Breaking News

పాలు కలిపిన టీ తాగే అలవాటు.. ఇలా మొదలైంది...

Published on Sun, 10/19/2025 - 12:13

మన సంస్కృతిలో భాగంగా కలిసిపోయినప్పటికీ టీ జన్మస్థలం భారత దేశం కాదు  ఈ పానీయంపై చైనా గుత్తాధిపత్యాన్ని సవాలు చేయడానికి  బ్రిటిష్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీ 19వ శతాబ్దంలో పెద్ద ఎత్తున టీ సాగును ప్రవేశపెట్టింది. మొదట్లో, భారతీయులను అది లక్ష్యం చేసుకోలేదు.  టీ ఎగుమతి ఇతర ప్రముఖ సంపన్న దేశాలకు ఉండేది. కానీ అనూహ్యంగా  భారతీయులు ఆ విదేశీ అలవాటును తమ స్వంతం చేసుకున్నారు.

అయితే 1900లలో బ్రిటిష్‌ కంపెనీలు స్థానికంగా టీని ప్రోత్సహించడం ప్రారంభించినప్పుడు, దానిని మరింత రుచికరంగా మార్చడానికి  పాలు  చక్కెరను జోడించమని వారే మనవాళ్లని ప్రోత్సహించారు. ఈ ఆలోచన వారు ఊహించిన దానికంటే బాగా పనిచేసింది. భారతీయులు ఆ పానీయాన్ని స్వీకరించడమే కాదు, దానిని తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు.

కలిసి...కరిగిపోయి...
భారతీయ వంటశాలలలో పాలు అంటే ఒక పదార్ధం కంటే ఎక్కువ ఇది పోషణ, స్వచ్ఛత సంప్రదాయం. బాల్యంలో హల్దీ దూద్‌ గ్లాసుల నుంచి పండుగ స్వీట్ల వరకు, పాలు అనేక రకాలుగా భారతీయుల్ని వారి అభిరుచుల్ని అంటిపెట్టుకునే ఉంటుంది. కాబట్టి అది మనం తాగే టీలో కూడా సులభంగా, వేగంగా కలిసిపోయింది.  

భారతదేశంలోని చిన్న పట్టణాలు  మార్కెట్లలో టీ వ్యాపించడంతో, ప్రతి ప్రాంతం దాని స్వంత రుచులను దానికి జోడించింది.ఆ తర్వాత మసాలా చాయ్‌ వచ్చింది.  వెచ్చదనం కోసం అల్లం, సువాసన కోసం ఏలకులు, కిక్‌ కోసం లవంగం, గాఢత కోసం దాల్చిన చెక్క... పాల తర్వాత టీలో కలిపే జాబితా లో చేరిపోయాయి.

చాయ్‌...రాజా చాయ్‌...
20వ శతాబ్దం మధ్య నాటికి, చాయ్‌వాలా రైల్వే ప్లాట్‌ఫామ్‌లు  వీధి మూలలను ఆక్రమించి, ప్రయాణికులకు  కార్మికులకు ఆవిరితో కూడిన పాల టీ గ్లాసులను అందించారు. వలసరాజ్యాల ఎగుమతిగా ప్రారంభమైన ఈ పానీయం రోజువారీ అలవాటుగా  ఎన్ని విధాలుగా అయినా మార్పు చేర్పులకు అనుకూలించేదిగా మారింది. 

భాష, కులం  వంటకాల ద్వారా వ్యత్యాసాలున్న మన దేశంలో, టీ  ఒక విధంగా ఉమ్మడి అభిరుచిని నిర్మించింది. ఇద్దరు అపరిచితులు ఒక మాటను పంచుకోకపోవచ్చు, కానీ పంచుకున్న కప్పు చాయ్‌ ఎంతటి దూరాన్ని అయినా కరిగించగలదు అన్నంతగా ప్రభావాన్ని చూపుతోంది.

మరికొన్ని దేశాలకూ విస్తరించిన మిల్క్‌ టీ...
భారతదేశం వెలుపల, టీ వేరే రూపాల్లో సంచరిస్తోంది. టీ పుట్టిన చైనా  జపాన్‌లలో తేనీటి స్వచ్ఛతకు విలువ ఇస్తారు. వారి దృష్టి ఆకుపై, దాని వాసనపై  మాత్రమే ఉంటుంది. వారు పాలు కలపరు.  బ్రిటిష్‌ వారు కూడా పాలు అతి తక్కువగానే కలుపుతారు.

మన దేశం కాకుండా యునైటెడ్‌ కింగ్‌డమ్, ఇండియా, పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక, మలేషియా, సింగపూర్, హాంకాంగ్, తైవాన్‌  థాయిలాండ్‌ వంటి దేశాలలోనూ పాలతో టీ అనే అలవాటు ఉన్నప్పటికీ మన దేశంతో పోటీపడే స్థాయిలో కాదు. మంగోలియా, ఇథియోపియా, బురుండి, కెన్యా ఆఫ్రికాలోని అనేక ఇతర దేశాలు ముఖ్యమైన మిల్క్‌ టీ సంప్రదాయాలు  ఉన్నాయి.

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు