Breaking News

స్లిమ్‌ సెట్‌.. డైట్‌ మస్ట్‌

Published on Fri, 12/13/2024 - 07:52

ఆధునిక జీవన శైలిలో నగరవాసుల ఆహారపు అలవాట్లు వేగంగా మారిపోతున్నాయి. యువత నుంచి మొదలైతే వయోవృద్ధుల వరకు స్లిమ్‌తో పాటు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. అధిక బరువు నుంచి ఉపశమనం పొందాలని, శరీరంలోని అనవసరమైన కొవ్వులు కరిగించాలని తినే ఆహారం తగ్గిస్తున్నారు. మరో వైపు వ్యాయామంపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. దీంతో నీరసించిపోవడం, ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.  

నిత్యం మనతోనే ఉండే వారు లావుగా ఉన్నావని ఎత్తిపొడుపు మాటలకు బాధపడి కొంతమంది.. అధిక బరువు ఉన్నారని పెళ్లికి నిరాకరించడం, కాలేజీ, ఉద్యోగ ప్రాంగణంలో ఆకర్షణీయంగా కనిపించాలని మరికొంత మంది.. ఇలా ఎవరి అవసరాలు వారికి ఉన్నాయి. అవే స్లిమ్‌ సెట్‌ ట్రెండ్‌ సెట్‌ చేస్తున్నాయి. నగరంలో సుమారు 60 శాతం మంది 30 నుంచి 50 ఏళ్ల వయసు ఉన్నవారే నాజూగ్గా కనిపించాలని ఆరాటపడుతున్నారంటే ఆశ్చర్యం లేదు. మరో 20 శాతం నుంచి 30 శాతం మంది 14 నుంచి 29 ఏళ్ల వయస్కులు ఉండగా, సుమారు 10 శాతం మంది 50 ఏళ్లు దాటిన వారు ఈ తరహా స్లిమ్‌ సెట్‌ కోసం ట్రై చేస్తున్నారు. ఆరోగ్యకరమైన లైఫ్‌ స్టైల్‌ కావాలనుకునేవారు పౌష్టికాహారం వైపు అడుగులు వేస్తున్నారు. ఇది మంచిదే.. అయితే.. ఎవరైనా సరే నిపుణుల సూచనలు 
ఆచరణాత్మకంగా పాటిస్తారో అక్కడే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. 

మితంగా తింటున్నారు.. 
నాజూగ్గా కనిపించాలని చాలా మంది యువత తిండి తగ్గించేస్తున్నారు. దీనికి తోడు ప్రొసెసింగ్‌ ఫుడ్‌ ఎక్కువ తీసుకుంటున్నారు. శరీరంలో ఉన్న ఫ్యాట్‌ తగ్గించడానికి డైట్‌ యాక్టివిటీ తప్పనిసరిగా ఉండాలి. కొంత మంది ప్రత్యేకంగా నడుము, పొట్ట, చేతులు వంటి ఒక పార్ట్‌నే లక్ష్యంగా స్లిమ్‌ చేయాలనుకుంటున్నారు. వారంలో 750 గ్రాముల నుంచి ఒక కేజీ వరకు బరువు తగ్గితే ఆరోగ్యకరంగా ఉంటుంది. మనం సాధారణ పనులు చేసుకోవడానికి నిత్యం శరీరానికి శక్తి అవసరం. దానికి అవసరమైన ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి. ఆహారం తగ్గిస్తే దాని ప్రభావం కండలు (మజిల్‌)పై కనిపిస్తుంది. నీరసం వస్తుంది. ఏ పని చేసుకోవాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. వివిధ సంస్థలు ఒక కేజీ బరువు తగ్గడానికి సుమారుగా రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు తీసుకుంటున్నాయి.  

ప్రొటీన్‌ పౌడర్‌ వాడేస్తున్నారు.. 
చాలా మంది ఈ మధ్య కాలంలో భోజనానికి ప్రత్యామ్నాయంగా ప్రొటీన్‌ పౌడర్‌ తీసుకుంటున్నారు. ప్రొటీన్‌ డబ్బా బయట మార్కెట్‌లో రూ.650 నుంచి రూ.1,500 వరకు అందుబాటులో ఉన్నాయి. ఆ వ్యక్తి లైఫ్‌ స్టైయిల్, బాడీ ప్యాటర్న్‌ బట్టి ప్రొటీన్‌ పౌడర్‌ తీసుకోవాలి. ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు. మూడు పూటలా మీల్‌ రీప్లేస్‌మెంట్‌ ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు పేర్కొంటున్నారు. ఉదయం మొలకెత్తిన గింజలు, రాగి జావ, తృణధాన్యాలు, ఫైబర్‌ ఫుడ్‌ వంటివి తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. అయితే ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు మాత్రం నిపుణుల సూచనల మేరకు తీసుకోవడం మంచిది. ఫ్లూయిడ్స్‌ తీసుకోవడం వల్ల శరీరంలోని వ్యర్థాలు పోతాయి.  

ఆ ఆలోచన చేయవద్దు 
డైట్‌ నిరంతర ప్రక్రియగా ఉండాలి. ఒక్కసారి స్లిమ్‌ అయిపోవాలి.. వేగంగా బరువు తగ్గిపోవాలనే ఆలోచన చేయవద్దు. అది ఒక్క రోజులో వచ్చే ఫ్యాట్‌ కాదు. మూడు నెలల పాటు హెల్దీ లైఫ్‌ స్టైల్‌కు అలవాటు పడాలి. వ్యక్తి శరీరానికి ప్రధానంగా ప్రొటీన్, కార్బొహైడ్రేట్స్, ఫ్యాట్, ఫ్రూట్స్, వెజిటబుల్స్‌ అవసరం. ఉదయం బాడీ డిటాక్సేషన్‌ కోసం నిమ్మరసం, జీరా నీరు, మెంతుల నీరు, దనియాలు, జీలకర్ర, కాంబినేషన్‌లో సూచిస్తాం. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ప్రత్యేక మెనూ ఉంటుంది.   
– బి.కవిత, పౌష్టికాహార నిపుణురాలు, హైదరాబాద్‌

సుమారు 30 కేజీలు బరువు తగ్గాను 
అధిక బరువుతో ఇబ్బందిగా ఉండేది. వెయిట్‌ లాస్‌ కోసం 2023 నుంచి న్యూట్రిషన్‌ సూచనలు ఫాలో అవుతున్నాను. ఇప్పటి వరకు సుమారు 30 కేజీలు తగ్గాను. అప్పటి ఇప్పటికి చూస్తే మనకి స్పష్టమైన తేడా కనిపిస్తోంది. బరువుతో బాధపడే సమయంలో నెమ్మదిగా ఉండేది. ఇప్పుడు పిల్లలతో చురుగ్గా పనులు చేసుకోగలుగుతున్నాను. లుక్‌ వైజ్‌గా చాలా తేడా వచి్చంది. ఫీల్‌ గుడ్‌.  
– వై.నిషిత, కూకట్‌పల్లి  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)