Breaking News

అనంత్‌-రాధిక పెళ్లి: అంబానీ ఫ్యామిలీకి భారీ ఊరట

Published on Fri, 02/16/2024 - 12:07

పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీకి భారీ ఊరట లభించింది. గుజరాత్‌లోని రిలయన్స్ గ్రీన్స్‌లో చిన్నకుమారుడు అనంత్‌ వివాహాన్ని జరపడానికి వీల్లేందంటూ దాఖలైన పిటీషన్‌ను  ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది.  కేవలం భయం ఆధారంగా స్వీకరించలేమంటూ  ధర్మాసంన ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. రాహుల్ నరులా అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశాలించిన కోర్టు మేరకు  తీర్పునిచ్చింది

ఈ ఏడాది జూన్‌లో వ్యాపారవేత్త వీరేన్‌ మర్చంట్‌ కుమార్తె రాధిక మర్చంట్‌తో అనంత్ అంబానీ పెళ్లి వేడుకకు అన్ని ఏర్పాటు శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు  మెగా జూలో  పెళ్లి అంటే ఇక్కడ జంతువులకు హాని కలిగిస్తుందనీ, ముఖేష్ అంబానీకి చెందిన మెగా జూ (గ్రీన్స్ జూలాజికల్, రెస్క్యూ అండ్‌ రిహాబిలిటేషన్ సెంటర్‌ GZRRC)పై చర్యలు తీసుకునేలా యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియాను ఆదేశించాలని కోరుతూ న్యాయవాది, జంతు ప్రేమికుడు రాహుల్ నరులా హైకోర్టును ఆశ్రయించారు. అయితే దీన్ని పరిశీలించి న్యాయమూర్తులు సురేష్ కుమార్ కైట్, గిరీష్ కథ్‌పాలియాతో కూడిన ధర్మాసనం దీనిని స్వీకరించలేమని పేర్కొంది. జంతు సంస్థలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించేందుకు త్రిపుర హైకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన హై-పవర్డ్ కమిటీ (HPC) ఈవెంట్‌ను పర్యవేక్షించేందుకు, జంతువులకు ఎలాంటి హానీ జరగకుండా  అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.

(టేస్టీగా..కూల్‌..కూల్‌గా, ఐస్‌ క్రీమ్స్‌ ఇలా చేస్తే పిల్లలు ఫిదా!)

ప్రైవేట్ ఈవెంట్‌లో జంతువులను ఉపయోగిస్తారనే ఆరోపణ నిరాధారమైందని సెంటర్‌ తరపు న్యాయవాది వాదించారు. కాగా   గుజరాత్‌లోని జామ్‌నగర్‌కి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోతీ ఖావ్డి గ్రామంలో280 ఎకరాల విస్తీర్ణంలో ఈ జూపార్క్ ఉంది.  అంతేకాదు దీన్ని అనంత్పె అంబానీ పెట్ ప్రాజెక్ట్‌గా,  బ్రెయిన్ ఛైల్డ్ ప్రాజెక్ట్‌గా  భావిస్తారు. అటు అనంత్‌ -రాధిక పెళ్లిపై అధికారికర ధృవీకరణ ఏదీ రానప్పటికీ,  ఈ గ్రాండ్‌ వెడ్డింగ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే వీరి పెళ్లి కార్డు ఒకటి  ఇంటర్నెట్‌లో సందడి చేస్తోంది. (అంబానీ ఇంట పెళ్లి సందడి: అతిథులకు అదిరిపోయే గిఫ్ట్‌..?!)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)