె.

 

(చదవండి: డిజిటల్‌ డిటాక్స్‌లో ఉండగా ..వరించిన నోబెల్‌ బహుమతి! ట్విస్ట్‌ ఏంటంటే..)


 

 

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)