ఫ్యాషన్‌ రంగంలో పాపులర్‌గా : సెల‘ప్రెట్టీ’ లుక్‌

Published on Wed, 01/29/2025 - 16:47

ఢిల్లీలో ఇటీవల జరిగిన ఓ ఫ్యాషన్‌ షోలో సోనమ్‌ కపూర్‌ ర్యాంప్‌వాక్‌ చేశారు. వావ్‌.. డ్రెస్‌.. హూ ఈజ్‌ ద డిజైనర్‌? ఇలా ప్రశ్నలకు ఓహ్‌.. షీ ఈజ్‌ జయంతిరెడ్డి ఫ్రమ్‌ హైదరాబాద్‌.. ఇలాంటి సమాధానాలలో నగరం పేరు వినిపించడం ముంబయి, ఢిల్లీ, చెన్నై, గోవా, బెంగళూరు.. తదితర చోట్ల సర్వసాధారణంగా మారుతోంది. ఒకప్పుడు సెలిబ్రిటీలు తమ ఫ్యాషన్‌ డిజైనర్‌ అనగానే ముంబయి డిజైనర్‌ పేరు చెప్పేవారు. ఇప్పుడు నగరంలో టాప్‌ డిజైనర్లు సెలిబ్రిటీ డిజైనర్లుగా పేరొందారు.  – సాక్షి, సిటీబ్యూరో

నగర డిజైనర్ల విజయాలు ఔత్సాహిక డిజైనర్లకు స్ఫూర్తిని అందిస్తున్నాయి. ఫ్యాషన్‌ డిజైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ విద్యార్థులకు గెలుపు పాఠాలను వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నగరానికి చెందిన హామ్‌స్టెక్‌ ఫ్యాషన్‌ డిజైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫ్యాకల్టీలు నగరానికి చెందిన పలువురు టాప్‌ సెలిబ్రిటీ డిజైనర్ల గురించిన విశేషాలను అందిస్తున్నారు. 

‘సోమ్‌’.. ఫేమ్‌.. 
నగరానికి చెందిన డిజైనర్‌ శ్రియా సోమ్‌ ఆధునిక మహిళ డ్రీమ్‌ డ్రెస్సింగ్‌ను అందిస్తారు. సున్నితమైన హస్తకళ, క్లిష్టమైన అలంకారాలు, సొగసైన ఛాయాచిత్రాలకు ఆమె లేబుల్‌ శ్రియా సోమ్‌ ప్రసిద్ధి చెందింది. పీవీ సింధు, జాన్వీ కపూర్, లీసా హేడన్‌ తదితరులు ఆమె జాబితాలో ఉన్న కొందరు సెలిబ్రిటీలు.. అంతేకాక ఆమె సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ కూడా.  

అందానికి వన్నెలు.. అనుశ్రీ.. 
క్లిష్టమైన పనితనం, ఆకర్షణీయమైన సిల్హౌట్‌లు ఉన్న ఎథెరియల్‌ లెహంగాలకు అనుశ్రీ రెడ్డి లేబుల్‌ పర్యాయపదంగా మారింది. లెహంగా సిల్హౌట్‌లు వాటి డీప్‌ కట్‌వర్క్‌ నెక్‌లైన్‌లు, ఎంబ్రాయిడరీ కట్‌వర్క్‌ అంచులతో ఉన్న దుపట్టాలకు ఆమె హాఫ్‌ శారీస్‌ ప్రసిద్ధి చెందాయి. అందమైన గులాబీలు, పాస్టెల్‌ల నుంచి రాయల్‌ వైలెట్లు, బంగారు పసుపు వరకూ రంగుల మిశ్రమాన్ని ఆమె చాకచక్యంగా ఉపయోగిస్తారు. ఇటీవలి లాక్మే ఫ్యాషన్‌ వీక్‌లో ఆమె కలెక్షన్స్‌.. అందమైన ఆర్గాన్జా, పూల ఎంబ్రాయిడరీ కట్‌వర్క్, తక్కువ చతురస్రాకార నెక్‌లైన్‌లు అన్ని షేడ్స్‌ న్యూడ్‌లు  పింక్‌లతో మెరిపించాయి. ఆమె వర్క్‌ చేసిన సెలిబ్రిటీలలో అలియాభట్, కత్రినాకైఫ్, తాప్సీ పన్ను.. తదితరులు ఉన్నారు.  

ఆకా‘సమంత’.. అర్చన.. 
ఇటీవల నగరం నుంచి జాతీయస్థాయికి ఎదిగిన డిజైనర్లలో అర్చనరావు ముందు వరుసలో ఉన్నారు. 2012లో లాక్మే ఫ్యాషన్‌ వీక్‌లో తన లేబుల్‌ను ప్రారంభించారు. ఆ మరుసటి ఏడాదే  ‘వోగ్‌ ఇండియన్‌ ఫ్యాషన్‌ ఫండ్‌’ను గెలుచుకున్నారు. ఇటీవల విడుదలైన ప్రభాస్‌ కల్కి సినిమాకు ఆమె చేసిన వర్క్‌ ప్రశంసలకు  నోచుకుంది. 

బాలీవుడ్‌ బాద్‌‘షా’.. 
నగరం నుంచి బాలీవుడ్‌ తారలకు డిజైన్లు అందించిన ఘనతను గౌరంగ్‌ షా సొంతం చేసుకున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నేత కార్మికుల పనితనానికి పట్టం కడుతూ చేతితో నేసిన చీరలకు ప్రసిద్ధి చెందాడు. విద్యాబాలన్, సోనమ్‌ కపూర్, అదితీరావ్‌ హైదరీ సహా మరెందరో ఆయన డిజైన్లకు జై కొట్టారు. మహానటి సినిమా ద్వారా జాతీయ పురస్కారం అందుకున్నారు.   

మనదే ‘జయం’.. 
జయంతి రెడ్డి డిజైన్‌లు రాయల్‌ అద్భుత కథల వైబ్‌లను అందించడం ఖాయం. ఆమె డిజైన్‌Œలు సంప్రదాయ స్కర్ట్‌లు/లెహెంగాలతో జత చేసిన ఆధునిక క్రాప్‌–టాప్‌ సిల్హౌట్‌లు ఆసక్తికరమైన మిక్స్‌. గోల్డెన్, సిల్వర్‌జరీతో కూడిన ఆమె ఎంబ్రోయిడరీ వర్క్‌ ఎప్పుడూ టాక్‌ ఆఫ్‌ ద టౌన్‌.  

  • అర్చనరావు డిజైన్‌ చేసిన న్యూడ్‌ కలర్‌ లేత గోధుమరంగు చీరకు బేబీ పింక్‌ కట్‌ వర్క్‌ బోట్‌ నెక్‌ బ్లౌజ్‌ మెటాలిక్‌ సిల్వర్‌ బెల్ట్‌తో జత చేసి, నటి సమంతా మెరిశారు.  

  • ఫెమినా వెడ్డింగ్‌ టైమ్స్‌లో ప్రదర్శించబడిన టూ–టోన్డ్‌ కార్సెట్‌ రఫిల్‌ డ్రెస్‌లో జాన్వీ కపూర్‌ మెరిశారు.  

  •  స్టార్‌ ప్లేయర్‌ పీవీ సింధు, డిజైనర్‌ శ్రియా సోమ్‌ మొదటి సోలో షో కోసం ర్యాంప్‌ వాక్‌ చేసింది. 

  •  లాక్మే ఫ్యాషన్‌ వీక్‌లో షో స్టాపర్‌గా లీసా హేడన్‌  డిజైనర్‌ శ్రియా సోమ్‌ మెరిసే, పొడవాటి చేతుల చోళీ  అద్భుతమైన లెహంగా ధరించి.. అందరినీ ఆకట్టుకుంది.  

  • ఇటీవల సోనమ్‌ కపూర్‌ గౌరంగ్‌ షా డిజైన్‌ చేసిన పసుపు రంగు కుర్తా లెహంగా స్కర్ట్‌తో మ్యాచింగ్‌ దుపట్టా ధరించి ఒక ఈవెంట్‌కు హాజరయ్యారు. 

  • ఇటీవల జరిగిన ఉత్సవాల్లో, బాలీవుడ్‌ నటి మలైకా అరోరా ఖాన్‌ డిజైనర్‌ గౌరంగ్‌షా తీర్చిదిద్దిన ఆల్‌ ఇన్‌ ఆల్‌ అనార్కలీ సూట్‌ ధరించారు.  

  •  ఓ సినిమా సక్సెస్‌ ప్రెస్‌ మీట్‌ ఈవెంట్‌కి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ అర్చనారావు డిజైన్లు ధరించి హాజరై అందరి దృష్టినీ ఆకర్షించారు.   

ఇదీ చదవండి: మూడే మూడు చిట్కాలతో మిరాకిల్‌ : దెబ్బకు 8 కిలోలు తగ్గింది!


 

 

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)